Take a fresh look at your lifestyle.

లక్షద్వీప్‌ ఎం‌పి కేసులో నేడు విచారణ

లోక్‌సభ సభ్యతం పునరుద్దరించాలని కేసు
న్యూ దిల్లీ, మార్చి 27 : లక్షద్వీప్‌కు చెందిన ఎన్సీపీ నేత ఎంపీ మహమ్మద్‌ ‌ఫైజల్‌ ‌కేసును సుప్రీమ్‌ ‌కోర్టు నేడు మంగళవారం విచారించనుంది.  ఓ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే ఆ కేసులో ఎంపీ ఫైజల్‌ను అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. ఆ కేసు తీర్పుపై కేరళ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే అనర్హత వేటును సవాల్‌ ‌చేస్తూ ఫైజల్‌ ‌సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును మంగళవారం విచారించనున్నట్లు ఇవాళ అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. సీజేఐ డీవై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌పీఎస్‌ ‌నర్సింహా, జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనున్నది.

సీనియర్‌ అడ్వకేట్‌ ఏఎం ‌సింఘ్వీ.. లక్షద్వీప్‌ ఎం‌పీజైల్‌ ‌తరపున కోర్టులో వాదించనున్నారు. హైకోర్టు స్టే ఇచ్చినా లోక్‌సభలో మాత్రం ఫైజల్‌ను మళ్లీ ఎంపీగా నియమించడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. హత్యాయత్నం కేసు లో స్థానిక కావరాటి కోర్టు జనవరి 11వ తేదీన ఎంపీ ఫైజల్‌కు శిక్ష విధించింది. అయితే ఆ రోజు నుంచి ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు అయినట్లు సెక్రటేరియేట్‌ ‌తన నోటిఫికేషన్‌లో తెలిపారు. జనవరి 25వ తేదీన కావరాటి కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చిందని, కానీ ఇంత వరకు లోక్‌సభ సెక్రటేరియేట్‌ ‌తన అనర్హత వేటు నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోలేదని ఆరోపించారు.

Leave a Reply