హైదరాబాద్లో వర్షాల కారణ:ంగా డెబ్బతిన్న ఇళ్లకు సహాయం పంపిణీలో జరిగిన అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరపా•లని టీజేఎస్ డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేసినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాపురం వెంకటరెడ్డి వెల్లడించారు. జీహెచ్ఎంసిలో కురిసిన వర్షాల కారణంగా ఇళ్లు, వస్తు సామాగ్రి కోల్పోయిన బాధితులకు పంపిణీ కోసం ఉద్దేశించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని పిటిషన్లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఉద్దేశ్యపూర్వకంగా అనర్హులకు డబ్బు పంపిణీ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసిందని పేర్కొంది. అసలైన వరద బాధితులకు కాకుండా టీఆర్ఎస్ నేతలు తమ అనుచరులకు, వచ్చే జీహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమకు తెలిసిన వారికి మాత్రమే నగదు పంపిణీ చేశారని ఆరోపించారు. దీనిపై నగరవ్యాప్తంగా బాధితులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతల ఇళ్ల ముందు నిరసన తెలిపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వరద బాధితులకు వర్షం ఉపశమనం పారదర్శకంగా నిర్వహించబడలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాబోయే జీహెచ్ఎంసి ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందేందుకే టీఆర్ఎస్ కార్యకర్తలు వరద సాయాన్ని తమకు ఇష్టం వచ్చం వారికి పంచారని వివరించారు. పంపిణీ చేసిన మొత్తంలో కొంత భాగాన్ని పార్టీ కార్యకర్తలు తీసుకుంటున్నారని పిటిషన్లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసి పరిధిలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం రూ . 550 కోట్లు మంజూరు చేయగా, రూ.387 కోట్లను అధికారులు విత్ డ్రా చేశారని పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు పంపిణీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. నగదు పంపిణీ ఏకపక్షంగా జరిగిందనీ, వీటిలో అధిక మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చిందని స్పష్టం చేశారు. ఈ విషయాలన్నింటిపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని తెలంగాణ జన సమితి డిమాండ్ చేస్తున్నదని లోకాయుక్తకు సమర్పించిన పిటిషన్లో టీజేఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు.