Take a fresh look at your lifestyle.

ఆత్మీయత అనురాగం

దూరపు కొండలు నునుపు అన్న చందం..
దూరం దూరం గా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు..
దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..!

దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు
దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.!

దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు..
దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు!

మబ్బుల్లో మెరుపుల్లా సముద్రంలో కెరటాల్లా
ఈ ఆత్మీయతానురాగాలు
క్షణ బంగురాలు
రంగుల బొంగరాలు!

అంతా మాయా జాలం
ఆత్మీయ అనురాగాలకు చెల్లిందీ కాలం.!
ఈర్షా ద్వేషాల నడుమ
అసూయ అసహనాలతో
వెళ్ళదీస్తుంది ఈ లోకం.!!

– ఎన్‌.‌రాజేష్‌, ఎమ్మెస్సి, (కవి,రచయిత,జర్నలిస్ట్), ‌హైదరాబాద్‌.

Leave a Reply