Take a fresh look at your lifestyle.

ఉత్తర ప్రదేశ్‌లో.. రాజ్యం సృష్టించిన దమనకాండ..!

“2019 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అయితే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నది మాత్రం బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్లో ఇరవైఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ జరిగిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. వీటి వెనక ఉత్తర ప్రదేశ్‌ ‌పోలీసులు, అతివాద సంస్థలు ఉన్నాయి అన్న ఆరోపణలు వచ్చాయి.  ప్రభుత్వ యంత్రాంగం చేసిన హింస ఎక్కువ అన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో పలువురు సామాజిక వేత్తలు ఉత్తరప్రదేశ్లో నిజ నిర్ధారణ చేసేందుకు ఒక బృందంగా వెళ్లి పర్యటించారు. ఈ బృందంలో పలువురు ప్రముఖ సామాజిక వేత్తలు ఉన్నారు. వీరిలో మేధాపాట్కర్‌ ఒకరు. ఆమెతో చెమట చుక్కలు ప్రత్యేకంగా మాట్లాడాయి.”

చెమట చుక్కలు , న్యూఢిల్లీ :చెమట చుక్కలు :- ఉత్తరప్రదేశ్లో జరిగిన నిరసన కార్యక్రమాలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత, ఉత్తర ప్రదేశ్‌ ‌లో పర్యటించిన మీకు అక్కడ ఎటువంటి పరిస్థితులు కనిపించాయి..?

మేధాపాట్కర్‌ :- ఉత్తరప్రదేశ్లో మాకు రాజ్యం సృష్టించిన దమనం కనిపించింది. పరిపాలనా యంత్రాంగం మొత్తం హింసను ప్రేరేపించే ఉగ్రవాద వ్యవస్థగా వ్యవహరించింది. అందులో పోలీసుల ప్రమేయం లేదు. అని ఉత్తర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి చెబుతున్నారు.. ఇది పూర్తిగా సత్య విరుద్ధం. పోలీసులతో పాటు హిందూ మతం పట్ల ప్రేమ అని చెబుతున్న కొంతమంది అతివాదులు కూడా హింసను సృష్టించారు. వీరంతా కలిసి భయాందోళనలకు గురి చేసే వాతావరణాన్ని సృష్టించారు. నిరసన ప్రదర్శనలో పాల్గొనని వారు చాలామంది హింసకు గురి అయి మరణించారు. నిరసన ప్రదర్శనలో పాలుపంచుకొని వారు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లకు పోయి కంప్లైంట్‌ ఇస్తే.. కనీసం ఆ కంప్లైంట్‌ ‌లను పోలీసులు నమోదు చేయలేదు. ఎఫ్‌ఐఆర్లు నమోదు చేయవద్దని పైనుంచి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు చెప్పారని బాధితులు మా ముందు వాపోయారు. ముజఫర్‌ ‌నగర్‌ ‌లో హింస జరిగిన ఏడు రోజుల తర్వాత మేము ముజఫర్‌ ‌నగర్‌ ‌పర్యటించాం. ముజఫర్‌ ‌నగర్‌ ‌లో జరిగిన హింసాత్మక సంఘటనలుపై ఒక్కరు కూడా ఫిర్యాదు చేయడానికి ధైర్యం చేయలేదు. ఒకే ఒక్కరు పోలీస్‌ ‌కంప్లైంట్‌ ఇవ్వడానికి ధైర్యం చేసినప్పటికీ ఆ కంప్లైంట్‌ ‌ను నమోదు చేయలేదు. ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలామంది ప్రజల ఆస్తులను జప్తు చేస్తున్నారు. గతంలో గుజరాత్లో మత సంఘర్షణలు జరిగినప్పుడు ఏ తీరుగా అయితే మైనారిటీల ఆస్తులను కబళించారో అదే తరహా ఉత్తరప్రదేశ్లో మైనారిటీల ఆస్తులను కబళించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిపాటి ఆస్తి కలిగిన ముస్లింల ఇళ్లల్లోకి చొరబడి దోచుకున్నారు. మరో వారం రోజుల్లో పెళ్ళికి సిద్ధంగా ఉన్నా ఎమ్మెస్సీ చదువుకున్న రూకయ్య నివాసంలో చొరబడి ఆమె పెళ్లి కోసం సిద్ధం చేసిన నగలను దోచుకున్నారు అంతేకాకుండా ఆమె తండ్రి తాత ఎదురుగా ఆమె తలపై ఇనుప రాడ్‌ ‌తో గట్టిగా కొట్టారు. రూకయ్య గాయాలతో నేలపై ఒరిగిపోయింది. 70 ఏళ్ల రూకయ్య తాతను కూడా కొట్టారు.

చెమట చుక్కలు :- ఇదంతా పోలీసులు చేశారని మీరు ఆరోపిస్తున్నారా?
మేధా పాట్కర్‌ :– అవును నేను చెబుతున్నది నిజమే. బాధితురాలు ఈ విషయాలన్నీ మాకు తెలియజేసింది. మగ పోలీసులు మహిళలను  కొట్టారు. పోలీసులు రాజకీయ పార్టీ మధ్య ఒక నెక్స్ ఏర్పడి ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీస్‌ ‌కంప్లైంట్‌ ఇవ్వడానికి ధైర్యం లేని పరిస్థితిలో ఉత్తరప్రదేశ్‌ ‌ముస్లిములు ఉన్నారు .ఎంపీ సంజయ్‌ ‌బాల్యన్‌ ‌హస్తం కూడా ఈ ఘటనలో వెనుక ఉంది.

చెమట చుక్కలు :- మీరు చాలా కాలంగా యాక్టివిజమ్‌ ‌లో ఉన్నారు. గతంలో కూడా భారత దేశంలో మత ఘర్షణలు జరిగాయి గతంలో జరిగిన మత ఘర్షణల సంఘటనలతో ప్రస్తుత సంఘటనలను సరి పోల్చ వచ్చా..
మేధా పట్కర్‌ :- ఈ ‌సంఘటనలను నేను జలియన్‌వాలా సంఘటనతో పోల్చి చూస్తాను. జలియన్వాలా బాగ్‌ ‌లో చనిపోయిన
అంత  మంది ప్రస్తుత ఘటనలలో మరణించక పోవచ్చు. కానీ మీరు గమనించండి, ఉత్తరప్రదేశ్‌ ‌లో వివిధ ప్రాంతాలలో ఇరవై ఒక్క వేల మంది బాధిత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో చాలా మంది పోలీసులు వరకు పోవడానికి కూడా భయపడుతున్నారు. ప్రజలు కలిసికట్టుగా వెళ్లి అజ్ఞాతలుగా కేసు నమోదు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా వెళుతున్న వారి లో ఒక్కొక్క ఫిర్యాదుకు  సుమారు ఏడు వందల నుంచి రెండు వేల మంది బాధితులు కలసికట్టుగా వెళుతున్నారు. గతంలో కూడా మతఘర్షణలు జరిగినప్పుడు బాధితులు ఈ తీరుగా ప్రవర్తించటం చూశాను. ప్రస్తుతం అదే తరహాలో బాధితులు సామూహికంగా పోయి తమ ఫిర్యాదులు నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఉత్తరప్రదేశ్‌ ‌లో ఉన్న సామాజిక కార్యకర్తలపై 307 చట్టాన్ని విధిస్తున్నారు. పోలీసు వ్యవస్థ ఇంత దమనం చేస్తుంటే కనీసం ఉత్తరప్రదేశ్లో న్యాయవ్యవస్థ అయినా ప్రజలకు అండగా నిలుస్తున్నదా అంటే అది కూడా లేదు. ఒకపక్క పోలీస్‌ ‌వ్యవస్థ చేస్తున్న హింస, మరోపక్క న్యాయవ్యవస్థ మౌనం మధ్య ఉత్తరప్రదేశ్‌ ‌వాసులు నలిగిపోతున్నారు.

చెమట చుక్కలు :- ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో కమ్యూనల్‌ ‌వాతావరణం చోటు చేసుకుంటుందా..?
మేధా పట్కర్‌ :- ‘‌హూ కిల్డ్ ‌కర్కారే’ పుస్తకాన్ని యస్‌.‌యం. ముశ్రిఫ్‌ ‌రాశారు ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్ధమవుతుంది..హేమంత్‌ ‌కర్కారేని చంపడానికి ఓ కమ్యూనల్‌ ‌వ్యవస్థను ఎలా తయారు చేశారో.. అటువంటి వ్యవస్థనే ఉత్తరప్రదేశ్లో తయారు చేస్తున్నారు.జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీలో, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో చొరబడిన చొరబాటుదారులు.. దేశంలో చొరబడిన చొరబాటుదారులు అంటూ మాట్లాడుతున్నారు. వీరిని ఆపేది ఎవరు..? స్టూడెంట్స్ ఎన్నుకున్న స్టూడెంట్‌ ‌లీడర్‌ ఐషి ఘోష్‌ ‌ను మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిని కాపాడుతున్నది పాలిస్తున్న వారు. వీరిని ఆపేదెవరు..? ఢిల్లీ పోలీసులు అయితేనేమి.. ఉత్తరప్రదేశ్‌ ‌పోలీసులు అయితేనేమి.. లా అండ్‌ ఆర్డర్‌ ఏమాత్రం కాపాడలేక పోతున్నారు. పాలకపక్షం కోరుతున్న పనిని వీరు చేస్తున్నారు. ధరా పూరి వంటి మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ‌కేసు నమోదు చేస్తే మెజిస్ట్రేట్‌ ‌విచారణ చేపట్టడానికి సిద్ధంగా లేరు. బలవంతంగా ఈ కేసుపై విచారణ చేసేలా ఒత్తిడి తీసుకు వచ్చాము. ఇటువంటి పరిస్థితులు దేశ యువతీయువకుల ముందు ఉండటం వలన వారు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాలు మరింత ఎక్కువ అవుతాయి అని అనిపిస్తున్నది.ఎన్పీఆర్‌, ఎన్సీఆర్‌ అనే చీకటి చట్టాల వలన కేవలం ముస్లింలు మాత్రమే కాదు మెజారిటీ పేద హిందువులు కూడా బాధితులు కానున్నారు. బహు సంఖ్యాక ప్రజలు కాగితాల పైన కాకుండా వాస్తవ ప్రపంచంలో బతుకుతున్నారు. వీరందరూ కాగితాలు ఎక్కడి నుంచి తెస్తారు.

చెమట చుక్కలు :- మీ తదుపరి కార్యాచరణ ఏమిటి..?
మేధాపాట్కర్‌ :- ‌దేశంలో యువతీ యువకులు చేస్తున్నా న్యాయబద్ధమైన పోరాటానికి సామాజిక కార్యకర్తలుగా మేము అండగా నిలుస్తాము. మేమే కాదు ట్రేడ్‌ ‌యూనియన్లు, రైతు సంఘాలు.. విద్యార్థులకు అండగా నిలవాలని పిలుపునిస్తాము.. ఆ మేరకు విద్యార్థులకు మద్దతుగా నిలిచే ప్రయత్నాలు కూడా చేస్తాము అని మేధాపాట్కర్‌ ఇం‌టర్వ్యూ ముగించారు.

Leave a Reply