Take a fresh look at your lifestyle.

కొరోనా టెస్టులు తగ్గించడంలో ఆంతర్యం..?

  • ఎందుకు లాక్‌డౌన్‌ ‌దిశగా ఆలోచించడం లేదు
  • తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

 ‌రాష్ట్రంలో కొరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గించడంపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది.  కొరోనా తీవ్రత పెరుగుతుంటే పరీక్షలు ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నించింది. విచారణకు డీహెచ్‌ శ్రీ‌నివాసరావు, డీజీపీ మహేందర్‌ ‌రెడ్డిలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీహెచ్‌ ‌మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 49.97 శాతం పడకలు నిండాయని వివరించారు. ఆక్సిజన్‌ ‌రాష్ట్రానికి రాకుండా తమిళనాడు అడ్డుకుంటోదని కోర్టుకు తెలిపారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ ‌రప్పిస్తామని అదనపు ఎస్‌జే కోర్టుకు వివరించారు. ఇకపోతే రాష్ట్రంలో కొరోనా టెస్టులు ఎందుకు పెంచడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

కేవలం రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెప్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే రాష్ట్రంలో టెస్టులు పెంచామని పబ్లిక్‌ ‌హెల్‌త్డైరెక్టర్‌ ‌కోర్టుకు తెలపగా.. దీనిపై స్పందించిన హైకోర్టు ఒక్క రోజు కూడా లక్ష టెస్టులు దాటలేదని విమర్శించింది. అసలు లాక్‌డౌన్‌ ‌దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం ప్రశ్నించింది. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్‌ ‌డేటాను పూర్తి వివరాలతో  సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే రోజుకు లక్ష టెస్టులు చేయాలని ఆదేశించింది.

Leave a Reply