Take a fresh look at your lifestyle.

రైతు వేదికలకు ఇంటర్నెట్‌ ‌సౌకర్యం

  • వ్యవసాయ వర్సిటీతో అనుసంధానం
  • కేంద్రం అవార్డులిస్తుంది కానీ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు
  • జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమం
  • ప్రతి ఇంటికి కెసిఆర్‌ ‌మేనమామ అయ్యారు
  • సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యమ్రాల్లో పాల్గొన్న మంత్రి కెటిఆర్‌
  • ‌మోహినికుంటలో డబుల్‌ ఇళ్ల ప్రారంభం

రైతు వేదికలకు ఇంటర్నెట్‌ ‌సౌకర్యం కల్పించడంతో పాటు ప్రొఫెసర్‌ ‌జయశకర్‌ ‌వ్వయసాయ విశ్వవిద్యాలయంతో అనుసంధానం చేస్తామని మంత్రి కెటిఆర్‌ ‌ప్రకటించారు. శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందేలా చేస్తామని అన్నారు. రైతువేదికలు రైతులకు మార్గదర్శకాలుగా ఉండాలన్నదే సిఎం కెసిఆర్‌ ఆకాంక్ష అని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కెటిఆర్‌ ‌రైతువేదికను ప్రారంభించారు. మద్దికుంటలో రైతువేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. అక్కడ్నుంచి చీకోడు బయల్దేరి.. రైతువేదిక, గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేసారు. ముస్తాబాద్‌, ఆవునూరులో రైతు వేదికలను కేటీఆర్‌ ‌ప్రారంభించారు. హరిదాసునగర్‌లో గ్రామ కమ్యూనిటీ హల్‌, ‌శ్మశానవాటిక, ప్లలెప్రకృతివనం ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఉత్తమ గ్రామపంచాయితీ అవార్డుకు ఎంపికైనందుకు పాలకవర్గానికి సన్మానం చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, ‌బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు.. కానీ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులగా ముందుకెళ్తున్నాయని చెప్పారు. 75 ఏండ్ల స్వాతంత్య్రలో ఏ పార్టీ చేయని అభివృద్దిని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. వేసవి కాలంలోనూ ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేంద్రం అవార్డులు మాత్రమే ఇస్తుంది కానీ నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులపై మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అవార్డులు ఇస్తుంది కానీ రాష్ట్రానికి మాత్రం నిధులు ఇవ్వడం లేదని చెప్పారు. నీతి ఆయోగ్‌ ‌చెప్పినా కేంద్రం నుంచి రాష్టాన్రికి పైసా రాలేదని మండిపడ్డారు. కేవలం తీసుకోవడమే బీజేపీ ప్రభుత్వ పాలసీ అని తెలిపారు. మాకు నిధులు ఇవ్వకున్నా పర్లేదు కానీ.. మా దగ్గరకు వొచ్చి గొప్పలు చెప్పొద్దని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలకు మెదడు మోకాళ్లలో ఉందని మంత్రి కేటీఆర్‌ ‌సెటైర్లు వేశారు.

మోహినికుంటలో డబుల్‌ ఇళ్ల ప్రారంభం
రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌ ‌ప్రతి ఇంటికి ఓ మేనమామలా మారి ఆదుకుంటున్నారని మంత్రి కెటిఆర్‌ అన్నారు. డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ఇల్లుతో పాటు పెళ్లికి కల్యాణలక్ష్మి కింద లక్షాపదహారు వేలు అందచేస్తున్నారని అన్నారు. ముస్తాబాద్‌ ‌మండలం మోహినికుంటలో పోత్గల్‌ ‌వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్‌ ‌బంక్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. అనంతరం కేసీఆర్‌ ‌నగర్‌లో నూతనంగా నిర్మించిన 65 డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లనుమంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. ఆ తర్వాత లబ్దిదారులు ఆ ఇండ్లలో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ ‌మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ‌పార్టీతోనే సాధ్యమైంద స్పష్టం చేశారు. మోహినికుంటలో డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లు ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మరో 6,825 ఇండ్లు జిల్లాలో కట్టుకోబోతున్నామని తెలిపారు.

గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్‌ ‌నాయకులు ప్రజలకు మూడు చెరువుల నీళ్లు తాగించారని, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కోసం రూ. 75 వేలు వారు ఖర్చు చేస్తే.. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మాత్రం పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో రూ. 5 లక్షలతో డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లను కట్టించి ఇస్తున్నామని స్పష్టం చేశారు. మోహినికుంట గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, కానీ తెలంగాణలో మాత్రం అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులగా ముందు కెళ్తున్నాయని చెప్పారు. 75 ఏండ్ల స్వాతంత్య్రలో ఏ పార్టీ చేయని అభివృద్దిని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. వేసవి కాలంలోనూ ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మోహినికుంటలో పెట్రోల్‌ ‌బంక్‌, ‌డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లు ప్రారంభం ప్రగతికి మార్గం అని అన్నారు.

Leave a Reply