ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకోండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించనున్న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురష్కరించుకోని పాఠశాలలో అంతర్జాతీయ దినోత్సవ ముందస్తు వేడుకలను గురువారం ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా పాఠశాల అవరణలో విద్యార్థులు అమ్మ అకారంలో కూర్చుని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గోన్నారు.