Take a fresh look at your lifestyle.

డిసిసిబి పదవుల కోసం.. టీఆర్‌ఎస్‌లో కుమ్ములాటలు

  • ప్రగతిభవన్‌ ‌వేదికగా పావులు కదుపుతున్న నేతలు

Suspensions Start in TRS Party
రాప్ట్రవ్యాప్తంగా  ప్రాథమిక వ్యవసాయ కో-ఆపరేటివ్‌  ‌సొసైటీలకు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో, జిల్లా ఎన్నికలకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధమైంది. అయితే జిల్లా కో.- ఆపరేటివ్‌ ‌బ్యాంక్‌ ‌చైర్మన్‌ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ ‌రాజకీయ వర్గపోరుకు వేదికలయ్యాయి.  రాష్ట్రవ్యాప్తంగా  905 సంఘాల్లో ఎన్నికల ప్రకియ్ర పూర్తయ్యింది. అన్నీ జిల్లాల్లో ఈ నెల 18, 19 తేదీలలో  జిల్లా కో.ఆపరేటివ్‌ ‌సెంట్రల్‌బ్యాంక్‌ (‌డీసీపీబి) చైర్మన్‌ల ఎన్నిక ప్రక్రియ జరుగనున్నది. 90శాతం పైగా సొసైటీలు టీఆర్‌ఎస్‌ ‌బలపరచిన వారే గెలిచినప్పటికీ, ప్రతీ జిల్లాలో టీఆర్‌ఎస్‌లోని వర్గపోరే అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఈ విషయం టీఆర్‌ఎస్‌  ‌వర్గాల్లో  చర్చ జరుగుతున్నది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన  తొమ్మిది జిల్లాల్లో కో-ఆపరేటివ్‌ ‌సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌చైర్మన్‌ల ఎన్నికల ప్రకియ్ర జరగాల్సి ఉంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కొ.ఆపరేటివ్‌ ‌బ్యాంక్‌ ‌చైర్మన్‌ను ఎన్నుకుంటారు. టీఆర్‌ఎస్‌ ‌విద్యార్థి విభాగం రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన పల్లా ప్రవీణ్‌రెడ్డికి నల్లగొండ జిల్లా సహకార బ్యాంక్‌ ‌చైర్మన్‌ ‌పదవి వరించే అవకాశాలు ఉన్నాయి.

 

ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నల్లగొండలలో జిల్లా మంత్రుల మధ్య ఘర్షణ తీవ్రస్థాయిలో ఉందని అంటున్నారు.నల్లగొండలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తాను బలపరచిన అభ్యర్థికే జిల్లా కో.ఆపరేటివ్‌ ‌బ్యాంక్‌ ‌చైర్మన్‌ ‌పదవి కావాలని ప్రయత్నం చేస్తుండగా, పల్లా రాజేశ్వరరెడ్డి తన అనుచరుడికే ఈ పదవిని కట్టబెట్టాలని ప్రగతిభవన్‌నుంచే పావులు కదుపుతున్నారు. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలు తమ తమ బంధువులను, తమ దగ్గరి జిల్లా నాయకులకు చైర్మన్‌ ‌పదవిని ఇప్పించాలని  టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌పైన ఇద్దరు నాయకులు వత్తిడి చేస్తున్నారు.మహబూబ్‌నగర్‌లో మున్సిపల్‌ ఎన్నికల నుంచే ఘర్షణ వాతావరణం ఉన్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ‌బలపరిచే అభ్యర్థికి పదవి ఇవ్వవద్దని మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు,సీ.లక్ష్మారెడ్డిలు అధిష్ఠానానానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జూపల్లి కృష్ణారావు తన అనుచరుడిని మహబూబ్‌నగర్‌ ‌సహకార బ్యాంక్‌ ‌చైర్మన్‌ను చేసేందుకు  శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో తమకు నమ్మకమైన రాజకీయ నాయకుడు పదవిలో ఉండాలని, అతినితో జిల్లా రాజకీయ చక్రాల తిప్పాలని రాష్ట్ర నాయకులు భావించడం ఒక రాజకీయ వ్యవహారం.

 

నిజామాబాద్‌లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన కుమారుడికి ఈ రాజకీయ హోదా ఇప్పంచాలని తన వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రగతిభవన్‌లోనే మకాం వేసిన వేముల ప్రశాంత్‌రెడ్డి అక్కడినుంచే పావులు కదుపుతున్నారు.కరీంనగర్‌లో ఈటెల రాజేందర్‌, ‌బోయినపల్లి వినోద్‌కుమార్‌ల మధ్య పోరు జరుగుతున్నది.ఖమ్మంలో  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ‌మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు  జిల్లాలో తమ అనుచరులకే  జిల్లా బ్యాంక్‌ ‌చైర్మన్‌ ‌పదవిని ఇవ్వాలని పట్టుపడుతున్నారు.  మొత్తం మీద తొమ్మిది జిల్లాలో  సహకార బ్యాంక్‌ ‌చైర్మన్‌  ‌పదవిపోరు ఒక రాజకీయ రసవత్తర  నాటకంగా మారింది. రాష్ట్ర నాయకులు, మంత్రులు, సీనియర్‌ ‌నాయకులు  తమ మాట నెగ్గాలనే పట్టుదలతో ప్రగతిభవన్‌ ‌కేంద్రంగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Leave a Reply