Take a fresh look at your lifestyle.

జంబ్లింగ్‌ లేకుండా 1‌నుంచి ఇంటర్‌ ‌ప్రాక్టికల్స్

Intermediate Practical Exams

‌రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ ‌ప్రాక్టికల్‌ ‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ ‌బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. అయితే జంబ్లింగ్‌ ఉం‌డదని స్పష్టమయ్యింది. ప్రాక్టికల్‌ ‌పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామని అధికారులు అన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 6,48,829 మంది విద్యార్థులు హాజరవుతారు. వీరిలో ఎంపీసీలో 3,52,357 మంది, బైపీసీలో 2,06,510 మంది, ఒకేషనల్‌ ‌కోర్సుల్లో 89,962 మంది విద్యార్థులున్నారు.

ఇంటర్‌ ‌ప్రథమ సంవత్సరంలో 3,24,469 మంది, ద్వితీయ సంవత్సరంలో 3,24,360 మంది ప్రాక్టికల్‌ ‌పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ ‌థియరీ పరీక్షలకు 9,65,815 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. ఇం దులో ప్రథమ సంవత్సరంలో 4,80,516 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,85,299 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. ప్రాక్టికల్‌ ‌పరీక్షలకు 1,506, థియరీ పరీక్షలకు 1,339 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. వీలైతే వచ్చే ఏడాది నుంచి జంబ్లింగ్‌ ‌విధానంలో ప్రాక్టికల్స్‌ను నిర్వహించే ప్రయత్నం చేస్తామన్నారు.

Tags: Intermediate, Practical Examinations,the State, 1st February

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply