రాష్ట్ర ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్ను తెలంగాణ ఇంటర్ బోర్డు గురువారం విడుదల చేసింది. విద్యాసంవత్సరం మొత్తం పనిదినాలు 182 రోజులు. దసరాకు 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులు మాత్రమే సెలవులు.
వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఇంటర్ పరీక్షల నిర్వహిస్తారు. అకడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే 2021 ఏప్రిల్ 16గా నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారానే ఇప్పటి వరకు క్లాసులు నిర్వహణ సాగుతోంది. కొరోనా నేపథ్యంలో కాలేజీలను ఇంకా తెరవలేదు. భవిష్యత్ పరిస్థితులను బట్టి మున్ముందు నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.