Take a fresh look at your lifestyle.

ఇబ్బందులు లేకుండా ఇంటర్‌ ‌పరీక్షలు

ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా ఇంటర్మీ డియట్‌ ‌పరీక్ష లను నిర్వహిం చాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధి కారులను ఆదేశి ంచారు. ఇంటర్‌ ‌బోర్డు అధికారులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యా శాఖ, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 4న ప్రారంభం కానున్న ఇంటర్‌ ‌పరీక్షల కోసం నిర్ణీత సమయంలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకుని సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఇంటర్‌ ‌పరీక్షల సమయంలో విద్యుత్‌ ‌సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలనీ, పరీక్షా కేంద్రాలకు ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా బస్సు సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు.

పరీక్షలు సజావుగా సాగేందుకు ప్రత్యేకంగా కంట్రోల్‌ ‌రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అవి పునరావృతం కాకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా సంబంధిత పోలీస్‌ ‌స్టేషన్ల నుంచి ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలపై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. ప్రాక్టికల్‌ ‌పరీక్షలు ఇప్పటికే ప్రారంభమైనందున థియరీ పరీక్షల నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ‌మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో భాగంగా అధికారులు ముందగానే రూట్‌ ‌మ్యాప్‌ ‌సిద్ధం చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌, ‌జిరాక్స్ ‌సెంటర్ల మూసివేత, ప్రశ్నాపత్రాల భద్రత వంటి విషయాలపై కలెక్టర్లు శ్రద్ధ చూపించ•లన్నారు. ఆయా జిల్లాలలో ఫ్లయింగ్‌ ‌స్క్వాడ్‌లు, పికెటింగ్‌ ‌స్క్వాడ్‌లు ఎంత మంది అవసరం అవుతారో చూసుకుని అంతమంది సిబ్బందిని ముందుగానే నియమించుకోవాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply