Take a fresh look at your lifestyle.

నేటి నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు

  • నిముషం ముందే కేంద్రాలకు చేరుకోవాలి
  • రాష్ట్రవ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు
  • అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌
  • ‌విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు

ఇంటర్మీడియట్‌ ‌వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మార్చి 4 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగనున్నాయి. నిముషం నిబంధన అమల్లో ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలను అందుకు సన్నద్దం చేయాలని ఉన్నతవిద్యాశాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ చిత్రారమచంద్రన్‌ ‌సూచించారు. పరీక్షా కేంద్రాలకు గంటముందుగానే చేరుకునేలా తల్లిదండ్రులు శ్రద్ద తీసుకోవాలన్నారు. అలాగే నిబంధనల మేరకు విద్యార్థులు కూడా పరక్షలకు సిద్దంగా ఉండాలన్నారు. ఎలాంటి ఒత్తడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలన్నారు. పరీక్ష సమయానికంటే నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. ప్రతి రోజు పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే నిర్ణీత సమయానికంటే ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులంతా ఆయా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత తిరిగి ముగిసే వరకు బయటకు అనుమ తించరు. పరీక్ష ప్యాడ్‌, ‌హాల్‌టికెట్‌ , ‌పెన్నులు మినహా ఇతర వస్తువులను పరీక్ష హాల్లోకి అనుమతించరు. పరీక్ష రోజున అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉండనుంది. పరీక్షా కేంద్రాల సపంలోని జిరాక్స్ ‌కేంద్రాలను మూసేయాలని ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంపై జీపీఎస్‌తో నిఘా ఏర్పాటు చేయనుండగా.. సీసీ కెమెరాల ఎదుటనే ప్రశ్న పత్రాలను పోలీసుల సమక్షంలో తెరవాల్సి ఉంటుంది. మరో వైపు పరీక్ష కేంద్రాల తనిఖీకి సీనియర్‌ అధ్యాపకులతో ఫ్లయింగ్‌, ‌సిట్టింగ్‌ ‌స్క్యాడ్‌ ‌బృందాలను ఇంటర్‌ ‌విద్యా శాఖ నియమించింది.

ఇంటర్మీడియట్‌ ‌పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్‌ ‌సూపరింటెండెంట్‌, ‌డిపార్టుమెంటల్‌ అధికారులను నియమించారు. అదేవిధంగా కస్టోడియన్స్, 2 ‌ప్లయింగ్‌, ‌ప్రతీ పరీక్ష కేంద్రాన్ని సందర్శించేలా సిట్టింగ్‌ ‌స్కాడ్‌ ‌బృందాలను ఏర్పాటు చేశారు. వీరితోపాటు డీఐఈవో, జిల్లా పరీక్షల విభాగం, హైపవర్‌ ‌కమిటీ అధికారులు సైతం ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. పరీక్షల్లో అక్రమాలు, మాస్‌ ‌కాపియింగ్‌కు చెక్‌ ‌పెట్టేలా ఈ సారి పరీక్ష కేంద్రాలను జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. పరీక్ష జరిగే సమయంతో పాటు పేపర్స్‌ను ప్యాకింగ్‌ ‌చేసే వరకు ఆ కేంద్రంపై ప్రత్యేక నిఘా ఉంటుంది. పరీక్షకేంద్రంలో చీఫ్‌ ‌సూపరింటెంట్‌ ‌తప్ప ఎవ్వరూ సెల్‌ఫోన్లు ఉపయోగించరాదు. పరీక్ష కేంద్రంలో ఎవరైనా సెల్‌ఫోన్‌, ఇతర ఎలక్టాన్రిక్‌ ‌వస్తులు వినియోగిస్తే జీపీఎస్‌ ‌సాయంతో అధికారులకు తెలుస్తుంది. అలా జరిగితే ఆ పరీక్ష కేంద్రం చీఫ్‌ ‌సూపరింటెండెంట్‌తో పాటు డిపార్టుమెంటల్‌ అధికారి, ఇతరులపై కఠిన చర్యలు తీసుకునేలా ఇంటర్మీడియట్‌ ‌బోర్డు నిబంధనను అమలు చేస్తుంది. పరీక్షలో విద్యార్థులను జంబ్లింగ్‌ ‌విధానంలో హాల్‌ ‌టికెట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. జంబ్లింగ్‌ ‌విధానంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇన్విజిలేటర్ల తీరుపై సైతం ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించగానే వారి వద్ద సెల్‌ఫోన్లను చీఫ్‌ ‌సూపరింటెండెంట్‌కు అప్పగించి పరీక్ష ముగిసిన తర్వాత తీసుకోవాలి. కాపియింగ్‌కు పాల్పడినా ప్రోత్సహించినా అధికారులు చర్యలు తీసుకుంటారు. పరీక్ష జరిగే సమయంతో పాటు పేపర్స్‌ను ప్యాకింగ్‌ ‌చేసే వరకు ఆ కేంద్రంపై ప్రత్యేక నిఘా ఉంటుంది.

Tags: Special buses for students, Inter exams from today, mass copying, Exams from March 4 to 18

Leave a Reply