Take a fresh look at your lifestyle.

మార్చి 4 నుండి ఇంటర్‌ ‌పరీక్షలు

Inter exams from March 4

  • పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు
  • కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ : ‌కలెక్టర్‌

‌హన్మకొండ: ఇంటర్మీడియట్‌ ‌బోర్డు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. మార్చి 4వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్న నేపధ్యంలో జిల్లా స్థాయి కోఆర్డినేషన్‌ ‌కమిటి సమావేశంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల పర్యవేక్షణకు ఇన్విజిలెటర్లను, ఫ్లయింగ్‌ ‌స్క్వాడ్‌లను నియమించాలన్నారు. పరీక్షలు ఉదయం 9 నుండి 12గంటల వరకు జరుగుతాయని, పరీక్షా కేంద్రాల్లో విద్యుత్‌ అం‌తరాయం లేకుండా నిరంతరం విద్యుత్‌ ‌సరఫరా చేయుటకు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ ‌శాఖాధికారులను ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల్లో సరైన వెలుతురు, త్రాగునీరు, ఫర్నీచర్‌ ఏర్పాటు చేయాలని అదేవిధంగా పరీక్షా కేంద్రాల రూట్లలో ప్రత్యేక బస్సులను నడపాలని విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. పరీక్షలు నిర్వహించే సమయంలో సమీపంలోని జిరాక్స్ ‌సెంటర్‌లను మూసి వేసే విధంగా ముందస్తుగా ఆదేశాలివ్వాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు చర్యలను చేపట్టాలని సూచించారు. సెంటర్‌ల వద్ద ఫస్ట్ ఎయిడెడ్‌ ఏర్పాటు చేసి సరిపడ ఓఆర్‌ఎస్‌ ‌ప్యాకెట్లను నిలువపెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. జవాబు పత్రాలను భద్రపరుచుటకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూడాలని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ ‌విధించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ఆఫ్‌ ఎస్‌ఎస్‌సి చలపతిరావు, డిఐఇవో ప్రశాంతి, హెచ్‌పిసి సభ్యులు శోభారాణి, డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ ‌లలితాదేవి, ఇంటర్మీడియట్‌ ‌కమిటి సభ్యులు మాధవరావు, సంపత్‌కుమార్‌, ‌పోలీస్‌ ‌శాఖ నుంచి మల్లయ్యస్వామి, ఆర్టీసి సంస్థ నుండి మోహన్‌రావు, విద్యుత్‌శాఖాధికారులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply