Take a fresh look at your lifestyle.

రూ. 500 కోట్లతో.. అన్ని పట్టణాల్లో వెజ్‌ అం‌డ్‌ ‌నాన్‌ ‌వెజ్‌ ‌సమీకృత మార్కెట్లు

  • ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల అభివృద్ధి
  • ఈ నెల 15వ తేదీలోగా కొత్త రేషన్‌ ‌కార్డులు
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పల్లెలు పట్టణాల రూపురేఖలు మారుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మంగళవారం నాడు జిల్లాలోని సదాశివపేట, కోహిర్‌, ‌జహీరాబాద్‌, ‌మొగుడం పల్లి గ్రామాలలో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. సదాశివపేట పట్టణంలోని ఉబ చెరువు సుందరీకరణ(మినీ ట్యాంక్‌ ‌బండ్‌ను) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో సుమారు 20 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. 5.50 కోట్లతో ఉబ చెరువు. సుందరీకరణ పనులు చేపట్టామని, రూ.5 కోట్లతో సెంట్రల్‌ ‌లైటింగ్‌ ‌సిస్టం, 35 లక్షలతో లైబ్రరీ భవనం నిర్మాణం, రూ. 7.75 కోట్ల ఖర్చుతో వైకుంఠధామం, ముస్లిం, క్రిస్టియన్‌ ‌స్మశాన వాటికలను నిర్మించుకున్నామని తెలిపారు. ఒక్కో స్మశాన వాటికకు ఐదు ఎకరాల చొప్పున భూమిని కొనుగోలు చేసి ఇచ్చామని తెలిపారు.

బతుకమ్మ ఘాట్‌ ‌బాగుందని కితాబు నిచ్చారు. చెరువుపై ఆ చివర నుండి ఈ చివరి వరకు లైటింగ్‌ ‌కోసం, పిల్లల ఆట వస్తువులు మరిన్ని ఏర్పాటు చేయడానికి, వాకింగ్‌ ‌ట్రాక్‌ ఏర్పాటుకు, గ్రానైట్‌తో కూర్చోవడానికి బల్లల కోసం కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రభుత్వం రూ. 500 కోట్లతో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో వెజ్‌ అం‌డ్‌ ‌నాన్‌ ‌వెజ్‌ ‌సమీకృత మార్కెట్లను నిర్మిస్తుందని అన్నారు. మార్కెట్లో సకల సౌకర్యాలు ఉండేలా కడుతున్నామన్నారు. సదాశివ పేట పట్టణంలోని వ్యవసాయ మార్కెటింగ్‌ ‌కమిటీ యార్డులో సమీకృత మోడల్‌ ‌మార్కెట్‌నకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ మార్కెట్‌ను తొమ్మిది నెలల లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువొస్తామని అన్నారు.

ముస్లింల అంతిమయాత్రకు అవసరమైన ఆఖరి సఫర్‌ ‌కా గాడి కొరకు, అదేవిధంగా క్రిస్టియన్లకు పరలోక యాత్ర వాహనం నకు 15 లక్షల చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హిందువుల వైకుంఠధామంలో పూర్తి స్థాయి సదుపాయాల కల్పనకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రూ.45 కోట్లతో సదాశివ పేట పట్టణంలో ఇంటింటికి తాగునీరు అందించేలా మంచినీటి పథకం ప్రారంభించామని, దీపావళి లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందిస్తామన్నారు. పట్టణంలో కొత్త సిసి రోడ్లు వేయడానికి మురుగు కాలువల కు మరో 20 కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈనెల 15వ తేదీలోగా కొత్త రేషన్‌ ‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వొచ్చే నెల నుండి 57 సంవత్సరాలు ఉన్న అర్హులకు ఆసరా పెన్షన్‌లు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కొరోనా విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, పీక తీసుకోవాలని మాస్కు ధరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్‌ ‌పర్సన్‌ ‌మంజుశ్రీ, శాసనమండలి ప్రోటం చైర్మన్‌ ‌భూపాల్‌ ‌రెడ్డి, మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్‌, ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌జయమ్మ, జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ ‌రాజర్షి షా, అధికారులు,ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply