Take a fresh look at your lifestyle.

భీమా కోరేగావ్‌ ‌కేసు కేంద్రానికి అప్పగించలేదు

Maharashtra CM Uddhav Thackeray

  • స్పష్టంచేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ‌ఠాక్రే
  • రాష్ట్ర పోలీసుల తీరుపై మండిపడ్డ పవార్‌

పలు విషయాల్లో మహా వికాస్‌ ఆఘాడీ కూటమి సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రే పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. ఎన్‌పీఆర్‌ అమలు, భీమా-కోరేగావ్‌ ‌కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కాంగ్రెస్‌, ఎన్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌, ఉద్ధవ్‌ ‌ఠాక్రే భేటీ అయ్యారు. ఈ పరిణామాల తర్వాత మంగళవారం డియాతో మాట్లాడిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. భీమా-కోరేగావ్‌, ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులు రెండు వేరువేరని ఉద్ధవ్‌ ‌తెలిపారు. భీమా కోరేగావ్‌ ‌కేసు దళిత సోదరులకు సంబంధించినదని.. ఎట్టి పరిస్థితుల్లో వారికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనపై ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసును ఇప్పటి వరకు కేంద్రానికి అప్పగించలేదన్నారు. కేవలం ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసు మాత్రమే ఎన్‌ఐఏకి బదిలీ అయిందని చెప్పుకొచ్చారు. ఇక ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ ‌వేరువేరు అంశాలన్నారు. సీఏఏ అమలైనా ఎవరూ చింతించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్‌ఆర్‌సీని మాత్రం రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ ఎన్‌ఆర్‌సీ అమలైతే.. హిందూ, ముస్లింలతో పాటు ఆదివాసీలపైనా ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటి వరకు కేంద్రం కూడా చర్చించలేదన్నారు. ఎన్‌పీఆర్‌ ‌కేవలం పది సంవత్సరాలకు ఒకసారి జరిగే సెన్సెస్‌ ‌పక్రియ మాత్రమేనన్నారు. దీని వల్ల ఎవరిపై ఎలాంటి ప్రభావం పడదని అభిప్రాయపడ్డారు. సీఏఏపై ఉద్ధవ్‌ ‌ఠాక్రే అభిప్రాయంతో శరద్‌ ‌పవార్‌ ‌విభేదించారు. సీఏఏ అమలైనా చింతించాల్సిన అవసరం లేదనడం ఉద్ధవ్‌ ‌వ్యక్తిగత అభిప్రాయమని.. ఎన్సీపీ మాత్రం సీఏఏకి వ్యతిరేకంగా ఓటు వేసిందని గుర్తుచేశారు.

మహారాష్ట్ర పోలీసుల తీరుపై మండిపడ్డ పవార్‌
‌నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ చీఫ్‌ ‌శరద్‌ ‌పవార్‌ ‌మహారాష్ట్ర పోలీసులపై మండిపడ్డారు. ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)‌ను ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసిన అంతర్గత సమావేశం గురించి కేంద్ర ప్రభుత్వానికి ఎలా తెలిసిందని నిలదీశారు. తాను గతంలో మహారాష్ట్ర పోలీసులను చూసి గర్వించేవాడినని, ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శరద్‌ ‌పవార్‌ ‌మంగళవారం వైబీ చవాన్‌ ‌సెంటర్‌ ‌వద్ద విలేకర్లతో మాట్లాడారు.ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో పోలీసుల పాత్రను శరద్‌ ‌పవార్‌ ‌ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్‌ ‌పవార్‌, •ం ‌మంత్రి అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌లతో జరిగిన అంతర్గత సమావేశం సమాచారం కేంద్ర ప్రభుత్వానికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఎవరో ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించవలసి ఉందన్నారు. మహారాష్ట్ర •ం శాఖను తాను సుమారు ఇరవయ్యేళ్ళు నిర్వహించినట్లు చెప్తూ, తాను మహారాష్ట్ర పోలీసులను చూసి గర్వించే వాడినన్నారు. అటువంటి పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఆందోళనకరంగా ఉందన్నారు. ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో పుణెళి పోలీసులు, కొందరు సీనియర్‌ ‌పోలీసు అధికారుల పాత్ర ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ఆ పరిషత్‌లో పాల్గొననివారిపై కూడా కేసులు పెట్టారన్నారు.

Leave a Reply