Take a fresh look at your lifestyle.

తిరుమలలో వ్యర్థాల నిర్వహణ కేంద్రాల తనిఖీ

శుద్ది చేసిన నీటిని మొక్కలకు వాడాలని సూచన
తిరుమల,సెప్టెంబర్‌ 6 : ‌తిరుమలలో ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాలను అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఇందులో భాగంగా తిరుమలలోని శ్రీవారి మెట్టు వద్ద, కల్యాణ వేదిక సపం, పచ్చికాల్వ వద్ద, బాలాజినగర్‌ ‌వద్ద, అన్నమయ్య భవనం సపంలోని ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ద్రవ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల వద్ద నిరుపయోగంగా ఉన్న ఎలక్రికల్‌ ‌మోటర్లను రిపేరు చేసి వినియోగంలోనికి తీసుకురావాలని, వ్యర్థంగా ఉన్న ఎలక్రిక్‌ ‌వస్తువులను తొలగించాలని ఆదేశించారు. మురుగు నీటిని శుభ్రపరిచి ఉద్యానవనాలకు ఉపయోగించుకోవాలని, ప్లాంట్‌ల వద్ద పారిశుద్ధ్యం మరింత మెరుగుపర్చాలని, మొక్కలను పెంచాలని సూచించారు.

మరుగు నీటిని ఏవిధంగా శుద్ధి చేస్తున్నారో పరిశీలించారు. అనంతరం కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్‌ ‌వేస్ట్ ‌మేనేజ్‌ ‌మెంట్‌) ఎలాంట్‌లో చెత్త నుండి తయారుచేసిన ఎరువును పరిశీలించారు. భూమిలో కుళ్ళని వ్యర్థ పదార్థాలను విభజించి ప్యాకింగ్‌తో త్వరితగతిన తిరుపతికి తరలించాలన్నారు. తరువాత డంపింగ్‌ ‌యార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిఎఫ్‌వో చంద్రశేఖర్‌, ‌డిఇ రవిశంకర్‌రెడ్డి, ఇఇ శ్రీహరి, ఆరోగ్య అధికారి డా.శ్రీదేవి, గార్డెన్‌ ‌సూపరింటెండెంట్‌ శ్రీ‌నివాసులు, ఇతర అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

Leave a Reply