Take a fresh look at your lifestyle.

బల్దియా కార్యాలయంలో కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ

కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, ఉద్యోగులు పనిచేసే వాతవరణాన్ని కల్పించాలని వరంగల్‌ ‌మహానగర పాలక సంస్థ కమిషనర్‌ ‌పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పాత భవనంలోని 2వ, 3వ అంతస్తులలోని అన్ని విభాగాలను కమిషనర్‌ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. మొదటి అంతస్తులో నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రికార్డ్‌ల గది, పట్టణ ప్రణాళిక, వివిధ సెక్షన్‌లలో పనికిరాని వస్తువులు, కాగితాలు, చెడిపోయిన ఏసిలు తదితర వెంటనే ఆక్షన్‌ ‌చేయాలని ఆదేశించారు. 2వ అంతస్తులో సిబ్బందికి టాయిలెట్స్ ‌లేకపోవడం గమనించి వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.

మొదటి అంతస్తులోని విభాగాలను కొత్త భవనం మొదటి అంతస్తులోనికి మార్చి వెంటనే కలరింగ్‌, ‌చిన్న చిన్న మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. పై నుండి వర్షపు నీరు పాత భవనంలోని రెండవ అంతస్తులోకి కారి భవనం చెడిపోతున్నందున వెంటనే 3వ అంతస్తులోని ఖాళీ ప్రదేశంలో ప్లాస్టిక్‌ ‌షీట్స్ ‌వేయలన్నారు. బల్దియాకు వచ్చే సందర్శకుల కొరకు, రింగ్‌ ‌మాదిరి పబ్లిక్‌ ‌టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. వాహనాల పార్కింగ్‌ అస్తవ్యస్తంగా ఉన్నదని, కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా ప్లాస్టిక్‌ ‌షీట్‌ ‌వేసి వాహనాలు క్రమ పద్ధతిలో పార్క్ ‌చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బల్దియా కార్యాలయం గొడపై వేసి ఉన్న రాణి రుద్రమ బొమ్మను వెంటనే లైటింగ్‌ అమర్చి సుందరికరీంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బల్దియా అదనపు కమిషనర్‌ ‌నాగేశ్వర్‌, ఈఈ ‌విద్యాసాగర్‌, ‌డిఈ రవీందర్‌, ‌సిహెచ్‌ఓ ‌సునీత, సెక్రటరీ విజయ లక్ష్మి, పర్యవేక్షకులు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!