Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలోలో కొరోనా పరిస్థితులపై విచారణ

  • హైకోర్టుకు నివేదికలు అందించిన అధికారులు
  • డెల్టా వేరియంట్‌ ‌పట్ల అప్రమత్తంగా ఉన్నామన్న హెల్త్ ‌డైరెక్టర్‌
  • ‌నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న డిజిపి

తెలంగాణలో కొరోనా పరిస్థితులపై మరోమారు బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టుకు వైద్యారోగ్య, విద్య, పోలీసు, జైళ్లు, శిశు సంక్షేమ శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. జీహెచ్‌ఎం‌సీ డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌పట్ల అప్రమత్తంగా ఉన్నామని డీహెచ్‌ శ్రీ‌నివాసరావు వెల్లడించారు. డెల్టా వేరియంట్‌ ‌కన్నా డెల్టా ప్లస్‌ ‌మరింత ప్రమాదకరమనే ఆధారాలు లేవన్నారు. రాష్ట్రంలో డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌కేసులు నమోదు కాలేదన్నారు. డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీహెచ్‌ ‌వెల్లడించారు. మూడో దశ కొరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నెలరోజుల్లో ప్రభుత్వాహాస్పిటల్స్‌ల్లో పడకలన్నింటికీ ఆక్సీజన్‌ ‌సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 1,14కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఇచ్చామని డీహెచ్‌ ‌వెల్లడించారు.

16.39 లక్షల మందికి రెండు డోసులు, 81.42 లక్షల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్‌ ‌పూర్తి చేశామన్నారు. మరో 1.75 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. విద్యాసంస్థల్లో 1.40 లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్లు ఇచ్చామని డీహెచ్‌ ‌వెల్లడించారు. ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌ల్లో కొరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలపై జీవో ఇచ్చామన్నారు. జీవో ఉల్లంఘిస్తే ప్రైవేట్‌ ‌వైద్య కేంద్రాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటా మన్నారు. 231 హాస్పిటల్స్‌పై 594 ఫిర్యాదులు వచ్చాయన్నారు. 38 ఫిర్యాదుల్లో బాధితులకు 82.64 లక్షలు ఇప్పించామని డీహెచ్‌ ‌వెల్లడించారు. ఇకపోతే మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనివారిపై కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా పోలీసు, జైళ్లు, శిశు సంక్షేమ శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. గతనెల 20 నుంచి ఈ నెల 5 వరకు 87,890 కేసులు నమోదుచేశామని, రూ.52 కోట్ల జరిమానా విధించామని డీజీపీ తెలిపారు.అదేవిధంగా రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీలకు వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కొనసాగుతున్నదని జైళ్ల శాఖ డీజీ వెల్లడించారు. 732 మంది ఖైదీలకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ ‌పూర్తయిందని వెల్లడించారు. 6,127 మంది ఖైదీలకు మొదటి డోసు అందించామని చెప్పారు. మరో 1,244 మంది ఖైదీలకు టీకాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కొరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాగోగులు చూస్తున్నామని శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఒక్కో చిన్నారికి ఒక నోడల్‌ అధికారిని నియమించామని తెలిపింది. ఆన్‌లైన్‌ ‌బోధనకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ‌హైకోర్టుకు కోర్టుకు సమర్పించారు. విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌ ‌తరగతులే నిర్వహిస్తున్నామని చెప్పా.

Leave a Reply