
- తన ఎత్తు నోట్ పుస్తకాలు తులాభారం వేసి మంత్రికి అందజేసిన
- సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం
సిద్ధిపేట: తన ఎత్తు పూలు, తన ఎత్తు బంగారం మేడారం జాతరలో సమక్క-సారలమ్మలకు సమర్పించడం ఆనవాయితీగా ఉన్న నేపథ్యంలో.. మంత్రి హరీశ్ రావు పిలుపునకు వినూత్నంగా స్పందించారు. తన ఎత్తు నోట్ పుస్తకాలు అందిస్తూ సిద్ధిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం స్ఫూర్తిగా నిలిచారు. బోకేలు, శాలువాలకు స్వస్తి పలకాలని మంత్రి సూచప మేరకు సిద్ధిపేట మార్కెట్ యార్డు ఆవరణలో తులాభారం ద్వారా తన ఎత్తు నోటుపుస్తకాలను మంత్రికి అందజేశారు. ఈ విషయమై మంత్రి ఎఎంసి చైర్మన్ ను ప్రత్యేకించి అభినందించారు.
Tags: Apmc chairman, siddipet market committee, paala sairam, sammakka sarakka jathara