Take a fresh look at your lifestyle.

పారిశ్రామిక ప్రగతికి పునాదులుగా నవ్య ఆవిష్కరణలు..!

(ఐరాస సస్టేనబుల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌గోల్స్-2030‌లోని ‘ఇండస్ట్రీ, ఇన్నొవేషన్‌ అం‌డ్‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌’ అనబడే లక్ష్యపు నివేదిక-2021 ఆధారంగా)

2015లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం ప్రకారం ‘2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సానుకూల సుస్థిరాభివృద్ధి మార్పులు’ చేపట్టాలనే సదుద్దేశంతో 17 ‘ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030’ని నిర్ణయించారు. ఈ 17 లక్ష్యాలను ‘2030 ఎజెండా’ అని కూడా పిలుస్తాం. పేదరికం, ఆకలి చావులు, ఆరోగ్యం, విద్య, పర్యావరణ మార్పులు, లింగ సమానత్వం – మహిళా సాధికారత, సురక్షిత నీరు, పారిశుధ్యం, శక్తి వనరులు, పట్టణీకరణ, భూతాపం, పారిశ్రామికీకరణ, ఆవిష్కరణలు, మౌళిక సదుపాయాలు, సామాజిక న్యాయం లాంటి ప్రధాన అంశాలను తీసుకొని 2030 నాటికి ప్రగతి సాధించాలని లక్ష్యంగా తీసుకున్నారు. సామాజిక న్యాయం, అసమానతలు, పేదరికం, లింగ భేదం, ఆకలి చావులు, నిరుద్యోగం లాంటివ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. గత దశాబ్దకాలంగా విద్యారంగంలో ప్రపంచమానవాళి ఎంతో ముందడుగు వేసింది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 9వ అంశంగా ‘ఇండస్ట్రీ, ఇన్నొవేషన్‌ అం‌డ్‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌’ (‌పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌళిక సదుపాయాలు)’ను ముఖ్యమైనదిగా తీసుకోబడింది. సర్వతోముఖాభివృద్ధికి మౌళిక సదుపాయాలు పునాదులని, వీటితో సుస్థిర పారిశ్రామిక ప్రగతితో పాటు వినూత్న ఆవిష్కరణలు మొగ్గలు తొడిగితేనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని వివరించబడింది.

కోవిడ్‌-19 ‌విజృంభనతో ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాలు ప్రభావితం ఇయినట్లే పారిశ్రామిక ఉత్పత్తులు తగ్గడం, కొన్ని పరిశ్రమలు మూతబడడం మనకు తెలుసు. పరిశ్రమల్లో ఉత్పత్తులు తగ్గడం లేదా మూతపడడం, రవాణా వ్యవస్థలు విశ్రాంతి తీసుకోవడంతో ఉద్యోగ ఉపాధుల్లో కోతలు, వేతనాల్లో తగ్గింపులతో కార్మిక కుటుంబాల్లో పేదరికం పెరగడం చూశాం. కరోనా కోరల్లో చిన్న, మధ్య తరహ పరిశ్రమలు తీవ్రంగా నలిగి పోయాయి. పరిశ్రమల్లో ఉత్పత్తులు తగ్గితే ఆవిష్కరణలు, పరిశోధనలు కుంటుపడడం విధిగా జరుగుతుంది. శాస్త్రసాంకేతిక మాద్యమంగా కరోనా కట్టడికి టీకాలు కూడా అతి తక్కువ సమయంలో ఆవిష్కరించడం హర్షదాయకం. 2020లో ఆర్థిక మాంద్యంతో పాటు పారిశ్రామిక ఉత్పత్తులు 6.8 శాతం పడిపోయాయి. 2019తో పోల్చితే 2020 ప్రథమార్థంలో 5.5 శాతం (11.9 శాతం పని గంటలు తగ్గడం), ద్వితియార్థంలో 2.5 శాతం (4.4 శాతం పని గంటలు తగ్గడం) ఉద్యోగాలు తగ్గాయి. 2019లో విమానయానం చేసిన ప్రయాణీకులు 4.5 బిలియన్లు నమోదుకాగా 2020 విపత్తు అనంతరం 1.8 బిలియన్ల ప్రయాణీకులు మాత్రమే విమానయానం చేశారు. కరోనా విపత్తుతో 52.5 శాతం (87.7 మిలియన్ల నుంచి 41.7 మిలియన్లకు తగ్గడం) విమానయాన ఉద్యోగాల కోత జరగడం విచారకరం.

పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకోవడానికి, ఉత్పత్తులు పెంచడానికి, ఆర్థిక ఉన్నతికి, వస్తు ధరలు తగ్గడానికి ‘పరిశోధనలు – అభివృద్ధి (రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవెసప్‌మెంట్‌, ఆర్‌ అం‌డ్‌ ‌డి)’ ఉత్ప్రేరకాలుగా పని చేస్తాయి. ఆర్‌ అం‌డ్‌ ‌డి విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 2010లో 1.4 ట్రిలియన్‌ ‌డాలర్లు ఖర్చు చేయగా, 2018లో 2.2 ట్రిలియన్‌ ‌డాలర్లు పెట్టుబడి పెట్టడం గమనించారు. 2010లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్‌ ‌జనాభాకు 1,022 పరిశోధకులు ఉండగా, 2018లో 1,235కు పెరగడం నమోదైంది. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఆర్‌ అం‌డ్‌ ‌డి విభాగానికి నిధులు చాలా తక్కువగా వెచ్చించడం జరుగుతోంది. పేదరికం అధికంగా ఉన్న ప్రపంచ దేశాల్లో చాలా ప్రాంతాల ప్రజలకు రోడ్డు రవాణా కూడా అందని ద్రాక్షే అవుతున్నది. 2018-19లో 520 మిలియన్ల శ్రామికుల్లో 300 మిలియన్ల అభాగ్యులకు కనీస రొడ్డు వసతులు నేటికీ అందుబాటులో లేక పోవడం విచారకరం. ప్రపంచ జనాభాలో 2020 వివరాల ప్రకారం 85 శాతం ప్రజలు 4జి సౌకర్యం కల్పింబడింది. 2015 నుంచి 2020 మధ్య 4జి వినియోగదారులు 50 శాతం పెరగడం గమనించబడింది. 2019 వివరాల ప్రకారం చరవాణుల్లో 96.5 శాతం 2జి సౌకర్యం, 90 శాతం 3జి ఇంటర్నెట్‌ ‌వాడుతూ, మ్నెత్తంగా 54 శాతం ప్రజలు ఇంటర్నెట్‌ ‌సౌకర్యం వాడుతున్నారని, నేటికీ 3.7 బిలియన్‌ ‌జనులు ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నారు. పేద దేశాల్లో 19 శాతం ప్రజలకు మాత్రమే ఆన్‌లైన్‌ ‌సౌకర్యం అందుతోంది.

మౌళిక సదుపాయాలు, పరిశ్రమలు, పరిశోధనలతో విడదీయరాని సంబంధం ఉంటుంది. నవ్య ఆవిష్కరణలు అంతర్జాతీయ వేదికగా ప్రజల సౌకర్యాలను పెంచడంతో పాటు ఆర్థిక ఆదాయానికి కారణం అవుతాయి. నేడు స్మార్ట్‌ఫోన్‌ ‌సామాన్యుని అంగం అయ్యింది. అభివృద్ధి చెందితున్న దేశాల్లో 35 శాతం చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు కల్పించబడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధ్యపడడానికి జిడిపిలో 4.5 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. విశ్వవ్యాప్తంగా దాదాపు అందరికీ అంతర్జాలంతో కూడిన చరవాణి అందుబాటులో ఉన్న నేటి డిజిటల్‌ ‌యుగంలో శాస్త్రసాంకేతిక వృద్ధి జరిగినా ప్రజల ఆకలి, అనారోగ్యం, ఆర్థిక సమస్యలకు శాశ్విత పరిష్కారం 2030 నాటికి సుసాధ్యం కావాలని ఐరాస ఆశిస్తున్నది. సమగ్ర దేశాభివృద్ధిలో పారిశ్రామిక ప్రగతి, పరిశోధనలు, నవ్య ఆవిష్కరణలు, మౌళిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు, పౌరసమాజం తమ తమ బాధ్యతలను నిర్వహించాలని కోరుతుందాం. అభివృద్ధి చెందుతున్న భారతం సత్వరమే అభివృద్ధి చెందిన భారతంగా అవతరించాలని ఆరాటపడదాం.

dr burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల, కరీంనగర్‌ – 9949700037

Leave a Reply