పొద్దు ఎంత చప్పుడు చేసినా
ఆ ఇంటికి
నిద్ర మత్తు వదలలేదు.
చుక్కలతో రాత్రి
ఎంత సేపు గడిపిందో
చీకటి దుప్పటి తీయలేదు.
పొద్దు
వెచ్చగా నడుచుకుంటూ
సూరుడ్ని ఎర్రగా చేతితో పట్టుకుని
సన్నగా లోపలికి రావాలని
బయట కాపలా కాస్తుంటే,
చీకటి ముసుగు ముసురులో
మునిగిన ముచ్చటకు
వెలుగు కోరిక లేదు.
పగటి తొక్కిడికి అలసినట్లుగా
మంచం ఒడిలో వాలిన నడుము,
కాటేసిన కఠినదృశ్యాలకు కనురెప్పలు
లోకాన్ని పక్కకు నెట్టేసి
ఉదయానికి పెడముఖాన్ని చూపి
లోపల రాజ్యమేలుతున్నాయి.
– చందలూరి నారాయణరావు
9704437247