Take a fresh look at your lifestyle.

ఇం‌కెన్ని జరగాల్నో

పనిలేక పస్తులుండుట
నిత్యం మాకు అలవాటే
రోజూ రెక్కడితెనే
ఆపూటా డొక్కనిండేది
కరోనా కాటుకు పనులన్నీ
విషాన్ని కక్కాయి
మా కూడు గిన్నె
కన్నీటి గిన్నేతో నిండింది..

పది పైసల ఒస్తాయాని పనికికుదిరిన
యజమానిని దైవంతో కొల్సిన
ఇగ క్షుద్బాద లేదని కుదుటపడ్డ
అంతలోనే మానవ మృగం
యజమాని కొడుకు
కామపురంగుపులుముకొని
గుంటనక్కకాసుకున్న సంగతి మర్సిన
‘‘అన్నా ‘‘పిలుపుకు నోసుకొని నాకు
పెద్దన్న మారయ్య అనుకున్న….

కడుపులో పేగుల ఆకలి రాగాలకు
చీపురు, వాకిలి వంత పడుతుంటాయి
గిన్నెలు,అంట్లు తోముడు
నాతో నిత్యం సహవాసం చేసే
నా సహచరులు..
అయ్యగారికి మందులేసుడు
అమ్మవారికి కాళ్ళు పట్టుడూ
అన్నకు అన్ని సూసుకొనుడు
తెల్సు……

ఒక్కసారి అన్నచేయి
అంగాంగ స్పర్శకి బుసకొట్టుతున్న వేళ
భయం ఆందోళన చేతులుగా
అన్నమృగాన్ని నెట్టివేస్తే
రెట్టించిన కోప కామం
పెట్రోల్తో తనువంతా తడిపితే
అగ్ని లేత తనువును
జ్వాలలతో కాలుస్తుంటే
నా ఆర్తనాదాలు
నా ఆకరి కేకలు
మంటలలో కలిసిపోయే వేళ
మానవత్వపు గాలులు
నన్ను దుప్పట్ల రూపంలో
కాస్త ఊరట నిచ్చాయి..

పక్షం రోజులు
ఆసుపత్రి పడక పై
అన్ని కోల్పోయి
అయ్యా అవ్వలకు సెప్పే
గొంతు ముగాబోయే
ఆశ్రిత మృగాళ్ల నడుమ
నా లాంటి బాలలు
ఎంత ఇంకెంత
మంది బలికావాల్నో….
అత్యాచారాలు, ఆత్మహత్యలు
అంతమయ్యే దినాలెప్పుడొస్తాయో….
మారయ్యా లాంటి
మనవమృగాలు శిక్ష్ప పడేదెన్నడు.
తగినశాస్త్రి జరిగే దెన్నడు
భారత శిక్షాస్మృతి
ఆకాశ పతకమై రెపరెప లాడేదెన్నడు..
అప్పటి వరకు
ఇంకెన్ని జరగాల్నో …….

    – నాగరాజు (మద్దెల), 6301993211(ఖమ్మలో బాలిక పై అత్యాచారంకి వ్యతిరేకంగా బాలికకు న్యాయం జరగాలని రాసిన కవిత.)

Leave a Reply