Take a fresh look at your lifestyle.

బలహీనవర్గాలకు అన్యాయం టీఆర్‌ఎస్‌ ‌బీజేపీలపై ఉత్తమ్‌ ‌విమర్శ

Injustice to the weaker sections is the best criticism of TRS BJPs uttam kumar

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాడానికి ఈ నెల 16న ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సి,ఎస్టీ రిజర్వేషన్లపై ప్రాథమిక హక్కులు కావు అని సుప్రీమ్‌ ‌కోర్ట్ ‌తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌ ‌కార్యాచరణపై గాంధీభవన్‌లో ఉత్తమ్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ ‌ముఖ్య నేతలు మావేశమైయ్యారు. ఈ సమావేశం అనంతరం ఉత్తమ్‌ ‌మీడియాతో మాట్లాడుతూ…కోర్టులో బీజేపీ నియమించిన న్యాయవాదులు వినిపించిన వాదనలను తాము ఖండిస్తున్నామని అన్నారు. ఇది కాంగ్రెస్‌ ‌మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సి, ఎస్టీలను అణిచివేస్తున్నాయని మండిపడ్డారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం ఉద్యమించాలని ఏఐసీసీ ఇన్‌ ‌ఛార్జ్ ‌కుంతియా తెలిపారు. బీజేపీ ఒక ఎత్తుగడగా రిజర్వేషన్లను ఎత్తి వేసేసేందుకు కుట్ర చేస్తుందని, సుప్రీం కోర్ట్ ‌తీర్పు నేపథ్యంలో భవిష్యత్‌ ‌లో రిజర్వేషన్లు ప్రశ్నార్థకంగా మారనుందని ,ఉద్యమించకపోతే చాలా నష్టపోతామని అన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ, మాజీ ఎంపీ వి.హనుమంతారావ్‌, ‌మాజీ మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ ‌కుమార్‌, ‌మధుయాష్కీ గౌడ్‌ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు .

- Advertisement -

బీజేపీ కుట్రను కాంగ్రెస్‌ ‌తిప్పి కొడుతుంది : భట్టి విక్రమార్క
దళితులు, బీసీలు, మైనార్టీలు గౌరవంగా జీవించడానికి కాంగ్రెస్‌ అనేక చట్టాలు తెచ్చిందని రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడేలా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆ వర్గాలకు రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం చేస్తోన్న కుట్రను కాంగ్రెస్‌ ‌తిప్పి కొడుతుందని, నష్టపోయే వర్గాలన్నింటికి కాంగ్రెస్‌ అం‌డగా ఉంటుందని తెలిపారు. ఇందిరాపార్క్ ‌ధర్నాలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

Leave a Reply