ప్రజాతంత్ర, ఇబ్రహీమ్పట్నం, జనవరి 18 : 317 జీఓతో స్థానికులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
317 జీఓను రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఉపాధ్యాయుడు ప్రతాప్ చేస్తున్న రిలే నిరాహర దీక్షకు కోదండరామ్ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్థానికతను పరిగణనలోకి తీసుకుని టీచర్లను వారి జిల్లాలకు కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.