Take a fresh look at your lifestyle.

‌ప్రారంభమైన ఇంటర్‌ ‌పరీక్షలు

  • జిల్లాలో 7,273 విద్యార్థులు హాజరు
  • 502 మంది విద్యార్థుల గైర్హాజరు
  • పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌

‌జిల్లాలో తొలిరోజు ఇంటర్‌ ‌మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన 29 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో అరగంట ముందగానే అన్ని పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. అందరినీ తనిఖీ చేసి లోపలికి పంపించారు. ఇంటర్‌ ‌మొదటి సంవత్సరం పరీక్షలకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ ‌కళాశాలలకు చెందిన 7,775 మంది పరీక్షలు రాయాల్సి ఉండాగా, బుధవారం నిర్వహించిన పరీక్షలకు 7,273 మందే హాజరయ్యారు. 502 మంది గైర్హాజరయ్యారని. జిల్లా ఇంటర్‌ ‌నోడల్‌ అధికారి వెంకటరమణ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ‌శ్రీధర్‌ ‌పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని తనిఖీ నిర్వహించారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అధికారులతో మాట్లాడాతూ విద్యార్థులకు జంబ్లింగ్‌ ‌విధానం ద్వారా ఏ విధంగా సీటింగ్‌ ‌ప్రక్రియను నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్‌ ‌వెంట జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి వెంకటరమణ ఇతర అధికారులు ఉన్నారు.

Leave a Reply

error: Content is protected !!