Take a fresh look at your lifestyle.

కవిత.. తెలంగాణా సాంస్కృతిక ప్రతీక..!

“బతుకమ్మ ప్రత్యేకతను తెలియజేస్తూ.. తెలంగాణ ఖ్యాతిని మన గడ్డపైనే కాకుండా ఖండంతారాలు చాటి దునియా నలుమూలల నేడు బతుకమ్మ ఆడుతున్నారు అంటే అది కవిత సాధించిన ఘనతగా చెప్పవచ్చు. తను ఉన్నత కుంటుబంలో పుట్టిన అప్పటికి హంగు, ఆర్భాటలు లేకుండా సాధారణమైన జీవితం గడుపుతుంది. సామాన్యుల జీవితాలను దగ్గరి నుంచి చూసి, వారి బతుకులు మార్చాలి అంటే నిరంతరము ప్రజల మధ్యనే ఉండి వారిని చైతన్య పర్చాలని నిర్ణయించుకుని తన తండ్రి చూపిన బాటలోనే తెలంగాణ స్వరాష్ట్ర సాధనకై పోరాడింది.”

కల్వకుంట్ల కవిత అన గానే మనకు గుర్తుకు వచ్చేది బతుకమ్మ. తెలంగాణ సంస్కృతిక సాంప్రదాయన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ‌రావు ,శోభ దంపతులకు మార్చ్ 13, 1978 ‌న రెండవ సంతానంగా కవిత జన్మిం చింది. సిద్దిపేటలో విద్యాభ్యాసం చేసి 2001లో అమెరికాన్‌ ‌విశ్వ విద్యా లయంలో మాస్టర్స్ ‌డిగ్రీ పూర్తి చేసి భారత దేశానికి 2004 లో తిరిగి వచ్చి ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ను ఆదర్శంగా తీసుకుని కేసిఆర్‌ అధ్యక్షతన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసి ఊరురా బతుకమ్మ ప్రత్యేకతను తెలియజేస్తూ.. తెలంగాణ ఖ్యాతిని మన గడ్డపైనే కాకుండా ఖండంతారాలు చాటి దునియా నలుమూలల నేడు బతుకమ్మ ఆడుతున్నారు అంటే అది కవిత సాధించిన ఘనతగా చెప్పవచ్చు. తను ఉన్నత కుంటుబంలో పుట్టిన అప్పటికి హంగు, ఆర్భాటలు లేకుండా సాధారణమైన జీవితం గడుపుతుంది. సామా న్యుల జీవితాలను దగ్గరి నుంచి చూసి, వారి బతుకులు మార్చాలి అంటే నిరంతరము ప్రజల మధ్యనే ఉండి వారిని చైతన్య పర్చాలని నిర్ణయించుకుని తన తండ్రి చూపిన బాటలోనే తెలంగాణ స్వరాష్ట్ర సాధనకై పోరాడింది. ఉద్యమంలో ఎన్ని అక్రమ కేసులైనా ఎవ్వరెన్ని అవహేళనలు చేసిన లాఠీలు విరుచుకుపడిన ఆత్మస్థైర్యం కోల్పోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమంలో పని చేసి రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం అయింది.

కేసిఆర్‌ ‌నాయకత్వంలో ఉద్యమ కాలం నుండి ఈనాటి వరకు సమర్థవంతంగా పని చేసి తండ్రికి తగ్గ తనయురాలుగా పేరు పొందింది. తెలంగాణ ఉద్యమం కాలమైనా ప్రస్తుతమైనా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుంది. కొరోనా అపద కాలంలో సోషల్‌ ‌మీడియా వేదికగా వైరస్‌ ‌బారిన పడిన వారికి నాణ్యమైన వైద్యం అందించి పేద ప్రజలకు చేరువ అయింది. సమస్యతో అక్కా అంటూ తన ఇంటి ముందుకు వచ్చిన వారికి నేనున్నాను అంటూ భరోసా నిస్తూ మానవత్వానికి అద్దం పడుతుంది కల్వకుంట్ల కవిత. అంగవైకల్యం కల్గిన వారికి తన స్వంత ఖర్చుతో వారికి కావాల్సిన పరికరాలు అందించింది. నేటికి సోషల్‌ ‌మీడియా వేదికగా సహాయము కావాలని అర్థించిన వారికి స్పందిస్తుంది. లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో గల్ఫ్ ‌దేశాలలో చిక్కుకు పోయిన వలస కార్మికులకు బాసటగా నిలుస్తూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్పించిన ఘనత తనది. తెలంగాణ ఉద్యమంతో ప్రజ జీవితంలోకి వచ్చిన కవిత కేసిఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోతు టిఆర్‌ఎస్‌ ‌పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ లో కీలకంగా పని చేస్తుంది. ఉద్యమ కాలంలో జాగృతిని ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు రాజకీయ లక్షణాలు నేర్పుతూ యువకులు కూడా రాజకీయాలు చేయగలరని ఆచరణాత్మకంగా నిరూపించింది. ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించింది. అదే విధంగా యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో జాగృతి నాయకుల పాత్ర కూడా ముఖ్యమైనది.

అమెరికా నుంచి తిరిగి రాగానే కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని పేద పిల్లలకు విద్యా వైద్యం అందించింది. రాజకీయ విషయానికి వస్తే తెలంగాణ లోనే కాకుండా దేశ రాజకీయలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుండి మొదటి మహిళగా పార్లమెంటుకు ఎన్నికై ఉత్తమ పార్లమెంటరీ అవార్డు కూడా అందుకుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ ‌లో అనర్గాలంగా మాట్లడ గల సమర్థురాలు. ప్రతి పక్ష పార్టీ నాయకులకు ధీటుగా సమాధానము ఇవ్వగల రాజకీయ చతురత కలిగిన నాయకురాలు కల్వకుంట్ల కవితా. తన వాక్‌ ‌చాతుర్యంతో పార్లమెంటులో తెలంగాణకు రావలసిన నిధులు వాటలపై నిలదీసి పార్లమెంటు సభ్యులందరిని ఆకట్టుకుంది. రాజకీయ రంగంలో అనేక పదవుల చేప్పటినప్పటికి తనపై ఎవ్వరెన్ని తప్పుడు ఆరోపణలు వ్యక్తిగత విమర్శలు చేసిన ఓర్పు, సహనంతో వాటిని తిప్పి కొడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేసింది కవిత.

ఒక తండ్రి చాటు కూతురిగా, సోదరిగా, ఓ ఇల్లాలిగా ఉంటూ రాజకీయ రంగంలో రాణిస్తూ తన కుటుంబం రాజకీయ రంగంలో ఉన్నప్పటికీ స్వయం కృషితో ఎదిగి ప్రజలకు చేరువ అయింది. తనకు పదవులు ఉన్న లేకున్నా నిరాశ నిస్పృహ చెంద కూడా ప్రజా శ్రేయస్సుకై కృషి చేస్తుంది కవిత. సాంస్కృతిక సంప్రాదాయలకు నిలువెత్తు కట్టు బోట్టుతో ఒక అమ్మలా దర్శనమిస్తుంది. కష్టంతో అక్కా అని ఇంటి ముందుకు వచ్చిన వారి సమస్యను పరిష్కరించి సాగన ంపుతుంది. తన పలుకరింపుతో నేను ఉన్నానంటు భరో సానిస్తుంది. మహిళల పక్షమున స్పందిస్తూ వారి హక్కులకై పోరాడుతూ వారికి అండగా నిలబడుతుంది కవిత. అక్క మాట విన్నా..మొఖం చూసినా ధైర్యము వస్తుంది. నేటి సమాజంలో అంతరించిపోతున్న ఆచార సంప్రదాయలను కాపాడుతూ సంస్కృతిక కళమ్మ తల్లికి ప్రాణం పోయడమే కాకుండా.. తను కూడా ఆచరిస్తూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది కల్వకుంట్ల కవితా .. రాజకీయ రంగంలో మారెన్నో పదవులు చేపట్టి పేద ప్రజలకు అండగా ఉండాలని ఆశిస్తూ కేసిఆర్‌ ‌తలపెట్టిన బంగారు తెలంగాణలో తను కూడా భాగస్వామ్యం అవుతుంది.

మిద్దె సురేష్‌ ‌టిఆర్‌ఎస్వీ నాయకులు 9701209355

Leave a Reply