Take a fresh look at your lifestyle.

‘‘‌సమాచార హక్కు ఏది నీ దిక్కు’’

సమాచార హక్కు చట్టం ప్రజల చేతి లో వజ్రాయుధం లాంటిది.పాలన లో పారదర్శకత పెంచి,అవినీతి ని నిర్మూలనకు బీజం వేసి,జవాబుదారీ తనం పెంచే ఈ చట్టం అమలు లోకి వచ్చిసుమారు పదహారు సంవత్సరాలు అవుతూ వున్న ప్రభుత్వం,సమాచార కమిషన్‌ ‌ప్రజలకు అవగాహన కల్పించడం లో పూర్తిగా విఫలం అయినది.భారత ప్రభుత్వం అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలనే తాపత్రయం తో అప్పటి యు.పి.యే ప్రభుత్వం గొప్ప చట్టమయిన సమాచార హక్కు చట్టం ని అమలులోకి వచ్చింది.ఈ చట్టం ప్రకారం ప్రతీ ప్రభుత్వ కార్యాలయం లో సమాచార హక్కు చట్టం ప్రజా సమాచార అధికారి,సహాయ ప్రజా సమాచార అధికారి అందుబాటులో వుంటారు.ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో తప్పక సమాచార బోర్డ్ ‌లు వుండాలి.ప్రజలు వివిధ సమాచారం కోరుతూ అధికారులకు దరఖాస్తు చేస్తే నెల రోజుల లోపు సమాచారం ఇవ్వాలిసి వున్నా ఏదొ ఒక వంక తో ధరఖాస్తుదారులకు తిప్పి పంపడం,లేదా సమాచారం లేదని చెప్పడం,సమాచారానికి ఇన్ని పేజీలు అంటూ రుసుం వసూలు చేయడం జరుగుతుంది.

కొన్ని కార్యాలయలలో రెండు,మూడు నెలలు కూడా గడిచిన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినవస్తూ వున్నాయి.మొదటి అప్పీలు కి వెళ్లినా స్పందన లేదు.చివరకు రాస్ట్ర సమాచార కమిషన్‌ ‌కి రెండవ అప్పీల్‌ ‌చేసీనా ఆ కమిషన్‌ ‌నుండి పిలుపు రావడానికి సుమారు నాలుగు నుండి ఆరు నెలల సమయం పడుతూ ఉంది.ఇప్పటికి లక్ష లాది రెండవ అప్పీల్లు పెండింగులో వున్నాయని తెలుస్తూ వుంది.రాస్ట్ర సమాచార కమీషన్‌ ఇం‌తవరకు ఒక్క జిల్లాలో కూడా పర్యటించిన దాఖలాలు లేవు.జిల్లా పాలన అధికారులు తమ జిల్లా అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల లో కూడా సమాచార హక్కు చట్టం అమలు తీరు మీద చర్చించిన ఆనవాళ్లు కూడా లేవు.అధికారులకు ఈ చట్టం గూర్చి పూర్తి అవగాహన లేదు.

కొన్ని జిల్లాలలో సమాచార హక్కు చట్టం కార్యకర్త లమీద దాడులు చే యడము,భయ భ్రాం తుల కు గురిచేయడం జరుగుతూ వుంది.దేశ వ్యాప్తంగా సహ చట్టం ఉద్యమకారుల మీద దాడులు జరుగుతూ వున్నాయి.అనేక మందిని పొట్టన పెట్టు కున్న ఉదంతాలూ వున్నాయి.సమాచారం కోసం ధరకాస్తూ చేస్తే అధికారులు సమాచారం ఇవ్వకుండా ధరఖాస్తుదారులు తమను బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేస్తూ వున్నారని అసత్య ఆరోపణలు చేసి కేసులు పెట్టిన సందర్భాలు గలవు.రాస్ట్ర కమీషన్‌ ‌కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం జరుగుతు వుంది.అన్ని రాష్ట్రాలలో ఈ చట్టం పకట్బంధీగా అమలు అవుతూంది.ఇకనయిన ప్రభుత్వం,రాస్ట్ర కమీషన్‌ ‌స్పందించి మన రాష్ట్రం లో సమాచార హక్కు చట్టం ని పారదర్శకంగా అమలు చెయ్యాలి అని మా మనవి.అధికారులకు,ప్రజలకు చట్టం మీద శిక్షణ ఇవ్వాలి.
– కామిడి సతీష్‌ ‌రెడ్డీ జడలపేట,జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా.9848445134.

Leave a Reply