దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయి..నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న ప్రరిస్థితుల్లో దేశంలో మరోసారి సంపద పన్నును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ సోమవారం అభిప్రాయపడ్డారు. దేశంలో అసమానతలు అత్యధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. సంపదను పునఃపంపిణీ చేయడానికి బ్జడెట్2020లో ‘సంపద పన్ను’ను ప్రవేశపెట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న అసమానతల నేపథ్యంలో సంపద పన్ను విధించడం మంచి చర్య అని కోల్‌కతాలోని టాటా స్టీల్ లిట్రెరరీ ట్‌లో ఆయన వెల్లడించారు. పీఎస్‌యూల్లో వాటాల విక్రయాన్ని తాను ఇష్టపడతానని ఆయన చెప్పారు. ‘సంపద పన్ను చట్టం 1957’ను వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, కార్పొరేట్ సంస్థలపై(విలువ కట్టే సమయంలో) భారత్ 2016లోనే నిలిపివేసింది.
ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ దినిని తెరపైకి తీసుకొస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోపక్క ప్రభుత్వం తగ్గించిన కార్పొరేట్ పన్ను కంపెనీలకు లబ్ది చేకూర్చినా ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోలేదని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగానికి ర్గీ•నాన్స్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలపై అభిజిత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యధిక వ్యయంతో కూడిన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు చేపట్టి అమలు చేస్తోంది. దీంతోపాటు స్వచ్ఛభారత్, ఉజ్వల పథకాలు కూడా ఖరీదైనవే అని పేర్కొన్నారు. వలసలు మంచివేనని అభిజిత్ అభిప్రాయపడ్డారు. వలసవచ్చినవారు స్థానికులతో పోటీపడటానికి తమ శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తారని పేర్కొన్నారు.
Tags: Wealth tax,Inequalities, increasing,country, Abhijit Banerjee