Take a fresh look at your lifestyle.

సర్కార్‌ ‌తీరుతో తరలిపోతున్న పరిశ్రమలు

చంద్రబాబు కష్టపడి తెచ్చిన పెట్టబడులు పోతున్నాయి
సిఎం జగన్‌ ‌వైఖరిపై మండిపడ్డ టిడిపి నేతలు
అమరావతి,జూన్‌ 26 : ‌సిఎం జగన్‌ ‌తీరు, సర్కార్‌ ‌వైఖరి కారణంగా ఎపి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని టిడిపి నేతలు విమర్శలు అందుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో తెచ్చిన వేలకోట్ల పెట్టుబడులు సర్కారు తీరుతో ఏపీకి గుడ్‌ ‌బై చెప్పి వెనక్కి వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్‌ ‌వేదికగా పేర్కొన్నారు. ఉన్నవన్నీ వెళ్లిపోతున్నాయనీ.. కొత్త కంపెనీలు రావని తెలిపారు. దీనికి సర్కార్‌ ‌తీరు కారణమన్నారు. ఎంతోకష్టపడి చంద్రబాబు హయాంలో తెచ్చిన వేలకోట్ల పెట్టుబడులు వెనక్కి పోవడం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. కొత్త కంపెనీలు రావు. ఉన్నవీ వెళ్లిపోతు న్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలూ లేవు. అభివృద్ధి, సంపద సృష్టి సున్నా అని ఎద్దేవా చేశారు లక్షల కోట్ల అప్పులు మిగిలాయన్నారు.

ఒక్క ఛాన్స్ అడిగింది పెట్టుబడులు తరలించడానికా జగన్‌ అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన పరిశ్రమలు బై బై జగన్‌ అం‌టూ వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌ ‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. చంద్రబాబు తీసుకువచ్చిన పరిశ్రమలను వైసీపీ నేతలు భయపెట్టి రాష్ట్రం నుండి వెళ్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కొత్త పరిశ్రమనైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. పరిశ్రమలు వస్తే యువతకి ఉపాధి లభిస్తుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి పరిశ్రమలు తీసుకువచ్చారని తెలిపారు. వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చిన దాదాపు 10 కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోయాయన్నారు.

పరిశ్రమలు వెళ్లిపోతుంటే ఏపీఐఐసి చైర్మన్‌, ‌పరిశ్రమల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. యువతను నిర్వీర్యం చేసి వాలంటిర్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూసేలా చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో పెట్టుబడుల్లో ఏపీ రెండవ స్థానంలో ఉంటే ఇప్పుడు 16వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నందుకు ముఖ్యమంత్రి సిగ్గు పడాలన్నారు. పరిశ్రమలు తీసుకురాలేకపోతే రు తప్పుకోండి….అంతే కానీ చేతకానితనంతో యువత జీవితాలను నాశనం చేయొద్దని అంటూ కొల్లు రవీంద్ర హితవు పలికారు. కొత్త పరిశ్రమలు ఎన్ని వచ్చాయో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం వెల్లడించాలన్నారు.

Leave a Reply