సూర్యాపేట(హుజూర్నగర్), మే 12, ప్రజాతంత్ర ప్రతినిధి): త్వర లో హుజూర్నగర్ నియోజకవర్గా నికి ఇండస్ట్రీయల్ పార్కు వస్తుందని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు. మంగళ వారం మేడే వేడుకలను పురస్కరిం చుకొని టిఆర్ఎస్కేవి ఆధ్వర్యంలో హుజూర్‌నగర్‌లోని విద్యుత్ కార్యాలయం వద్ద టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడా రు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తుం దని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ విషయంలో తీసుకోబోతున్న నిర్ణయాలకు సిఎం కేసీఆర్ వ్యతిరేకమని, తెలంగాణలో రైతాంగానికి విద్యుత్ కోతలు లేకుం డా నిరంతరాయు తంగా 24 గంటలు ఉచితంగా అందిస్తుందని, కాని కేంద్ర ప్రభుత్వం అధికార పెత్తనం చెలాయించాలని చూస్తుందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కరోనా విషయంపై ప్రజల్లోఅపోహలు సృష్టిస్తున్నారని, ఆయన హైదరాబాద్‌లో ఎసి గదుల్లో కూర్చొని తరుగు రెండు కిలోలు చేయాలని, రైతులకు నష్టం వాటిల్లుతుందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తరుగును 1కేజీ మాత్రమే తీసేలా చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ఎస్పిడిసిఎల్ సిఓ సెక్రటరి కరెంట్‌రావు, అలీ, రమేష్ బాబు, అర్చన రవి, జెడ్పిటిసి సైదిరెడ్డి, ఉపేందర్, అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.