Take a fresh look at your lifestyle.

యాదాద్రిలో మంత్రి పర్యటన కుంభసంప్రోక్షణపై సమిక్ష

యాదాద్రి,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి శనివారం యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి అధికారులతో సమిక్ష నిర్వహించారు. అలాగే సిఎం కెసిఆర్‌ ‌కూడా రానున్నందన కార్యక్రమాలపై ఆరా తీసారు.

ఈ సమిక్షలో ప్రభుత్వ విప్‌ ‌గొంగిడి సునీత మహేందర్‌ ‌రెడ్డి, సీపీ మహేశ్‌ ‌భగవత్‌, ‌కలెక్టర్‌ ‌పమేలా సత్పతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినండి.. అంటూ కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌తెలంగాణ ప్రజలను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ యాదగిరిగుట్టలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు దగ్ధం చేశారు. సమిక్ష తర్వాత ఈ నిరసనలో మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్‌ఎస్‌ ‌నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply