Take a fresh look at your lifestyle.

అం‌తర్వేది ఘటనపై ఉదాసీనత తగదు

  • హిందూ దేవాలయాలపై దాడులు సహించం
  • జగన్‌ ‌ప్రభుత్వానికి సోము వీర్రాజు హెచ్చరిక

రాజమండ్రి,సెప్టెంబర్‌ 10 :  ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ ‌చేశారు.చర్చిపై రాళ్ళు వేస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని..మరి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు పోలీసులు కేసులు నమోదు చేయటం లేదని ప్రశ్నించారు. గురు వారం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనకు నిరస నగా బీజేపీ కార్యాలయంలో సోమవీర్రాజు నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులపై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తా ప్రభుత్వం ప్రజలు మనోభావాలు గుర్తించాలని తెలిపారు. అంతర్వేది లక్ష్మినరసింహాస్వామి రథం దగ్ధంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

అంతర్వేది సంఘటనపై విశ్వహిందూ పరిషత్‌ ఉద్యమానికి మద్దతు ఇస్తామన్నారు.టీటీడీ నిధులను ప్రభుత్వం వాడుకుంటే బీజేపీ సహించదని స్పష్టం చేశారు.టీటీడీ చైర్మన్‌ ‌పదవిని ధర్మాచార్యులకు మాత్రమే ఇవ్వాలన్నది బీజేపీ ఎజెండాగా చెప్పుకొచ్చారు. టీటీడీ రాజకీయ పార్టీల నేతలు పునరావాసం కాకుడదనే అంశం 2024  ఎన్నికల బీజేపీ ఎజెండా అని స్పష్టం చేశారు.హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంతర్వేది లక్ష్మినరసింహాస్వామి రథం దగ్ధం కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు.నిందితులను అరెస్టు చేసే వరకు బీజేపీ, జనసేన ఉద్యమం కొనసాగుతుందని సోమువీర్రాజు స్పష్టం చేశారు.

Leave a Reply