Take a fresh look at your lifestyle.

ఆర్థికవ్యవస్థను భయపెడుతున్న సూచీలు

భారతదేశంలో కొరోనా రెండవ దశలో విలయతాండవం  చేస్తుంది. వెళ్లిపోతుందనుకున్న కొరోనా గతం లో కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. దేశంలో రోజుకు భాదితుల సంఖ్య సుమారు మూడు లక్షలుగా నమోదవుతుంది.రికవరీ రేటు తగ్గడం, వాక్సిన్‌ ‌కొరత, ఆంక్షలు పరిమితంగా ఉండటం తో, జూన్‌/ ‌జులై వరకు ఆర్థికవ్యవస్థ వృద్ధి దిశగా పయనిస్తుందన్న అంచనాలు  ఒక్కసారిగా తారుమారు అవుతున్నాయి. ఇటీవల ఎన్‌.ఐ.‌బి.ఆర్‌.ఐ ( ‌నొమురా ఇండెక్స్ ) ‌వెలువరించిన గణాంకాలు పరిశీలిస్తే ఆర్థిక కార్యకలాపాలు ఏప్రిల్‌ ‌మొదటి వారంలో 93.7  పాయింట్లుండగా, రెండవ వారాంతానికి వచ్చేసరికి 90.4పాయింట్లకు తగ్గిపోయింది. దీనితో పాటు ఇతర సూచిలైన గూగుల్‌ ‌రిటైల్‌ అం‌డ్‌ ‌రిక్రియేషన్‌ ‌మరియు వర్క్ ‌ప్లేస్‌ ‌మొబిలిటీ సూచికలు కూడా ఏప్రిల్‌ ‌మొదటి వారంతో పోలిస్తే వరుసగా 5.9% మరియు  2.7 % మేర తగ్గాయి. ఆపిల్‌ ‌డ్రైవింగ్‌ ఇం‌డెక్స్ ‌గతంలో కంటే 8.4% కు పడిపోయింది.

ఈ ఇండెక్స్ ‌ల గణాంకాలను పరిశీలిస్తే  పాక్షిక లాక్‌ ‌డౌన్‌ ‌లు , వినియోగదారులు కొరోనా విషయంలో భద్రత దిశగా ఆలోచించడం ప్రధాన కారణాలని చెప్పవచ్చు. కొరోనా వైరస్‌ ‌రెండవ దశలో ఆరోగ్యానికి తీవ్ర హాని తలపెడుతుండటం, గాలి ద్వారా కూడా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతుందని ఆరోగ్యసంస్థలు హెచ్చరించడంతో ఆర్థికవ్యవస్థకు రాజైన వినియోగదారుడు మొబిలిటీ ని తగ్గించడం జరిగింది. ఇదే అంశం ట్రాఫిక్‌ ఇం‌డెక్స్ ‌వెలువరించిన ఫలితాలు చూస్తే రుజువవుతోంది. ఏప్రిల్‌ 13 ‌నాటికి ట్రాఫిక్‌ ‌స్థాయి గతం లో ఉన్న 16 పాయింట్ల నుంచి 10 పాయింట్లకు తగ్గింది.  నాన్‌ ‌మొబిలిటీ సూచికలలో ప్రధానంగా రైల్వే సరకు రవాణా ( ఫ్రైట్‌ ) 7.7% ‌తగ్గాయి. దీనికి, ప్రయాణికుల ఆదాయాలు 25% మేర తగ్గడంతో ప్రయాణికులు ప్రయాణాలను రద్దుచేసుకోవడం జరుగుతుంది. రెండు నెలలు రవాణాకు సంబంధించి జరిగే ఆంక్షలు ఆర్థిక వ్యవస్థకు దాదాపు 5.2 బిలియన్‌ ‌డాలర్ల నష్టం తీసుకువస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్‌, ‌తమిళనాడు, రాజస్థాన్లలో నియంత్రణలు కఠినతరం ఆవుతుండడం ‘మొబిలిటీ’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.  సెకండ్‌ ‌వేవ్‌ ‌కేసుల్లో 81 శాతం కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాలే అత్యధిక ఆర్థిక క్రియాశీలత కలిగిన రాష్ట్రాలు కావడం గమనార్హం. అందువల్లే ఆర్థిక వ్యవస్థపై సైతం తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది.

వినియోగదారులు చెల్లించే ఈ వే బిల్లులు కూడా 38% మేర తగ్గాయంటే ఆర్థికస్థితిని అర్థంచేసుకోవచ్చు. కార్మిక భాగస్వామ్య రేటు 40% తగ్గడంతో  దాని ప్రభావం నిరుద్యోగ రేటును పెంచిందని చెప్పవచ్చు.  పరిస్ధితి ఇలానే కొనసాగితే జూన్‌ ‌నాటికి  భారత ఆర్థికవ్యవస్థ 26% వృద్ధి రేటు సాధిస్తుందని చెప్పిన నిర్మల సీతారామన్‌ అం‌చనాలు చేరకపోవచ్చు. కొరోనా మొదటి దశలో ఏర్పడిన ఆదాయ క్షీణత, నిరుద్యోగం, ద్రవ్యోల్పణం వల్ల    మధ్య మరియు దిగువ తరగతికి చెందిన ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారు, మళ్ళి ఇప్పుడు కొరోనా విజృంభించడంతో ఒకవైపు ఆర్థిక తిరోగమనం ఇంకోవైపు ద్రవ్యోల్పణం ప్రజలను మరింత కటిక దారిద్య్రంలోకి నెట్టుతాయనేది వాస్తవం. ఎప్పుడైతే  వినియోగదారుని ఆదాయం తగ్గుతుందో, ఆ మేరకు ఖర్చును తగ్గించడం, ఖర్చు చేసేటప్పుడు విచక్షణ పాటించడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి.  తద్వారా ఆర్థికవ్యవస్థ కుంటుపడుతుంది.

ఇప్పుడున్న పరిస్థితులలో, ప్రభుత్వం చేయాల్సింది కొరోనాను నిర్మూలించడంతో పాటు థర్డ్ ‌వేవ్‌ ‌లేకుండా చూసుకోవాలి. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించేందుకు నగదు బదిలీ, నిత్యావసర ధరలను నియంత్రించడం, సున్నా వడ్డితో ఆర్థిక సహాయం లాంటి విధానాలతో ఆర్థికస్థితిని కొంతవరకు గాడిలో పెట్టవచ్చు. అవసరమైతే బడ్జెటేతర నిధులు కేటాయించి వాక్సిన్‌ ఉత్పత్తి మరియు పంపిణి వేగవంతం చేయాలి. పరిస్థితులను అదుపులో పెట్టేందుకు  అవసరమైతే దశలవారీగా లాక్‌ ‌డౌన్‌ ‌విధించాలి. ఇందులో, ప్రజల సహకారం కూడా చాలా కీలకం అని చెప్పవచ్చు.లేకపోతే ఈ ఆర్థిక సంవత్సరం కూడా ప్రతికూల ఫలితాలను చవి చూడాల్సి వస్తుంది.

md khaza
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply