Take a fresh look at your lifestyle.

భారత్‌ ‘‌సూపర్‌ ‌పవర్‌2020’.. అం‌చనాలు తారుమారు

1998‌లో కలామ్‌  ‘‌టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’లో ప్రచురితమైన ఇంటర్వ్యూలో.. ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండటంలో తప్పులేదు. ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. రెండు దశాబ్దాల వ్యవధి ఉంది కనుక భారత్‌ ‌సాధించి తీరుతుంది’ అన్నారు. కానీ,  ఆయన పుస్తకం వెలువడిన పదేళ్ళకే భారత్‌ ఆర్థిక పరిస్థితి చాలా  దిగజారింది.

India's Super Power 2020,  apj abdul kalam 

2000 సంవత్సరంలో ప్రవేశించినప్పుడు మన దేశం 20 ఏళ్ళలో సూపర్‌ ‌పవర్‌ అవుతుందని మన మేధావులూ, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు అంచనా వేశారు. వారి అంచనాలు తప్పుకావు. దేశంలో ఉన్న వనరులు, పెరుగుతున్న మానవ వనరులు, ముఖ్యంగా యువకుల సంఖ్య,  మొదలైనవి ఆధారంగా  వారు అంచనాలు వేశారు. అందుకే, వారి అంచనాలకు అప్పట్లో విశేష ఆకర్షణ, ప్రాధాన్యం లభించాయి. కానీ, గడిచిన ఇరవై ఏళ్ళలో పాలనా రీతులలో  వొచ్చిన మార్పులతో ఆ అంచనాలు తారుమారయ్యాయి. మరో వంక దక్షిణాసియాలోని ఇతర దేశాలు భారత్‌ ‌కన్నా వేగంగా దూసుకుని పోతున్నాయి. తమ తమ ప్రజలకు ఉత్తమ జీవన ప్రమాణాలను సమకూరుస్తున్నాయి. మన దేశం మాత్రం నానాటికీ సంక్షోభంలో కూరుకుని పోతోంది.  కొత్త సహస్రాబ్దిలో ప్రవేశించినప్పుడు అన్ని దేశాల మాదిరిగా మన దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2020 నాటికి సూపర్‌ ‌పవర్‌గా ఎదుగుతుందని ఆశించడమే కాదు, అంచనాలు వేసింది. 2020 భారత సూపర్‌ ‌పవర్‌ ‌సంవత్సరం అవుతుందని అప్పట్లో మన వాళ్ళు  ఘనమైన ప్రకటనలు చేశారు. అయితే, అది నిజం కాదని తేలింది. సూపర్‌ ‌పవర్‌ ‌మాట  దేవుడెరుగు, మన దేశంలో జీవన ప్రమాణాలు నానాటికీ పడిపోతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి.

అప్పట్లో మన దేశంలోని మేథావులూ, విద్యావంతులు ఎన్నో ఆశలూరించారు. పేద దేశమైన భారత్‌ ‌భాగ్య దేశంగా రూపొందుతుందని   ఆకాంక్షించారు. వారిలో మాజీ రాష్ట్రపతి, క్షిపణి బ్రహ్మ అబ్దుల్‌ ‌కలామ్‌ ‌ముఖ్యులు. అయితే, వారి అంచనాలు, ఆలోచనల్లో ఏమాత్రం తేడా లేదు. ఆ స్థాయికి మన పాలకులు అందుకోలేదు. కలామ్‌ ‌శాస్త్రవేత్త, పాలనా దక్షత కలిగిన వారు. మన దేశం క్షిపణి కార్యక్రమం ప్రారంభించడానికి ఆయనే ఆద్యుడు. అందుకే, ఆయనను క్షిపణి బ్రహ్మ అని ఇప్పటికీ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. మన దేశం నిర్వహించిన పోఖ్రాన్‌-2 అణు పరీక్షలు విజయవంతం కావడంలో ఆయన కృషి కూడా ఉంది. భారత రాష్ట్రపతిగా ఐదేళ్ళ పాటు సేవలందించారు. అలాగే, వైఎస్‌ ‌రాజన్‌ ‌ప్రభుత్వ శాస్త్రవేత్త,   ఆయన భారత్‌-2020 ‌పుస్తకాన్ని వెలువరించడంలో  కలామ్‌కి తోడ్పడ్డారు. 2020 సంవత్సరం దార్శనికతగా ఆ పుస్తకాన్ని వెలువరించారు. కొత్త సహస్రాబ్దిలో భారత్‌ అనే అంశంపై పలువురు ప్రముఖులు అందించిన సందేశాలను కూడా పొందు పర్చారు. ఆ పుస్తకంలో ఏముందంటే, 2020 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా దూసుకుని పోతుందనీ, ఇది కలకాదు, నిజమని పేర్కొనడం జరిగింది. ఈ కలను సాకారం చేసే శక్తి సామర్థ్యాలు మన వారిలో ఉన్నాయనీ, తప్పకుండా అది నెరవేరుతుందని పేర్కొనడం జరిగింది. ఇరవై ఏళ్ళ తర్వాత స్మార్ట్ ‌ఫోన్‌లు, వాట్సాప్‌ల ప్రభావం పెరుగుతుందని   కలామ్‌, ‌రాజన్‌ ‌పేర్కొన్నారు. ఇప్పుడు స్మార్ట్ ‌ఫోన్‌ల వెల్లువను చూస్తున్నాం.  ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు చురుకుగా పాల్గొంటారని కూడా వారు పేర్కొన్నారు. 2007-08 నాటికి దేశం నుంచి దారిద్య్రాన్ని పూర్తిగా తరిమి వేయవచ్చని కూడా పేర్కొన్నారు. స్మార్ట్ ‌ఫోన్ల వినియోగం, మహిళల    ప్రాబల్యం పెరగడం విషయాల్లో వారి అంచనాలు నిజమయ్యాయి. కానీ, దారిద్య్ర నిర్మూలన విషయంలో తారుమారయ్యాయి. 2008 నుంచి 12 ఏళ్ళలో   దారిద్య్రాన్ని మన దేశం నుంచి తరిమి వేయలేకపోయారు. మహిళలు ఉద్యోగాల్లో, ఇతర పదవుల్లో పెరుగుతారన్నది నిజమైంది. భారత దేశం కన్నా మ హిళా శ్రామిక వర్గం రేటు ఎనిమిది దేశాల్లో మాత్రమే తక్కువగా ఉంది.

1998లో కలామ్‌  ‘‌టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’లో ప్రచురితమైన ఇంటర్వ్యూలో.. ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండటంలో తప్పులేదు. ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు  నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది.  రెండు దశాబ్దాల వ్యవధి ఉంది కనుక భారత్‌ ‌సాధించి తీరుతుంది’ అన్నారు. కానీ,  ఆయన పుస్తకం వెలువడిన పదేళ్ళకే భారత్‌ ఆర్థిక పరిస్థితి చాలా  దిగజారింది. 2020 నాటికి యువత సంఖ్య పెరుగుతుంది. అప్పటి వారి శక్తిని బట్టి  తాను అంచనా వేశానని ఆయన చెప్పారు. యువతరం శక్తి సామర్థ్యాలపై ఆయనకు బలమైన నమ్మకం ఉంది. రాష్ట్రపతిగా ఆయన ఎక్కడికి వెళ్ళినా, యువకులు, విద్యార్థులతో ఇష్టాగోష్టి జరిపేవారు. వారి అభిప్రాయాలను తెలుసుకునే వారు. 2002లో ఆనాటి ప్రధాని వాజ్‌ ‌పేయి స్వాతంత్య్రదినోత్సవ సందేశంలో  2020 నాటికి భారత్‌ని సూపర్‌ ‌పవర్‌ ‌చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అప్పట్లో ప్రణాళికా సంఘం ఇండియా విజన్‌ -2020 ‌పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. ఆనాటి పెద్దల ఆశలు, ఆశయాలకు తగినట్టుగా మన పరిస్థితి ఉందా అంటే లేదని చెప్పుకోవల్సి ఉంటుంది. 2020 నాటికి చైనా ఆర్థిక స్థోమత మన కన్నా ఐదు రెట్లు పెద్దది.

భారత్‌ ‌సూపర్‌ ‌పవర్‌ అవుతుందన్న అంచనాలు దశాబ్దం క్రితం వరకూ సజీవంగానే ఉన్నాయి. భారత్‌ అల్పాదాయ దేశం స్థాయి నుంచి ఎగువ ఆదాయ దేశంగా ఎదుగుతుందని ఆ నివేదికలో  ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే, ఈనాటి పరిస్థితి అందుకు పూర్తిగా దూరంగా ఉంది. బ్రిటిష్‌ ‌వారి కాలంలో లార్డ్ ‌మెకాలే మన దేశంలో పర్యటించి ఎక్కడా బిక్షుకులు కానీ,  దొంగలు కానీ కనిపించలేదన్నాడని తరచూ చెబుతూ ఉంటారు. కాని నేటి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. మన కన్నా ఎంతో చిన్న దేశం శ్రీలంక పరిస్థితి క్రమంగా మెరుగవుతోంది. శ్రీలంక ఎగువ మధ్యతరగతి వారి దేశం స్థాయికి 2019లో ఎదిగింది. ఉపాధి కల్పన కార్యక్రమాలను విజయవంతంగా అమలు జేస్తోంది. తయారీ పరిశ్రమలను  పెంచుతోంది. 2017-18 సంవత్సరంలో మన దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. 45 సంవత్సరాల గరిష్టానికి పెరిగింది. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ-2 ప్రభుత్వం కరెన్సీని రద్దు చేయడంతో ఆర్థిక వ్యవస్థ ఇక్కట్ల పాలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చర్య వల్ల భారత్‌ అభివృద్ధి లక్ష్యాలు కుప్పకూలి పోయాయ. అప్పటి ప్లానింగ్‌ ‌కమిషన్‌ అం‌చనాల ప్రకారం 2020 నాటికి  మహిళల అక్షరాస్యత రేటు 94 శాతం ఉండాలి. కానీ, తాజా గణాంకాల ప్రకారం 65 శాతం మాత్రమే ఉంది. శిశు మరణాలు ప్రతి వెయ్యిమందికి 22 .5 శాతం ఉంటాయని అంచనా వేయడం జరిగింది. కానీ, 2017లో 33 శాతం ఉన్నాయి. పిల్లలకు పౌష్టికాహారం  లోపం 8 శాతం మాత్రమే ఉండాలి కానీ,  32.7 శాతం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.

– ‘స్క్రోల్‌.ఇన్‌’ ‌సౌజన్యంతో..

Tags: India’s Super Power 2020,  apj abdul kalam, Intellectuals, scientists, academics

Leave A Reply

Your email address will not be published.