Take a fresh look at your lifestyle.

సంస్కరణలతో పెరిగిన భారత్‌ ‌ప్రతిష్ట

  • పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది అసోచామ్‌ ‌ఫౌండేషన్‌ ‌వీక్‌ 2020 ‌కార్యక్రమంలో ప్రధాని మోడీ
  • మరోసారి వ్యవసాయ చట్టాలను సమర్థించుకున్న ప్రధాని

ఓవైపు ఢిల్లీలో రైతులు 24 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రధాని మోడీ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను అవకాశం దొరికినప్పుడల్లా సమర్థించుకుంటూనే ఉన్నారు. అసోచామ్‌ ‌ఫౌండేషన్‌ ‌వీక్‌ 2020 ‌కార్యక్రమంలోనూ వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మోదీ పాల్గని మాట్లాడారు. ఈ కార్యక్రమంలోనూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, తీసుకొస్తున్న సంస్కరణలు ఏమాత్రం తప్పుకాదన్నట్లు సమర్థించుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్‌ ‌వైపు ప్రపంచ దృక్కోణం మారిందని, ఒకప్పుడు ’భారత్‌ ఎం‌దుకు’ అని వెనుకడుగేసిన పెట్టుబడిదారులే.. ఇప్పుడు ‘భారత్‌ ఎం‌దుకు కాకూడదు’ అనే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. కొరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్‌కు రికార్డు స్థాయిలో వొచ్చిన పెట్టుబడులే ఇందుకు నిదర్శనమన్నారు. సంస్కరణలతో అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్‌ ‌కేంద్రంగా మారుతున్నదని అన్నారు. గతంలో అధిక పన్నురేట్లు, కఠినమైన నిబంధనలు, కార్మిక చట్టాలతో భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లేవారని, ఇప్పుడు కార్పొరేట్‌ ‌పన్నులను గణనీయంగా తగ్గించడంతో భారత్‌లో ఎందుకు పెట్టకూడదు? అని భావిస్తున్నారన్నారు. విదేశీ పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరుస్తున్నామన్నారు.

- Advertisement -

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం నమ్మకంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచం మరో పారిశ్రామిక విప్లవం దిశగా కదులుతోందని, ఉత్తమమైన కార్పొరేట్‌ ‌పాలన, లాభాలను పంచుకునే విధానాలను పాటించాలని పారిశ్రామిక వేత్తలకు సూచించారు. అమెరికాలో ఆర్‌ అం‌డ్‌ ‌డిలో 70శాతం ప్రయివేటు పెట్టుబడులే ఉంటాయని, భారత్‌లో ప్రభుత్వ పెట్టుబడులున్నాయని అన్నారు. అందువల్ల ఆర్‌ అం‌డ్‌ ‌డీల ప్రయివేటు రంగ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.  సందర్భంగా కొత్తసాగు చట్టాలను మోదీ మరోమారు సమర్థించుకున్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో రైతులు అనేక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. రైతులు తమ పంటలను ఎక్కడైనా, ఎవరికైనా, ఎంత ధరకైనా అమ్ముక్కోవొచ్చని తెలిపారు.

Leave a Reply