- తాజాగా 13,586 మందికి పాజిటివ్‌గా నిర్దారణ
- మరణించిన వారి సంఖ్య 12,573కు చేరిక
- ఏడాది చివరికల్ల వ్యాక్సిన్ రానుందన్న ఆశ
కొరోనా మహమ్మారి భారత్‌లో విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజూ 10వేలకు పైనే నమోదవుతున్నాయి. భారత్‌లో గడచిన 24 గంటల్లో 13,586 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలోనే 336 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3,80,532కు చేరింది. ప్రస్తుతం 1,63,248 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 2,04,711 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 12,573కు పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కరోనా ఉధ్దృతి కొనసాగుతోంది. పదివేలకు పైగా కేసులు నమోదవడం వరుసగా ఇది ఎనిమిదో రోజు. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాతి స్థానంలో భారత్ కొనసాగుతోంది. దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకర స్థాయిలో విజృంభించడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. సగటున రోజుకు పదివేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,586 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన హెల్త్‌బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటివరకు ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే ప్రథమం. తాజా కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 3,80,532 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉధృతిని చూస్తే మరికొన్ని గంటల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరనుంది. గడిచిన 24 గంటల్లో 336 మంది మృత్యువాతపడటంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 12,573కు చేరింది. ఇప్పటివరకు 2,04,711 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం 1,63,248 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 85.78లక్షల కరోనా కేసులు నమోదుకాగా, 4.56 లక్షల మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. అమెరికాలో అత్యధికంగా 22.63 లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికా తర్వాత బ్రెజిల్(9.83 లక్షలు), రష్యా (5.61 లక్షలు) దేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇక, ప్రపంచంలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదయిన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇదిలావుంటే ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావంతో ఉన్నట్టు ఆ సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా వైరస్ తాజా ఔషధ ప్రయోగాలపై జెనీవాలో జరిగిన డియా సమావేశంలో డాక్టర్ సౌమ్య మాట్లాడారు. పదిమందిపై వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగం జరుగుతోందని, వారిలో కనీసం ముగ్గురు వ్యాక్సిన్ సామర్థ్యాన్ని రుజువు చేసే ప్రయోగం మూడవ దశకు చేరుకున్నారని డాక్టర్ సౌమ్య చెప్పారు. గేమ్ చేంజర్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కితాబిచ్చిన హైడ్రాక్సిక్లోరోక్విన్‌కి కోవిడ్ మరణాలను నివారించే శక్తి లేదని మానవ ప్రయోగాల్లో తేలిపోయిందని సౌమ్య చెప్పారు.