Take a fresh look at your lifestyle.

నాయకత్వ పాత్రలలో భారతీయ మహిళ

1975 వ సంవత్సరం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ఒక ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. అంతేగాక , ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం (థీమ్‌)‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో ఈ సారి కూడా మహిళలు ఎదుర్కొంటున్న విజయాలను ప్రస్తావిస్తూ, సమస్యలను ఎత్తిచూపుతూ వేడుకల్ని నిర్వహించనుంది. 2021 మార్చి 8న మహిళా దినోత్సవం, కోవిడ్‌ -19 ‌మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పూర్తిగా భిన్నమైన ఇతివృత్తాన్ని ఎంచుకుంది.

ఈ ఏడాది ప్రపంచాన్ని కరోనా మహమ్మారి చుట్టేసిన నేపథ్యంలో భవిష్యత్‌ ‌లో ముందుకు వెళ్ళడానికి మహిళలకు నాయకత్వం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఓ ప్రణాళిక రచించింది. కోవిద్‌-19 ‌కల్లోలం నుంచి భవిష్యత్తులో అభివృద్ధి సాధించడానికి, విధాన రూపకల్పనకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే పక్రియలో మహిళలను సమాన భాగస్వాములుగా చేసే ఉద్దేశ్యంతో ఈ థీమ్‌ ‌ను ఎంచుకుంది. కరోనా సృష్టించిన ఆర్ధిక కల్లోలం నుంచి భవిష్యత్‌ ‌వైపు అడుగులు వేయాలంటే మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. మహిళల పురోగతిని నిరోధించే సాంస్కృతిక, చారిత్రక, సామాజిక-ఆర్థిక అవరోధాల అడ్డును తొలగించాలనేది ఈ థీమ్‌ ‌ముఖ్య ఉద్దేశ్యం.

ప్రస్తుతం, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, మహిళలు తక్కువ వేతనంతో పని చేస్తున్నారు. తమ ఆరోగ్యానికి, మాన ప్రాణాలకు హాని కలిగించే పరిష్టితులున్నా మహిళలు వెరవకుండా పనిచేస్తున్నారని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ చెప్పింది. అయితే ఇటువంటి పరిస్థితుల నుంచి మహిళను కాపాడటానికి యు.ఎన్‌.‌డి.పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో కలిసి పని చేస్తుందని ప్రకటించింది.

Indian woman in leadership rolesమహిళలు సాధించిన సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక విజయాలకు ప్రతీకగా వేడుకలను నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉద్యోగాలలో, 2.7 బిలియన్ల మంది మహిళలను పురుషుల మాదిరిగా ఎంపిక చేసుకోకుండా పక్కన పెట్టాయని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇక 2019 నాటికి చట్ట సభల్లో మహిళలు అడుగు పెట్టిన సంఖ్య కూడా తక్కువే అని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముగ్గురు మహిళల్లో ఒకరు లింగ ఆధారిత హింసను అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

గ్లోబల్‌ ‌మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ ‌సంస్థ గ్రాంట్‌ ‌టోర్న్ ‌టోన్‌ ఇచ్చిన విమెన్‌ ఇన్‌ ‌బిజినెస్‌ 2021 ‌నివేదిక ప్రకారం పై స్థాయి నాయకత్వ స్థానాల్లో పనిచేసే మహిళల సంఖ్యలో ప్రపంచంలోనే భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారతదేశం లో సీనియర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌స్థాయిలో మహిళల శాతం 39% గా ఉండగా, ప్రపంచ సగటు 31% గ నమోదు అయ్యింది. ఇది శ్రామిక మహిళల పట్ల మారుతున్న భారతీయ దృక్పథాన్ని సూచిస్తుంది. అంతే కాకుండా, దేశంలోని కీలకమైన సి-సూట్‌ ‌స్థానాల్లోని మహిళా నాయకుల శాతం కూడా భారత సగటు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా, పై స్థాయి నాయకత్వ పాత్రలో కనీసం ఒక మహిళ కు స్థానం కేటాయించిన వ్యాపారాలు 90% కి పెరిగాయి. కానీ, భారతదేశంలో ఈ శాతం 98% గా ఉంది. భారతదేశంలో మధ్యస్థాయి-మార్కెటింగ్‌ ‌వ్యాపారాలలో 47% మహిళా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (సిఇఓలు) ఉండగా, ప్రపంచవ్యాప్తంగా కేవలం 26% ఉన్నారంటే భారత్‌ ‌లోని వ్యాపారాలలో స్త్రీ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. భారత దేశంలో అత్యధిక శాతం శ్రామిక మహిళలు తెలంగాణ లో (వ్యవస్థీకృత రంగంతో కలుపుకొని) ఉన్నారని ఎం. ఓ. ఎస్‌. ‌పి. ఐ తన నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 15-59 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో 46 శాతం మంది తమ రోజులో కొంత భాగాన్ని ‘ఉపాధి మరియు సంబంధిత కార్యకలాపాలలో’ వినియోగిస్తున్నారని వెల్లడించింది.అయితే జాతీయంగా పరిశీలిస్తే, ఈ సంఖ్య కేవలం 21.7 శాతంగా ఉంది.

మరియు తెలంగాణ లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఉద్యోగం కోసం మహిళలు ప్రతి రోజు కేటాయించే సమయంలో ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే, గ్రామీణ తెలంగాణ లో దాదాపు 57 శాతం మంది మహిళలు తమ రోజులో కొంత భాగాన్ని ఉపాధి సంబంధిత కార్యకలాపాలలో గడుపుతుండగా, రాష్ట్రంలో ని పట్టణ ప్రాంతాల్లో ఇది కేవలం 30.5 శాతం మాత్రమే ఉండడం గమనార్హం.అయితే, ఉపాధి సంబంధిత కార్యకలాపాలకు పురుషులు మరియు మహిళలు వెచ్చించే సమయానికి చాలా తేడా లేనప్పటికీ, తెలంగాణ లో పురుషులు మరియు మహిళలు ఇంట్లో చేసే కుటుంబ సభ్యుల సంరక్షణతో సహా చెల్లించని పని మొత్తానికి లోతైన వ్యత్యాసం ఉంది.

గణాంకాలను పరిశీలిస్తే, తెలంగాణ మహిళలు (15-59 సంవత్సరాలు) ప్రతిరోజూ సగటున 425 నిమిషాలు ఉపాధి సంబంధిత కార్యకలాపాల కోసం వినియోగిస్తుండగా, పురుషులు (15-59 సంవత్సరాలు) 534 నిమిషాలు వినియోగిస్తున్నారని చెప్పవచ్చు. కానీ, ఇంట్లో చెల్లించని పని విషయానికి వస్తే, రాష్ట్రంలోని మహిళలు రోజుకు 252 నిమిషాలు ఇంట్లో చెల్లించని గృహ సేవలను అందించడానికి ఖర్చు చేస్తారు, పురుషులు కేవలం 88 నిమిషాలు కేటాయించడం జరుగుతుంది. అలాగే, చెల్లించని సంరక్షణ పనుల కోసం మహిళలు 158 నిమిషాలు గడుపుతారు. ఉపాధి సంబంధిత కార్యకలాపాల కోసం సమయాన్ని వెచ్చించే వ్యక్తులు (పురుషులు మరియు మహిళలు) తెలంగాణలో అత్యధిక శాతం ఉన్నారు, ఇది రాష్ట్రంలోని ఉపాధి పరిస్థితులు, దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే మెరుగ్గా ఉన్నాయని సూచిస్తుంది.

Dr. M.D. Khwaja Moinoddin ‌Professor‌, Accounting‌ ‌ Finance సామాజికTelangana Social Writers Association State Working Committee Members Recipient of Telangana Sahitya Ratna Award Recipient of the Young Scientist Award. Recipient of the Best Researcher Award 9492791387
డాక్టర్‌ ఎం ‌డి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్
‌తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
తెలంగాణ సాహిత్య రత్న అవార్డ్ ‌గ్రహిత
యంగ్‌ ‌సైంటిస్ట్ అవార్డ్ ‌గ్రహిత.
బెస్ట్ ‌రిసెర్చర్‌ అవార్డ్ ‌గ్రహిత
9492791387

Leave a Reply