ప్రయాణానికి టీకా తప్పనిసరి కాదు..
అమెరికా వెళ్లి చదవాలనుకునే భారతీయ విద్యారులకి ఊరట లభించింది..అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు తిరిగి అమెరికా చేరటానికి టీకా వేసుకొనవసరం లేదు. వేలాది మంది భారతీయ విద్యార్థులు జూన్ 14 నుండి ఆగస్టుల నెల వరకు చాలా వీసా అపాయింట్మెంట్స్ పొందారని యుఎస్ రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది. ఒక సీనియర్ అమెరికా దౌత్యవేత్త ప్రకారం, జూలై మరియు ఆగస్టు లో వీలైనంత ఎక్కువ మంది విద్యార్థుల వీసా దరఖాస్తుదారులకు వసతి కల్పించడానికి, విద్యార్థుల చట్టబద్ధమైన ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం భారతదేశంలో యుఎస్ రాయబార కార్యాలయం చురుకుగా పని చేస్తున్నది. జూన్ 14 నుండి, జూలై మరియు ఆగస్టులో వేలాది మంది విద్యార్థులకి వీసా ఇవ్వడానికి యుఎస్ రాయబార కార్యాలయం నిర్ణయించుకోటంతో, వేలాది వీసా అపాయింట్మెంట్స్ భారతీయ విద్యారులకి అందుబాటులోకి వొచ్చాయి. ‘‘రాబోయే వారాల్లో ఇంకా వేలాది మంది విద్యారులకి వీసా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం’’ అని అమెరికా రాయబార కార్యాలయం ఒక ట్వీట్లో పేర్కొంది. ‘‘విద్యార్థులూ..మీరు ఎదుర్కున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి మేము శ్రద్ధగా పనిచేస్తున్నాం.
మీ సహనాన్ని మేము అభినందిస్తున్నాము’’ అని యుఎస్ రాయబార కార్యాలయం ట్విట్లో తెలిపింది. అమెరికా రాయబార కార్యాలయంలో కాన్సులర్ వ్యవహారాల మంత్రి కౌన్సిలర్ డాన్ హెఫ్లిన్ కూడా ఇంతకు ముందు భారత్కు వొచ్చిన..అమెరికాలో చదువుకుంటూ ఉండిన విద్యార్థులు తిరిగి అమెరికా దేశంలోకి ప్రవేశించడానికి కోవిడ్ -19 టీకాలు వేసినట్లు రుజువు చేయనవసరం లేదని చెప్పారు. ఈ విద్యారులు అమెరికాకి బయలుదేరే ముందు 72 గంటల్లో చేసుకున్న కోవిడ్ -19 పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్తో వొస్తే చాలని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. కొరోనా వైరస్ మహమ్మారి కారణంగా వీసా అపాయింట్మెంట్స్ పొందడంలో కొన్ని పరిమితుల దృష్ట్యా ఉన్నత అధ్యయనాల కోసం అమెరికా వెళ్లాలని ఆశించే భారతీయ విద్యార్థులు ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వలన భారతీయ విద్యారులకి కొంత ఊరట దొరికింది.