Take a fresh look at your lifestyle.

వస్తు రవాణా వ్యాపారంలో ప్రైవేట్ రైల్వేలు ఆసక్తి ..!

  • పోటీదారుల్లో   అదానీ పోర్ట్స్, టాటా రియాల్టీ అండ్  ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్సెల్ గ్రూప్, బొంబార్డియర్ ఇండియా అండ్ మాక్వేరీ గ్రూప్
  • అత్యధిక ఆదాయం వస్తు రవాణాలో .. 

జూలై 1 న భారత రైల్వే ప్యాసింజర్ రైలు ప్రైవేటీకరణ ప్రణాళికను ప్రారంభించింది, ప్రైవేటు కంపెనీల నుండి  (ఆర్‌ఎఫ్‌క్యూ)  రెక్యూస్ట్స్ ఫర్ క్వాలిఫికెషన్స్ అప్లికేషన్లను ప్రభుత్వం ఆహ్వానించింది. అంటే ఈ అప్లికేషన్స్ ద్వారా 109 రాను పోను రైలు మార్గలు, ప్రతి రైలులో 16 బోగీలు వుండే 151 రైళ్ల ప్రయివేటు కంపెనీలకి అప్పజెప్పటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీని వలన 30,000 కోట్ల ప్రయివేటు పెట్టుబడి రైల్వే లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.  ప్రజల సమిష్టి ఆస్తిని ఇలా ప్రయివేటు పరం చేయటానికి..రైల్వేలో ప్రైవేట్ సంస్థలను అనుమతించే ప్రణాళికను  రైల్వే మంత్రిత్వ శాఖ 2019 డిసెంబర్‌లో బిడ్డింగ్ ప్రక్రియతో ప్రారంభించింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, మొదటి బిడ్డింగ్ జరిగినప్పుడు మౌలిక సదుపాయాలు, రైల్వే చేసే వస్తు రవాణా వ్యాపారంలో 20 కంపెనీలు ఆసక్తిని కనబరిచాయి. ఇలా ఆసక్తి కనబరిచే వారిలో అదానీ పోర్ట్స్, టాటా రియాల్టీ అండ్  ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్సెల్ గ్రూప్, బొంబార్డియర్ ఇండియా అండ్ మాక్వేరీ గ్రూప్ ఉన్నాయి. ఇదంతా కరోనావైరస్ మహమ్మారికి ముందే జరిగింది. గమనించాల్సింది ఏమంటే రైల్వే చేసే వస్తు రవాణా వ్యాపారంలో రైల్వే అత్యధిక ఆదాయం ఆర్జిస్తోంది. ఈ విభాగం ప్రయివేటు కంపెనీలు తమచేతుల్లోకి తీసుకోటానికి అర్రులు చాచాయి ఆమేరకు సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం పౌరులు ప్రయాణించే విభాగంలోకి ప్రభుత్వం ప్రయివేటు వారిని ఆహ్వానిస్తున్నది.

భారతీయుల అవసరాలు తీర్చటానికి 20000 వేల రైళ్లు కావాలని, ప్రస్తుతం భారత ప్రభుత్వం 13000 వేల రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి అని, మరో 7000 వేల ట్రైన్లు కావాలి అందుకే ప్రయివేటు కంపెనీలను పిలిచి రైల్వేను వారికీ అప్పగిస్తున్నాం అని మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్నారు. ఇకపై హై స్పీడ్ ట్రైన్స్ తేజస్..వందే భారత్.. రాజధాని వంటి ప్రయివేటు కంపెనీల చేతుల్లోకి పోతున్నాయి.. వీటిని విమానాలతో పోటీపడేలాగా నడుపుతాయి ప్రయివేటు కంపెనీలు అని ప్రభుత్వం చెబుతున్నది.. అలాగే వీటి టికెట్స్ కూడా విమానం టికెట్ ధరలతో పోటీ పడనున్నాయి అని కూడా ప్రభుత్వం చెబుతున్నది..ఎలాగైతే విమానం టికెట్స్ డైనమిక్ గా ఆన్లైన్ లో మారిపోతూ కనిపిస్తాయో అలాగే ఇకపై రైలు టికెట్ కూడా కానుంది. భారతీయ రైల్వేకి ప్రతి ఏడు సుమారు 2 లక్షల కోట్ల ఆదాయం వస్తు రవాణా..టికెట్ సేల్స్ ద్వారా వస్తుంది. అత్యధిక ఆదాయం వస్తు రవాణాలో భారతీయ రైల్వే సంపాదిస్తుంది. ఈ విభాగం ఈసరికే రైల్వే మంత్రాలయం ప్రయివేటు పరం చేసింది. ఇప్పుడు  రైల్వే మంత్రాలయం చెప్పేమాట ఏమంటే.. రైల్వే 100 రూపాయలు పెట్టుబడి పెడితే అందులో 99 రూపాయలు నిర్వహణ ఖర్చుకి పోతున్నది. ప్రభుత్వానికి మిగిలేది ఒక్క రూపాయి మాత్రమే అని చెబుతున్నది.. అంటే 99 రూపాయల నిర్వహణ ఖర్చు వలన లాభ పడుతున్నది రైలు ప్రయాణం చేసే మీ లాంటి.. నా లాంటి ప్రజలు..అలాగే రైల్వే ఉద్యోగులు. లాభం వచ్చే విభాగం ప్రయివేటు వారికి అప్పజెప్పి ప్రజల రవాణాలో కొంత ప్రజా లాభం ఇమిడి ఉండటం వలన నష్టం వస్తూవుంటే యెంత మాత్రం  సమ్మతం కాదు అని ప్రభుత్వం తేల్చి చెబుతున్నది. అందుకే ఇక ప్రయివేటు వారు రైల్వేని తమ లాభం కోసం నడుపుతారు అంటూ ప్రభుత్వ అన్ని ఏర్పాట్లు పూర్తీ చేసింది. ప్రభుత్వం చెబుతున్న మరో వాదన ఏమనగా ప్రైవేటు కంపెనీల మధ్య పోటీ ఉంటుంది కనుక రైలు సకాలంలో నడుస్తుంది..రైలు టాయిలెట్స్ ఇకపై పరిశుభ్రంగా ఉంటాయి ప్రయాణికులకు మంచి సదుపాయాలు సమకూరుతాయి.. అంటే స్వతంత్రం వచ్చి ఇన్ని  నాళ్ళు అయినా కనీసం రైల్వేని సక్రమంగా నడపలేకపోయాం అందుకే ప్రయివేటు పరం చేస్తున్నాం అని ప్రభుత్వం ఒప్పుకుంది. ఇక ప్రయివేటు వారు నడిపే విమాన సెక్టార్ ఉద్యోగులు పడుతున్న బాధలు మనకి తెలియనివి కావు.. అంతే కాకుండా విమానం ప్రయాణం చేయగలిగిన వారు ఎంతమందో కూడా మనకి తెలిసిందే..ప్రస్తతం ప్రభుత్వ చేపట్టిన ఈ చర్యలు భారతీయులలో అసమానతలు మరింత పెంచటం ఖాయం అనేది మన కళ్ళముందు వున్నా సత్యం

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!