కోవిడ్ వారియర్స్‌కు నా పతకం అంకితం: పివి సింధు
టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం గెలిచిన పీవీ సింధుకు ఇవాళ భారత పార్లమెంట్ అభినందనలు తెలిపింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. షట్లర్ సింధుకు కంగ్రాట్స్ తెలిపారు. ఒలింపిక్స్‌లో సింధుఎ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని, వరుసగా రెండు ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించినట్లు వెంకయ్య తెలిపారు. లోక్‌సభ కూడా సింధుకు కంగ్రాట్స్ చెప్పింది. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి సింధు బ్రాంజ్ మెడల్ గెలిచినట్లు చెప్పారు. వ్యక్తిగత ఈవెంట్లో రెండు మెడల్స్ వరుసగా గెలుచుకున్న భారతీయ మహిళా క్రీడాకారిణి ఆమె అని స్పీకర్ తెలిపారు. ఆమె సాధించిన విజయాలు ఈ దేశ యువతకు ప్రేరణకు నిలుస్తుందని భావిస్తున్నట్లు ఓం బిర్లా వెల్లడించారు.
కోవిడ్ వారియర్స్‌కు నాపతకం అంకితం: పివి సింధు
టోక్యోలో కాంస్యం సాధించిన పీవీ సింధు ఘనస్వాగతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుసగా రెండు ఒలింపిక్స్ పతకాలతో చరిత్ర సృష్టించిన సింధు స్వదేశం చేరుకున్న తర్వాత వీలైన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసే అవకాశముంది. ఈ మర్యాదపూర్వక భేటీలో మోదీతో కలిసి సింధు ఐస్‌క్రీమ్ పార్టీ చేసుకోనున్నారు. 2024 పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో సర్ణం సాధించేందుకు సింధు ప్రయత్నించనున్నట్లు తెలిపారు. సెమిస్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయినా..త్వరగానే తేరుకుని బాగా ఆడి కాంస్యం సాధించినట్లు ఆమె వెల్లడించారు. తనకు దక్కిన కాంస్య పతకాన్ని కోవిడ్ వారియర్స్‌కు అంకితమిస్తున్నట్లు సింధు వెల్లడించారు.