Take a fresh look at your lifestyle.

పునర్‌ ‌వైభవం దిశగా భారత పురుషుల హాకీ జట్టు

“ఎన్నాళ్ల కెన్నాళ్ళకో భారత హాకీ జట్టుకు ఓక సువర్ణ అక్షరాలతో లిఖింపబడే ఓక గొప్ప రోజు ఆవిష్క్తృతమైంది. ఓక విధంగా చెప్పాలంటే భారత పురుషుల హాకీ జట్టు సాధించిన ఈ అసాధారణ, అపూర్వ విజయాన్ని చూసి యావత్‌ ‌భారతవాణి ఉప్పొంగిపోతున్నది, కోట్లాది మంది భారత క్రీడాభిమానులు ఆనంద సాగరం లో మునిగిపోయారు.ముఖ్యంగా భారత హాకీ జట్టు సాధించిన ఈ అపురూప, చిరస్మరణీయమైన విజయాన్ని పరిశీలిస్తే ఇందులో డ్రాగ్‌ ‌ప్లికర్ల పాత్ర చాలా కీలకం. ఈ పాత్రకు నిజమైన న్యాయం చేసారు రూపిందర్‌ ‌పాట్‌, ‌హార్మన్‌ ‌ప్రీత్‌, అమిత్‌ ‌వీరంతా అత్యద్భుతమైన టెక్నిక్‌ ‌తో భారత్‌ ‌హాకీ జట్టును ఈ టోక్యో ఒలింపిక్స్ ‌లో విజయాల బాట పట్టించడం లో నూటికి నూరుపాళ్లు సపళీకృత్యులు కాగలిగారు. అంతేగాకుండా ఖచ్చితంగా, చావో రేవో తెల్చుకోవాల్సిన ఈ ప్రతిష్టాత్మక పోరు లో స్టార్‌ ‌గోల్‌ ‌కీపర్‌ ‌శ్రీజేష్‌ ‌ప్రత్యర్థి జట్టు సందించిన ఐదు పెనాల్టీ కార్నర్‌ ‌లలో నాలుగింటిని అత్యంత విజయవంతంగా అడ్డుకొని భారత హాకీ సాధించిన ఈ అఖండ విజయం లో తాను భాగస్వామి అయ్యాడు.”

దాదాపు 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఎట్టకేలకు మన్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సేన టోక్యో ఒలింపిక్స్ ‌లో కాంస్య పతకం సాధించి నూతన చరిత్రకు స్వీకారం చుట్టింది.ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ‌జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఓ దశలో భారత పురుషుల హాకీ జట్టు 1- 3 తో వెనుకబడినప్పటికీ తిరిగి పుంజుకొని చివరకు 5 – 4 తేడాతో విజయదుందుబి మ్రోగించడం అనేది ఎంతైనా హర్షనీయమైన విషయం. ఈ అపురూప, అసాధారణ విజయం తో భారత పురుషుల హాకీ జట్టు పునర్‌ ‌వైభవం దిశగా ముందుకు దూసుకువెళ్లడం తథ్యం. ఎన్నాళ్ల కెన్నాళ్ళకో భారత హాకీ జట్టుకు ఓక సువర్ణ అక్షరాలతో లిఖింపబడే ఓక గొప్ప రోజు ఆవిష్క్తృతమైంది. ఓక విధంగా చెప్పాలంటే భారత పురుషుల హాకీ జట్టు సాధించిన ఈ అసాధారణ, అపూర్వ విజయాన్ని చూసి యావత్‌ ‌భారతవాణి ఉప్పొంగిపోతున్నది, కోట్లాది మంది భారత క్రీడాభిమానులు ఆనంద సాగరం లో మునిగిపోయారు.ముఖ్యంగా భారత హాకీ జట్టు సాధించిన ఈ అపురూప, చిరస్మరణీయమైన విజయాన్ని పరిశీలిస్తే ఇందులో డ్రాగ్‌ ‌ప్లికర్ల పాత్ర చాలా కీలకం.

ఈ పాత్రకు నిజమైన న్యాయం చేసారు రూపిందర్‌ ‌పాట్‌, ‌హార్మన్‌ ‌ప్రీత్‌, అమిత్‌ ‌వీరంతా అత్యద్భుతమైన టెక్నిక్‌ ‌తో భారత్‌ ‌హాకీ జట్టును ఈ టోక్యో ఒలింపిక్స్ ‌లో విజయాల బాట పట్టించడం లో నూటికి నూరుపాళ్లు సపళీకృత్యులు కాగలిగారు. అంతేగాకుండా ఖచ్చితంగా, చావో రేవో తెల్చుకోవాల్సిన ఈ ప్రతిష్టాత్మక పోరు లో స్టార్‌ ‌గోల్‌ ‌కీపర్‌ ‌శ్రీజేష్‌ ‌ప్రత్యర్థి జట్టు సందించిన ఐదు పెనాల్టీ కార్నర్‌ ‌లలో నాలుగింటిని అత్యంత విజయవంతంగా అడ్డుకొని భారత హాకీ సాధించిన ఈ అఖండ విజయం లో తాను భాగస్వామి అయ్యాడు. ఇంకా చెప్పుకుంటూ పొతే ఈ చారిత్రాత్మిక విజయం లో సిమ్రన్‌ ‌జీత్‌ ‌సింగ్‌(2), ‌హార్దిక్‌ ‌సింగ్‌, ‌హార్మన్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌,‌రూపిందర్‌ ‌పాల్‌ ‌సింగ్‌ ‌తలో గోల్‌ ‌ను సాధించి భారత హాకీ జట్టుకు ఎప్పటికి మరచిపోలేని ఒలింపిక్స్ ‌పతకాన్ని సాధించి పెట్టారు.

ఏదిఏమైనా టోక్యో ఒలింపిక్స్ ‌లో భారత హాకీ జట్టు సాధించిన ఈ కాంస్య పతకం మన్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సేనకు ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని, తమ సత్తా మీద తమకు ఓక గొప్ప నమ్మకాన్ని కలుగజేస్తుంది అనడం లో ఎలాంటి సందేహనికి తావు లేదు. ఏమైనా నూట యాభై కోట్ల మంది భారతదేశ ప్రజానీకం తమ మీద పెట్టుకున్న అనంతకోటి ఆశలను, ఆకాంక్షలను వమ్ము చేయకుండా తమ ప్రతిభా సామర్త్యాలను చాలా గొప్పగా చాటి భారత దేశ ఖ్యాతిని, కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన మన భారత హాకీ జట్టు వీరులకు జేజేలు పలుకుదాం,శతకోటి వందనాలు తెలియజేద్దాం.ఇలాగే ఇదే ఉత్సహం, నూతనోత్తేజం, విజయ దరహాసం తో రాబోయే ప్రదాన ఛాంపియన్‌ ‌షిప్‌ ‌లలో, ఆపై పారిస్‌ ఒలింపిక్స్ ‌లో సైతం మన్‌ ‌ప్రీత్‌ ‌సేన తమ సత్తా చాటాలని, విజయాలదాహర్తిని తీర్చుకోవాలని కోట్లాది మంది భారతదేశ క్రీడాభిమానుల బలీయమైన ఆకాంక్ష.హ్యాట్సాఫ్‌ ‌టు ఇండియన్‌ ‌హాకీ టీం! జయహో మన్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సేన! జయహో భారత్‌, ‌మేరా భారత్‌ ‌మహాన్‌!.

– ‌రావుల రాజేశం,
తెలంగాణ సామాజిక రచయితల సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..కరీంనగర్‌ ‌జిల్లా.9848811424.

Leave a Reply