Take a fresh look at your lifestyle.

భారత స్వాతంత్య్ర చట్టం 1947

‘‘90 ఏళ్ల స్వాతంత్య్ర పోరాట క్రమాల అనంతరం చివరి బ్రిటీష్‌ ‌గవర్నర్‌ ‌జనరల్‌ అయిన విస్కౌట్‌ ‌లూయీస్‌ ‌మౌంట్‌ ‌బాటెన్‌ 1947 ‌జూన్‌ 3 ‌న బ్రిటీష్‌ ఇం‌డియాని లౌకిక భారత దేశం గాను, ఇస్లామిక్‌ ‌పాకిస్తాన్‌ ‌గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు.’’

పొట్ట కూటికోసం, సుగంధ ద్రవ్యాల వ్యాపా రార్ధం 1498లో వాస్కొడ గామా కాలికట్‌ ‌లోని కోజికొడ్‌ ఓడ రేవులో  కాలూనినది మొదలు ఐరోపా వర్తకుల రాకపోకలు భారత ఉప ఖండంలో ప్రారంభమైనాయి. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ ‌క్లైవ్‌ ‌నేతృత్వంలోని బ్రిటీష్‌ ‌సైన్యం బెంగాల్‌ ‌నవాబుపై విజయం సాధించ టంతో, భారత దేశంలో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ పాలన ప్రారంభమైంది. 1773 రెగ్యులేటింగ్‌ ‌చట్టం, 1784లో చేసిన ఇండియా చట్టం, 1833 చార్టర్‌ ‌చట్టం మెదలైన చట్టాలు భారతదేశంలో బ్రిటీష్‌ అధికారాన్ని సుస్థిరం చేశాయి. 1849 పంజాబ్‌ ఆ‌క్రమణ తరువాత అనేక చిన్నచిన్న తిరుగుబాట్లు, అనంతరం 1857 సిపాయిల తిరుగుబాటు ఫలితంగా, బ్రిటీష్‌ ‌వారు ఈస్ట్ ఇం‌డియా కంపెనీ పరిపాలనను రద్దు చేసి విక్టో రియా రాణి పరిపాలనను ప్రవేశ పెట్టారు. భారత పాలనా వ్యవహారాలను చూసుకోవటానికి వైస్రా యిని నియమించారు. ఈ విధంగా భారతదేశం నేరుగా బ్రిటీష్‌ ‌పాలనలోకి వచ్చింది. 90 ఏళ్ల స్వాతంత్య్ర పోరాట క్రమాల అనంతరం చివరి బ్రిటీష్‌ ‌గవర్నర్‌ ‌జనరల్‌ అయిన విస్కౌట్‌ ‌లూయీస్‌ ‌మౌంట్‌ ‌బాటెన్‌ 1947 ‌జూన్‌ 3 ‌న బ్రిటీష్‌ ఇం‌డియాని లౌకిక భారత దేశం గాను, ఇస్లామిక్‌ ‌పాకిస్తాన్‌ ‌గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్‌, 1947 ఇవ్వబడుతుంది. ఆగస్టు 15 న భారత దేశం స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. భారత స్వాతంత్య్ర చట్టం 1947 అన్నది బ్రిటిషు ఇండియాను భారతదేశం, పాకిస్తాన్‌ అన్న రెండు స్వతంత్ర డొమినియన్లుగా విభజించేందుకు యునైటెడ్‌ ‌కింగ్‌ ‌డమ్‌ ‌పార్లమెంటు చేసిన చట్టం. జూలై 18, 1947న ఈ చట్టం రాజ సమ్మతి పొందింది.

సంప్రదింపుల అనంతరం జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ, వల్లభ్‌ ‌బాయి పటేల్‌, ఆచార్య కృపలానీ ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ ‌పార్టీ, మహమ్మద్‌  అలీ జిన్నా, లియాఖత్‌ అలీ ఖాన్‌, అబ్దుల్‌ ‌రబ్‌ ‌నిష్తార్‌ ‌ప్రాతినిధ్యంలోని ముస్లిం లీగ్‌, ‌సిక్కుల ప్రతినిధిగా సర్దార్‌ ‌బల్దేవ్‌ ‌సింగ్లతో గవర్నర్‌ ‌జన రల్‌ ఆఫ్‌ ఇం‌డియా లార్డ్ ‌మౌంట్‌ ‌బాటన్‌ ఒప్పందానికి వచ్చాక, భారత స్వాతంత్య్ర అనుకూలుడైన బ్రిటిష్‌ ‌ప్రధాన మంత్రి క్లెమెంట్‌ అట్లీ ప్రభుత్వం, భారత గవర్నర్‌ ‌జనరల్‌ ‌లార్డ్ ‌మౌంట్‌ ‌బాటన్‌ ‌కలిసి చట్టాన్ని తయారు చేశారు. అధికార బదిలీ కోసం సంప్రదింపులు చేసేందుకు వచ్చిన క్యాబి నెట్‌ ‌మిషన్‌ ‌సమైక్య భారత సమాఖ్య ప్రతిపాదన (మే 16 ప్రతిపాదన)కు కాంగ్రెస్‌, ‌ముస్లింలీగ్‌ ‌ల ఆమోదం లభించింది.

కానీ కేబినెట్‌ ‌మిషన్‌ ‌సభ్యుడు క్రిప్స్ ఎవరికి అనుకూలమైన నిర్వచనం వారికి చెప్తూ ఆమోదం పొందడంతో వారు వెళ్ళగానే కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ ప్రసింగిస్తూ, దాన్ని పూర్తిగా తిరస్కరిం చాడు. దాంతో ఆగ్రహించిన ముస్లిం లీగ్‌ ‌నాయ కుడు జిన్నా ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపుతో హింసాత్మకమైన మలుపుతో కాంగ్రెస్‌, ‌బ్రిటిషు ప్రభుత్వాలపై ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశాన్ని సమాఖ్యగా ఉంచే మే 16 ప్రతిపాదన, పూర్తి బెంగాల్‌, ‌పూర్తి పంజాబ్‌ ‌లతో పాకిస్తాన్‌ ‌విభజించి ఏర్పరిచే జూన్‌ 16 ‌ప్రతిపాదనకు మధ్యగా మరో ప్రణాళికను ముందు సివిల్‌ ‌సర్వెంట్‌ ‌వి.కె.మీనన్‌ ‌తయారు చేశారు. దీని ప్రకారం బ్రిటిషు ఇండియా… భారత దేశం, పాకిస్తాన్లుగా విభజన అవుతుంది. అలాగే బెంగాల్‌, ‌పంజాబ్‌ ‌ప్రావిన్సులు కూడా విభజితమై, ముస్లింలు ఎక్కు వగా ఉన్న ప్రాంతాలు పాకిస్తాను, హిందువుల సంఖ్యాధిక్యత ఉన్న ప్రాంతాలు భారతదేశానికి లభిస్తాయి. ఇది మౌంట్‌ ‌బాటన్‌ ‌ప్రణాళికగా పేరొందింది.

బ్రిటిష్‌ ‌ప్రధాన మంత్రి క్లెమెంట్‌ అట్లీ 1947 ఫిబ్రవరి 20న చేసిన ప్రకటన ప్రకారం బ్రిటిషు ప్రభుత్వం బ్రిటిషు ఇండియాకు పూర్తి స్వంత ప్రభు త్వాన్ని కనీసం 1948 జూన్‌ ‌నాటికి మంజూరు చేస్తుంది. తుది (అధికార) బదిలీ తేదీ నిర్ణయించిన తర్వాత సంస్థానాల భవితవ్యం నిర్ణయమవు తుంది. ప్రధానంగా లార్డ్ ‌మౌంట్‌ ‌బాటన్‌ ‌ప్రణాళికగా పేరొందిన బ్రిటిషు ప్రభుత్వం 1947 జూన్‌ 3‌న ప్రతిపాదించిన ప్రణాళికలో గల అంశాలు భారత విభజనకు సూత్రాన్ని బ్రిటిషు ప్రభుత్వం అంగీకరించింది. వారసులుగా వచ్చే ప్రభుత్వాలకు డొమినియన్‌ ‌స్థాయి ఇవ్వ బడుతుంది. బ్రిటిషు కామన్వెల్త్ ‌నుంచి ఎప్పుడైనా తప్పుకునేందుకు షర తులులేని హక్కు ఉంటుంది. అలా భారత స్వాతంత్య్ర చట్టం 1947 అన్నది జూన్‌ 3 ‌ప్రణాళికకు అమలు వంటిది.

1947 ఆగస్టు 15న బ్రిటిష్‌ ఇం‌డియాను భారత దేశం, పాకిస్తాన్‌ అనే రెండు కొత్త దేశాలుగా విభ జించడంబీ బెంగాల్‌, ‌పంజాబ్‌ ‌ప్రావిన్సుల విభ జించి, రెండు కొత్త దేశాలకు పంపకం చెయ్యడంబీ రెండు కొత్త దేశాలలో గవర్నర్‌ ‌జనరల్‌ ‌కార్యాల యాన్ని బ్రిటన్‌ ‌రాచరికపు ప్రతినిధిగా ఏర్పాటు చేయడంబీ రెండు కొత్త దేశాల రాజ్యాంగ సభలకు పూర్తి శాసనాధికారాన్ని ఇవ్వడంబీ 1947 ఆగస్టు 15 న సంస్థానాలపై బ్రిటిష్‌ అధికారాన్ని ముగిం చడం. స్వతంత్రంగా ఉండడానికి గాని, ఏదో ఒక దేశంలో చేరడానికి గాని వాటికి ఉన్న హక్కును గుర్తించడంబీ బ్రిటిషు చక్రవర్తి ‘భారత చక్రవర్తి’ అనే పేరును వాడడాన్ని రద్దు చేయడం (కింగ్‌ ‌జార్జ్ •× ‌రాజు 1948 జూన్‌ 22 ‌న రాజ ప్రకటన ద్వారా దీన్ని అమలు చేశాడు). సాయుధ దళాల విభజనతో సహా ఉమ్మడి ఆస్తిని రెండు కొత్త దేశాల మధ్య పంపకానికి ఈ చట్టం ఏర్పాటు చేసింది. ఈ చట్టం ప్రకారం భారతదేశం, పాకిస్తాన్‌. ‌రెండు కొత్త డొమినియన్లు భారత సామ్రాజ్యం నుండి. ఉద్భవిస్తాయి. 1947 ఆగస్టు 15 ను విభజన తేదీగా నిర్ణయించారు.

కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే లోపు, కొత్త రాజ్యాలను, దాని ప్రావి న్సులనూ భారత ప్రభుత్వ చట్టం 1935కు లోబడికొత్త డొమినియన్ల ఏర్పాటు ఫలితంగా…హిస్‌ ‌మెజెస్టీ ప్రభుత్వం కొత్త డొమినియన్లపై అన్ని బాధ్య తలను కోల్పోయింది. భారతీయ రాష్ట్రాలపై హిజ్‌ ‌మెజెస్టీ ప్రభుత్వం అధికారం ముగిసింది. ఈ చట్టం ఆమోదించే టప్పుడు అమలులో ఉన్న భారతీయ రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాలతో ఉన్న అన్ని ఒప్పం దాలూ, ఒడంబడికలూ ముగిశాయి. బ్రిటిష్‌ ‌క్రౌన్‌ ‌బిరుదుల నుండి ‘భారత చక్రవర్తి’ అనే బిరుదు తొలగించబడింది. సెక్రెటరీ ఆఫ్‌ ‌స్టేట్‌ ‌ఫర్‌ ఇం‌డియా కార్యాలయం రద్దు అయింది. 1947 జూన్‌ 4 ‌న, మౌంట్‌ ‌బాటెన్‌ ‌విలేకరుల సమావేశం నిర్వహించారు. తద్వారా దేశంలోని 563 కు పైగా ఉన్న భారతీయ సంస్థానాలకు, బ్రిటన్కు మధ్య ఉన్న ఒప్పందం సంబంధాలు ముగిసి పోతాయని, 1947 ఆగస్టు 15న బ్రిటిష్‌ అధికారం ముగుస్తుందని, క్రొత్త డొమినియన్లలో ఏదో ఒకదానిలో చేరడానికి, లేదా స్వతంత్రంగా ఉండడానికి వారికి స్వేచ్ఛ ఉంటుందని వివరిం చారు. చివరి వైస్రాయ్‌ ‌లార్డ్ ‌మౌంట్‌ ‌బాటన్‌ ‌భారత గవర్నర్‌ ‌జనరల్గా కొనసాగాలని భారత నాయకులు కోరారు. జవహర్లాల్‌ ‌నెహ్రూ భారత ప్రధాని, సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌హోంమంత్రి అయ్యారు. ఆగస్టు 15 నాటికి 560కి పైగా రాచ రిక రాష్ట్రాలు భారత దేశానికి చేరాయి. తర్వాత జమ్మూ కశ్మీర్‌ 1947 అక్టోబరు 26 న, హైదరా బాద్‌ ‌రాజ్యం భారత ప్రభుత్వ 1948 సెప్టెంబరు 13 న సైనిక చర్య జోక్యం ద్వారా సెప్టెంబర్‌ 17‌న భారతదేశంలో విలీనం అయింది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
    9440595494

Leave a Reply