Take a fresh look at your lifestyle.

దెబ్బతిన్న ఆర్థిక రంగానికి చికిత్స చేయాలి

తగు ప్రోత్సాహకాలతోనే బయటపడగలం
ఆర్థిక,పారిశ్రామికవేత్తలదీ ఇదే అభిప్రాయం

కొరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో గతేడాది దెబ్బతిన్న ఆర్థిక రంగం మళ్లీ కోలుకునే దశలో సెకండ్‌వేవ్‌ ఇప్పు‌డు అతలాకుతలం చేస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడంతో ఆర్థిక రంగం కుదేలైంది. ఇప్పట్లో కుదురుకోవడ కష్టమని ఆర్థిక పండితులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వాలు తీసుకునే చర్యలపై దీని పునరుద్దరణ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఎకానవి• కుదురుకునేందుకు చాలా సమయం పడుతుందని సీఐఐ లాంటి సంస్థలు ఇప్పటికే స్పష్టం చేసాయి. ఆర్థిక ఊతం ఇస్తే తప్ప కోలుకోవడం కష్టమని రఘురామరాజన్‌ ‌తదితర ఆర్థివేత్తలు ఏడాదిగా హెచ్చరిస్తూనే ఉన్నారు.

గతేడాది లాక్‌డౌన్‌ ‌తర్వాత ఉద్యోగాల్లో కోత తప్పదని సగానికి పైగా సంస్థలు వెల్లడించాయి. 15 నుంచి 30 శాతం వరకూ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. గతేడాది కొరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు సానుకూల ఫలితాలనిచ్చినప్పటికీ ఆర్థిక  కార్యకలాపాలు పూర్తి నిలిచిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిందని పారిశ్రామికవేత్తలు కూడా తెలిపారు. ఇపుడు ఆర్ధిక పతనంనుంచి కాపాడేందుకు త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

వైరస్‌ ‌కట్టడితోపాటు ప్రస్తుతం ఆర్థిక శ్రేయస్సుపై కూడా దృష్టి పెట్టడం అత్యవసరమని పలువురు వ్యాఖ్యానించారు. ఎకానవి• జారిపోకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూడాలన్నారు. దేశంలో ఆర్థికమాంద్యం కూడా ప్రమాదమేనని  పేర్కొన్నారు. అలాగే అతి తక్కువ సమయంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుని సామర్థ్యానికి  సాధించేందుకు కొత్త  పని మార్గాలను కనుగొనాలని అంటున్నారు. ఈ దశలో ఆయా రంగాలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు సాగితేనే మనుగడ సాధ్యమని అంటున్నారు.

Leave a Reply