భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం!
ప్రజాతంత్ర, వరంగల్, మార్చి 29 : భారతదేశంలో అనాదిగా సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి అని, వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుని పై ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్. తమిళి సై సౌందర రాజన్ అన్నారు. మంగళవారం కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్టస్ అండ్ సైన్స్ కళాశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ‘‘సంస్కృతి మహోత్సవ’’ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు, ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ…భారతదేశం విభిన్న భాషలు, మతాలు, సంస్కృతి సాంప్రదాయాలతో కలగలుపుగా నిలుస్తుందని, ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు గలది భారతదేశం అని ఆమె అన్నారు.
ఆధునిక కాలములో సంస్కృతి సాంప్రదాయాలు రోజురోజుకు మరుగున పడిపోతుందని అయితే వీటిని పునరుద్ధరించి పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. భారతదేశం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పరిశీలిస్తే అనేక సంస్కృతి సంప్రదాయాలు మనకు దర్శనమిస్తాయి అని వీటినన్నింటిని ముందు తరాలకు అందించడానికి మనమందరం సిద్ధం కావాలని ఆమె అన్నారు. ఆజాది అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం వర్తమాన సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాలకు చెందిన చేతి వృత్తులు కళాకారుల చేయబడిన వస్తువులు ముఖ్యంగా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన కల వృత్తులు గాజులు బట్టలు ఇతర కులవృత్తులను ఈ సాంస్కృతిక మహోత్సవం లో ప్రదర్శిస్తున్నారు.
దేశానికి స్వాతంత్య్రం రావడానికి శ్రమించిన స్వాతంత్ర సమరయోధులకు కామ చేతులెత్తి నమస్కరించారు, సుభాష్ చంద్రబోస్ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు బ్రిటిష్ వారి భారత దేశం నుంచి వెళ్లగొట్టడానికి ప్రతి భారతీయుడు తన రక్తపుబొట్టు దారపు యాలని ఆమె అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలో ఐక్యతను పెంపొందిస్తాయని రాజస్థాన్ అస్సాం గుజరాత్ తదితర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కళాకారులు తమ సంస్కృతి చాటాలని ఆమె అన్నారు నేటి యువతీ యువకులు భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల అధికారులు కిరణ్ గోపి గుస్సా, అమిత ప్రసాదులు సాంస్కృతిక ఉత్సవాల గురించి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను వారు వెల్లడించారు . కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ రాక సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టినారు.