Take a fresh look at your lifestyle.

స్మార్ట్‌ఫోన్‌ ‌వినియోగంలో భారతీయ బాలలు ముందంజ

(మ్యాక్‌ ఎఫీ కార్ప్ ‌సంస్థ తాజాగా విడుదల చేసిన ‘లైఫ్‌ ‌బిహైండ్‌ ‌ది స్క్రీన్స్ ఆఫ్‌ ‌పారెంట్స్, ‌ట్వీన్స్ అం‌డ్‌ ‌టీన్స్’ ‌నివేదిక ఆధారంగా)

ప్రపంచ స్థాయిలో 10-14 ఏండ్ల భారతీయ బాలలు ఆన్‌లైన్‌ ‌ప్రమాదపు అంచున నిలబడ్డారని, చిన్న వయస్సులోనే మెబైల్‌ ‌మాచురిటీ కలిగి ఉన్నారని, తెలియకుండానే మన చిన్నారి చేతులు అంతర్జాల నీలి తెరల వలలో చిక్కుకునే అవకాశం ఉందని ఇటీవల ‘మ్యాక్‌ ఎఫీ కార్ప్’ ‌సంస్థ విడుదల చేసిన ‘లైఫ్‌ ‌బిహైండ్‌ ‌ది స్క్రీన్స్ ఆఫ్‌ ‌పేరెంట్స్, ‌ట్వీన్స్ అం‌డ్‌ ‌టీన్స్’ ‌నివేదిక పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 10-14 ఏండ్ల పిల్లలు 76 శాతం స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్నారని, ఇండియాలో 7 శాతం అధికంగా 83 శాతం బాలలు స్మార్ట్‌ఫోన్‌ ‌తెరల్లో కాలంగడుపుతున్నారని ఆసక్తికర ఫలితాలను సంస్థ విడుదల చేసింది. మన స్మార్ట్ ‌బాలలు ఆన్‌లైన్‌ ‌ప్రమాదాల అంచున నిలబడ్డారని, అంతర్జాతీయ స్థాయిలో 17 శాతం బాలలు  సైబర్‌ ‌బెదిరింపుల (సైబర్‌బుల్లీయింగ్‌)‌కు లోనుకాగా, 22 శాతం భారతీయ బాలలు ఈ వలలో చిక్కుకుంటున్నారని తేలింది. ప్రపంచ స్థాయిలో 90 శాతం తల్లితండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్‌ ‌వాడకాన్ని నియంత్రించే బాధ్యతలను అవగాహన చేసుకున్నట్లు తేలింది.

అధ్యయన అంశాలు :
ఇండియా, యూకె, జర్మనీ, అమెరికా, మెక్సికో, ఫ్రాన్స్, ‌జపాన్‌, ఆ‌స్ట్రేలియా, బ్రెజిల్‌, ‌కెనడా దేశాలకు చెందిన 15,500 మంది పేరెంట్స్,12,000 ‌మంది బాలల అభిప్రాయాలను శాస్త్రీయంగా సేకరించి అధ్యయన నివేదికను ‘మ్యాక్‌ ఎఫీ కార్ప్’ ‌సంస్థ తయారు చేసి ఇటీవల విడుదల చేసింది. సంస్థ చేపట్టిన అధ్యయనంలో మెబైల్‌ ‌మాచురిటీ, టాప్‌ ‌డివైజెస్‌, ‌సైబర్‌ ‌బెదిరింపులు, అకౌంట్‌ ‌దొంగిలించడం/ఆర్థిక సమాచార లీకేజీలు, లింగ రక్షణ పక్షపాతం అనబడే ఐదు అంశాలను విశ్లేషించారు.

సైబర్‌ ‌నేరాలు – తల్లితండ్రులే రక్షకులు :
భారతీయ బాలలు చిరుప్రాయంలోనే స్మార్ట్‌ఫోన్‌ ‌వాడకానికి ఉత్సుకత చూపుతున్నారని వెల్లడైంది. ఆన్‌లైన్‌ ‌మోసాలు, ఆర్థిక సమాచార లీకేజీలు, సైబర్‌ ‌బెదిరింపులు,వ్యక్తిగత సమాచారం దొంగిలించడం లాంటి తీవ్ర ప్రమాదాల నుంచి పిల్లల్ని కాపాడవలసిన కనీస బాధ్యతను తల్లితండ్రులు తీసుకోవాలని సంస్థ సూచిస్తున్నది. ఆన్‌లైన్‌ ‌భద్రతలకు 73 శాతం ప్రపంచ బాలలు అమ్మానాన్నల వైపుచూస్తున్నారని, తల్లితండ్రులు ఆన్‌లైన్‌ ‌భద్రతలు కల్పించుటలో సతమతం అవుతున్నట్లు తేలింది. గ్లోబల్‌ ‌స్థాయిలో 56 శాతం పేరెంట్స్ ‌తమ స్మార్ట్‌ఫోన్లను పాస్‌వర్డ్‌తో రక్షించుకుంటున్నారని, 42 శాతం తల్లితండ్రులు తమ పిల్లల స్మార్ట్‌ఫోన్లను పాస్‌వర్డ్‌లతో రక్షిస్తున్నారని తేలింది. సామాజిక మాద్యమాల్లో గ్లోబల్‌ ‌స్థాయిలో 57 శాతం పేరెంట్స్ ‌సైబర్‌ ‌బెదిరింపులు, దుర్భాషలు, మోసాలకు భయపడుతున్నారని, ఇండియాలో 47 శాతం పేరెంట్స్ ‌మాత్రమే భయపడుతున్నట్లు తేలింది. భారతీయ కుటుంబ సభ్యులు అధికంగా ఆన్‌లైన్‌ ‌మోసాల అనుభవాలను వెల్లడిస్తున్నారని అధ్యయనంలో తేలింది. భారతీయ పేరెంట్స్ 33 ‌శాతం (28 శాతం ప్రపంచ సగటు) ఆన్‌లైన్‌ అకౌంట్ల మోసాలను అనుభవించారని తెలుస్తున్నది. భారతీయ బాలలు 26 శాతం ఆన్‌లైల్‌ ‌మోసాలను అనుభవించగా, ప్రపంచ సగటు 15 శాతం మాత్రమే ఉన్నట్లు గమనించారు. ప్రపంచ స్థాయిలో 13 శాతం పేరెంట్స్‌తో పాటు పిల్లల పైనాన్సియల్‌ ‌సమాచారం లీక్‌ ‌కాగా, 21 శాతం భారతీయ పేరెంట్స్/‌పిల్లలు ఆర్థిక సమాచారాలు లీక్‌ అయ్యాయని  తెలుస్తున్నది.

- Advertisement -

పిల్లల ఆన్‌లైన్‌ ‌రహస్య జీవితాలు :
భారతీయ బాలలకు స్మార్ట్‌ఫోన్లు, గేమింగ్‌ ‌కన్సోల్స్ ‌పట్ల అధిక మక్కువ చూపుతున్నట్లు తేలింది. పిల్లలు, టీన్స్ ‌తమ వ్యక్తిగత ఆన్‌లైన్‌ ‌సమాచారాలను రహస్యంగా ఉంచుకోవడానికే ఇష్టపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 59 శాతం పిల్లలు తమ ఆన్‌లైన్‌ ఆక్టివిటీలను వాడిన తరువాత చెరిపివేస్తున్నారని తెలుస్తున్నది. సామాజిక మాద్యమాల్లో అపరిచిత వ్యక్తులతో ప్రపంచ సగటు కన్న 11 శాతం అధికంగా భారతీయ బాలలు సంబంధాలను కలిగి ఉన్నట్లు తేలింది. సైబర్‌ ‌బెదిరింపులకు భారతీయ బాలలు 22 శాతం ( ప్రపంచ సగటు 17 శాతం) గురి అవుతున్నారని అర్థం అవుతున్నది. 26 శాతం బాలలు ఆన్‌లైన్‌ ‌హిస్టరీని వాడిన అనంతరం తొలగించడం, పేరెంట్స్ ‌సమీపానికి వచ్చినపుడు 21 శాతం పిల్లలు బ్రౌజింగ్‌ను ఆపేయడం, 15 శాతం బాలలు ఆన్‌లైన్‌ ‌విషయంలో అబద్దమాడడం, పేరెంట్స్‌కు తెలియకుండా 10 శాతం పిల్లలు సాఫ్ట్‌వేర్‌లను వాడడం గమనించారు.

లింగ-ఆధార రక్షణ పక్షపాతం :
బాలల ఆన్‌లైన్‌ ‌భద్రతలో తల్లితండ్రులు బాలురు, బాలికలకు వేరు వేరుగా రక్షణలు కలిపిస్తున్నారని, బాలుర కన్న బాలికల భద్రత పట్ల అధిక ఆసక్తిని తీసుకుంటున్నారని తెలుస్తున్నది. ప్రపంచ స్థాయిలో 23 శాతం పేరెంట్స్ ‌తమ పిల్లల ఆన్‌లైన్‌ ‌హిస్టరీలను పర్యవేక్షిస్తున్నారని, వీరిలో 22 శాతం బాలికల ఆన్‌లైన్‌ ‌సమాచారాలను, 16 శాతం బాలుర సమాచారాలను అమ్మానాన్నలు అవగాహన చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. పిల్లలకు సాఫ్ట్‌వేర్‌ అం‌దించడంలో 44 శాతం బాలికలు, 40 శాతం బాలురను పేరెంట్స్ ‌నియంత్రిస్తున్నట్లు తేలింది. 55 శాతం బాలికలు, 52 శాతం బాలుర కాల్స్, ఆన్‌లైన్‌ ‌సమాచారాలను తల్లితండ్రులు చెక్‌ ‌చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

కుటుంబంలోని సభ్యులు, ముఖ్యంగా పిల్లల ఆన్‌లైన్‌ ఆక్టివిటీలను పర్యవేక్షించాల్సిన అగత్యం పేరెంట్స్ ‌మీద అధికంగా ఉంటుందని అధ్యయన సంస్థ బాధ్యలు తెలుపుతున్నారు. అంతర్జాల సాంకేతికతను అభివృద్ధి సాధనంగా మాత్రమే వాడాలని, దారి తప్పితే భారీ మూల్యం తప్పదని తల్లితండ్రులు గమనించి, పిల్లల్ని సన్మార్గంలో పెంచాలని సూచిస్తున్నారు. స్క్రీన్‌ ‌టైమ్‌, ఆన్‌లైన్‌ ‌సైట్స్, ‌సాఫ్ట్‌వేర్‌ అం‌దుబాటు లాంటి విషయాలను పెద్దలు పర్యవేక్షించాలని తెలుసుకోవాలి.

– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి

Leave a Reply