Take a fresh look at your lifestyle.

‌త్రి దళాల ‘చీఫ్‌’ ‌రావత్‌ ‌దుర్మరణం ..!

  • కుప్పకూలిన చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌  ‌ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్‌
  • ‌తమిళనాడు కూనూరు వద్ద మంటల్లో పూర్తిగా దగ్ధం
  • హెలికాప్టర్‌లో రావత్‌ ‌సహా 14 మంది
  •  ఆయన సతీమణి సహా 13 మంది మృతి
  • ప్రమాదాన్ని ధృవీకరించిన రక్షణశాఖ..
  • నేడు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్న రాజ్‌నాథ్‌
  • ‌రష్యా తయారీ ఆధునిక హెలికాప్టర్‌..‌ప్రమాదాలను తట్టుకుకోవడంలో అత్యధిక సామర్థ్యం

చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ‌ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ‌తమిళనాడులో కుప్పకూలింది. తమిళనాడులోని కూనూరు వెల్లింగ్టన్‌ ‌బేస్‌లో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ ‌రావత్‌, ఆయన భార్య మధులికతో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు, పైలట్‌, ‌కో పైలట్‌, ఏడుగురు ఇతర ఆర్మీ అధికారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున శబ్దం  రావడంతో సమీపంలో ఉన్న స్థానికులు జరిగిన ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే పోలీసులకు, ఫైర్‌ ‌స్టేషన్‌కు, ఇతర అధికారులకు సమాచారం అందించి వారు కూడా బకెట్లతో నీళ్లు పోస్తూ మంటలార్పే ప్రయత్నం చేశారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైన్యం..ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో ఒకరు బిపిన్‌ ‌రావత్‌ ‌రూడా ఉన్నారు. అయితే ఆయన హాసిపటల్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు రక్షణ శాఖ తమ అధికారిక ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించింది.

తమిళనాడులోని కూనూరు సమీపంలో ఈ అత్యున్నత సైనిక హెలికాప్టర్‌ ‌కూలింది. కూలిన చాప్టర్‌ ‌మంటల్లో చిక్కుకోవడంతో అందులోని వారంతా కాలి బూడిదయ్యారని భావిస్తున్నారు. హెలికాప్టర్‌లో  చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ ‌సీడీఎస్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌, ఆయన సతీమణి ఉన్నారని భారత వాయు సేన ధృవీకరించింది. ఇంజిన్‌ ‌వైఫల్యం వల్ల కోయంబత్తూరు, సూలూరు మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. దీనిలో కొందరు రక్షణ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ హెలికాప్టర్‌ ‌ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది. జనరల్‌ ‌రావత్‌ ఉదయం పది గంటలకు దిల్లీ నుంచి బయలు దేరి కోయంబత్తూరులో ల్యాండ్‌ అయి అక్కడి నుంచి కూనూరు బయలు దేరింది. జనరల్‌ ‌రావత్‌ ‌మరో పది నిమిషాల్లో గమ్యం స్థానం అయిన వెల్లింగ్‌టన్‌ ‌డిఫెన్స్ ‌కాలేజీ చేరుకుని అక్కడ ప్రసంగించాల్సి ఉంది.

మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఈ ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు భారత వాయు సేన వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. ఐఏఎఫ్‌ ఇచ్చిన ట్వీట్‌లో, ఐఏఎఫ్‌ ఎంఐ-17‌వీ5 హెలికాప్టర్‌ ‌తమిళనాడులోని కూనూరు సవి•పంలో ప్రమాదానికి గురైందని పేర్కొంది. దీనిలో సీడీఎస్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ఉన్నట్లు తెలిపింది. ఈ హెలికాప్టర్లో జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ ‌లిడ్డర్‌, ‌లెప్టినెంట్‌ ‌కల్నల్‌ ‌హర్జిందర్‌ ‌సింగ్‌, ‌నాయక్‌ ‌గుర్‌సేవక్‌ ‌సింగ్‌, ‌నాయక్‌ ‌జితేందర్‌ ‌కుమార్‌, ‌లాన్స్ ‌నాయక్‌ ‌వివేక్‌ ‌కుమార్‌, ‌లాన్స్ ‌నాయక్‌ ‌బి సాయి తేజ, హవల్దార్‌ ‌సత్పాల్‌ ఉన్నారని తెలస్తుంది. మొత్తం వి•ద దీనిలో 14 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ఈ ‌ప్రమాదాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. బిపిన్‌ ‌రావత్‌ ‌ప్రయాణం చేసింది ఆర్మీకి చెందిన అత్యంత అధునిమైన, చాలా ధృఢమైన ఎంఐ-17 హెలికాప్టర్‌. ఇది 4 వేల పేలోడ్‌ ‌తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్‌ ఇం‌జన్‌ ‌హెలికాప్టర్‌. ‌దీనిలో 24 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌ప్రధాని నరేందర్‌ ‌మోడీకి వివరనించారు. దీనిపై రాజ్‌నాథ్‌ ‌నేడు పార్లమెంటులో ప్రకటనచేసే అవకాశం ఉంది.

హెలికాప్టర్‌ ‌ప్రమాదాన్ని ధృవీకరించిన రక్షణశాఖ..రావత్‌ ‌మరణించినట్లు అధికారిక ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడి
తమిళనాడులో కునూరు వద్ద త్రివిధ దళాధిపతి బిపిన్‌ ‌రావత్‌ ‌ప్రయాణిస్తున్న ఎంఐ-17విఐ హెలికాప్టర్‌ ‌కూలిన ప్రమాద ఘటనను రక్షణ శాఖ ధ్రువీకరించింది. ఇందులో సిడిఎస్‌ ‌బిపిన్‌ ‌రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక, మరో 14 మంది ప్రయాణిస్తున్నారు. కాగా, 13 మంది చనిపోయినట్లు చనిపోయిన వారిలో బిపిన్‌ ‌రావత్‌, ఆయన సతీమణి మధులిక ఉన్నట్లు రక్షణ శాక వెల్లడించింది. ఒకే ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. కాగా, ఈ ప్రమాదంపై కేంద్ర కేబినేట్‌ ‌సమావేశమైంది. ప్రమాద వివరాలను పార్లమెంట్‌లో గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగిందని తెలుస్తున్న నేపథ్యంలో ప్రమాదంపై వైమానిక దళం దర్యాప్తునకు ఆదేశించింది.

1958లో మార్చి 16న ఉత్తరాఖండ్‌లో జన్మించిన బిపిన్‌ ‌రావత్‌ ‌దేశానికి తొలి చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌. 2019 ‌డిసెంబర్‌ 30 ‌నుండి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన తండ్రి లక్ష్మణ్‌ ‌సింగ్‌ ‌రావత్‌ ‌కూడా లెప్టినెంట్‌ ‌జనరల్‌గా పనిచేసి.. పదవీ విరమణ పొందారు. డెహ్రడూన్‌, ‌సిమ్లాలో విధ్యాభ్యాసం పూర్తయింది. నేషనల్‌ ‌డిఫెన్స్ అకాడవి•, డెహ్రడూన్‌లోని ఇండియన్‌ ‌మిలటరీ ఆకాడవి•లో చేరారు. అక్కడే రావత్‌కు స్వాడ్‌ ఆఫ్‌ ‌హానర్‌ ‌లభించింది. డిఫెన్స్ ‌స్టడీస్‌లో ఎంఫిల్‌ ‌చేశారు. చౌదరి చరణ్‌ ‌సింగ్‌ ‌విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పొందారు. నాలుగు దశాబ్దాలుగా ఆర్మీలో కొనసాగారు. పరమ విశిష్ట సేవా మెడల్‌, అతి విశిష్ట సేవా మెడల్‌, ఉత్తమ యుద్ధ సేవ మెడల్‌ ‌వంటి ఎన్నో పథకాలు ఆయన సాధించారు.

రష్యా తయారీ ఆధునిక హెలికాప్టర్‌..‌ప్రమాదాలను తట్టుకోవడంలో అత్యధిక సామర్థ్యం
భారత చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాప్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ‌తన కుటుంబంతో కలిసి ప్రయణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ ఎంఐ 17 ‌వి 5 తమిళనాడులోని నీలగిరి కొండల్లో కుప్పకూలిన హెలికాప్టర్‌కు ప్రపంచంలోనే అత్యాధునిక రవాణా హెలికాప్టర్‌గా పేరుంది. ఇది డబుల్‌ ఇం‌జన్‌ ‌హెలికాప్టర్‌. ‌భద్రతా బలగాల రవాణాకు, అగ్ని ప్రమాదాల కట్టడికి, కాన్వాయ్‌ ఎస్కార్టుగా, పెట్రోలింగ్‌ ‌విధులు, గాలింపు చర్యలు తదితర ఆర్మీ ఆపరేషన్స్‌లో విరివిగా దీనిని ఉపయోగిస్తారు. ఇందులో మొత్తం ముగ్గురు సిబ్బందితో కలిసి 39 మంది ప్రయాణించవచ్చు. ఆధునిక సిస్టంతో పాటు అత్యవసర సమయాల్లో సహకరించే ప్లోటేషన్‌ ‌సిస్టమ్స్ ‌సదుపాయం ఉంది. ఇది సుమారు 4, 500 కిలోల బరువు వరకు మోసుకెళ్లగలదు. ఇక శత్రువుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు రాకెట్లు, 23  మెషిన్‌ ‌గంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను కలిగి ఉంది.

Leave a Reply