Take a fresh look at your lifestyle.

చైనాపై మన వ్యూహం ఎలా ఉండాలి

“‌ప్రపంచవ్యాప్తంగా చైనా పై ఒత్తిడి తేవాలి.ఈ విషయంలో ఇప్పటికే ఒక అడుగు వేశామనే చెప్పవచ్చు. అమెరికా,ప్రాన్స్ ఈ ‌విషయంలో మనకు  మద్దతుగా రావడం. తన చుట్టూ ఉన్న దేశాలను చైనా ఎలా ఆక్రమించుకుందో ప్రపంచానికి తెలియజేయాలి,వాటి పోరాటాలకు మద్దతు ఇవ్వాలి. చైనా హాంకాంగ్‌, ‌తైవాన్‌ ,‌టిబిట్‌ ‌లపై అనుసరిస్తున్న దురాక్రమణ విధానాన్ని,దక్షిణ చైనా సముద్రం,హిందూ మహా సముద్రం పై అనుసరిస్తున్న విధానాలను ప్రపంచ దేశాలకు తెలియజేయాలి. దక్షిణ ఆసియా సమతుల్యతను దెబ్బతీసే చైనా చర్యలను అనగా మాల్దేవ్‌, ‌శ్రీలంక దేశాల్లో చైనా చేపట్టిన ప్రాజెక్టులను ప్రపంచం ముందు ఉంచాలి. కరోనా విషయంలో తాను చేసిన తప్పులను కప్పిపుచ్చే చర్యగానే గాల్వాన్‌ ‌లోయ సంఘటనగా ప్రపంచదేశాలకు తెలియజెప్పి దౌత్యపరంగా చైనాపై ఒత్తిడి తేవాలి.”

ఇప్పుడు ప్రపంచంలో  సూపర్‌పవర్‌ ‌దేశంగా ఎదగాలని  ఆశిస్తున్న చైనా, వర్ధమాన దేశాలకు నాయకత్వం వహించి, సూపర్‌ ‌పవర్‌ ‌పోటీలో ఉన్న ఇండియా మధ్య యుద్ధ మేఘాలు అలుము కుంటున్నాయి.ఈ రెండు దేశాలు కూడా తన ప్రస్థానాన్ని ఇంచుమించు ఒకే సమయంలో ప్రారంభించాయి.1947 లో  భారతదేశం తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తే, 1949లో కమ్యూనిస్టు చైనా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ రెండు దేశాలు సామాజికంగా (విద్య, వైద్యం) ఆర్థికంగా (జిడిపి, వృద్ధి రేటు) ఒకే స్థానం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఆర్థికంగా ఇవి అనుసరించిన వ్యూహాలు (చైనా కమ్యూనిస్టు సోషలిజం,ఇండియా డెమోక్రటిక్‌ ‌సోషలిజం)  కొంత వ్యతసమైన ఒకేలాగా ఉన్నాయి. 1962 సంవత్సరంలో చైనా నమ్మకద్రోహం చేయడం వల్ల భారతదేశం ఓడిపోయి తన కొంత ప్రాంతాన్ని కోల్పోయింది.అయినా అప్పటికీ చైనా, భారత ఆర్థిక బలబలాలు ఇంచుమించు సరి సమానమే. 1991 సంవత్సరంలో వచ్చిన ఎల్పిజి కి అటు ఇటు రెండు దేశాలు ద్వారాలు తెరిచాయి. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక్కఅంశం ఉంది.చైనా ఎల్పీజీని ఉపయోగించుకున్నంతగా మన దేశం ఉపయోగించుకో లేదని చెప్పవచ్చు.2000 సంవత్సరంలో ప్రపంచ జీడీపీలో చైనా వాటా 4.8 ఉండగా,మన దేశ వాటా 1.6% గా ఉంది. 2020 నాటికి చైనా వాటా 16 శాతంగా ఉండగా మన దేశ వాటా 3.9 శాతంగా ఉంది. అంటే ఈ మధ్యకాలంలో చైనా ప్రపంచీకరణను ఎలా ఉపయోగించున్నాదో ఈ విషయం తెలియజేస్తుంది.చైనా  కమ్యూనిస్టు దేశం కావటం,ఓకేపార్టీ వ్యవస్థ ఉండటం,కమ్యూనిస్టు అయిన తన ఆర్థిక విధానాలను మార్చుకొని ప్రపంచీకరణను సమర్థవంతంగా ఉపయోగించుకునే నాయకత్వం ఉండడటం వల్ల చైనా లో అభిరుద్ది సాధ్యమైన ది, కానీ భారతదేశ విషయానికి వస్తే బహులపార్టీ రాజకీయ వ్యవస్థ ఉండడం,విభిన్న రాజకీయ పార్టీల లక్ష్యాలు వేరువేరుగా ఉండటం, సంకీర్ణప్రభుత్వాలు రావడం,మొదలైన కారణాలవల్ల ప్రపంచీకరణను మనం పూర్తిగా ఉపయోగించు కోలేకపోయాం. కానీ ఒక విషయం తప్పక చెప్పగలం, 2020 లో చైనాకు ఆర్థికంగా, సైన్య పరంగా, గట్టి పోటీ ఇచ్చే స్థానంలోనే మనదేశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనించినట్లయితే చైనా కావాలనే మనని కవ్విస్తున్నట్లు కనిపిస్తుంది.దీనికి అనేక కారణాలున్నాయి. అత్యంత ముఖ్యమైనయి. ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నాకు గట్టిగా పోటీ ఇస్తున్న దేశం భారతదేశంగా, చైనా భావించడం.దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ ‌దేశాలతో కలిసి భారతదేశం సైనిక విన్యాసం లో పాల్గొనడం.
తైవాన్‌ ‌ప్రధాని ప్రమాణస్వీకారానికి మన పార్లమెంట్‌ ‌సభ్యులు ప్రభుత్వం తరపున పాల్గొనడం.కరోనా విషయంలో దోషిగా దూషించబడుతున్న చైనా, చైనా ప్రజల,ప్రపంచ ప్రజల దృష్టిని మలచాలనుకోవడం.చైనా ఆర్థిక కారిడార్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌ ‌గుండా పోవడం,భవిష్యత్తులో ఆక్రమిత కాశ్మీర్ను భారత్‌ ‌కలుపుకోవచ్చు అనే అనుమానంతో చైనా ఉండటం. భారతదేశం పై యుద్ధం చేయటం ద్వారా తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలనుకోవడం. పై కారణాల వల్ల చైనా మన దేశాన్ని కవ్వించే పనిచేస్తుంది.గత కొన్ని దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు ఉండవచ్చు, కానీ సైనికుల వీరమరణలు అనే సంఘటనలు లేవు.దీనిని బట్టి  చైనా కావాలనే మనపై కాలు దువ్వుతూ కవ్విస్తోందని అర్థము చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మన వ్యూహం ఇప్పటివరకు ఎలా ఉంది,ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్న వ్యూహం  మూడు అడుగులు వెనక్కు ఆరు అడుగులు ముందుకు అన్నట్లు ఉందని చెప్పవచ్చు. మూడు అడుగులు వెనక్కు అనే విషయాన్ని చర్చిస్తే, మనదేశ 20 మంది సైనికులు గాల్వాన్‌ ‌లోయలో  వీరమరణం పొందిన తరువాత  రక్షణ మంత్రి, చైనా మనదేశంలోకి చొచ్చు కోచిందంటారు, ప్రధాని చైనా మన దేశంలోకి చొచ్చుకు రాలేదని స్వయంగా ప్రకటిస్తారు.చైనా,భారత సరిహద్దులలో జరుగుతున్న వాస్తవ విషయాలు కనీసం పార్లమెంటు సభ్యులు కైనా, ప్రతిపక్షం వారికైనా చెప్పకపోవటం ద్వారా భారత చైనా సంఘర్షణ విషయంలో అన్ని పక్షాలు ఒక తాటిపైకి రాలేకపోవడం.
ఆరు అడుగులు ముందుకు అన్న విషయానికి వస్తే, 1962 నాటి భారత దేశం కాదు 2020 నాటి భారతదేశం అని స్పష్టంగా చైనాకు గట్టి సమాధానం చెప్పటం.సైన్యానికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వటం.భారత దేశంలో వివిధ రంగాల్లో చైనా ప్రాజెక్టులను భారతప్రభుత్వం రద్దు చేసుకోవటం.చైనా యాపులను నిషేధించడం. ఈ విధంగా ఆర్థికంగా దెబ్బ తీయగల నిర్ణయాలు తీసుకొని గట్టి సమాధానాన్ని చెప్పటం. ఏదిఏమైనా ఇప్పుడున్న సందర్భంలో మనం లిమధ్యే మార్గాన్నిలి అనుసరించాలి. అంటే అటు పూర్తి స్థాయి యుద్ధానికి పునుకోవద్దు, కానీ చైనా కు తగిన గుణపాఠం చెప్పాలి. అది సాధ్యమేనా అంటే సాధ్యమే అని చెప్పవచ్చు. పూర్తి స్థాయి యుద్ధానికి దిగకూడదు, ఎందుకంటే కరోనతో ఆర్థిక మందగమనంలో ఉన్న  మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికిప్పుడు  యుద్ధం వస్తే ఇంకా కుదేలవుతోంది. యుద్ధం వస్తే చైనా దిగుమతులు ఆగిపోతాయి,మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సాధించలేదు. ఎందుకంటే మనకు కావలసిన, మెడీషీన్‌ ‌ముడి పదార్థాలు 80 శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి,సౌర పరికరాల విషయంలో 100%, ఎలక్ట్రానిక్‌ ‌విడిభాగాలలో 70% , వినియోగ వస్తువులలో 45%, తోలు వస్తువులులో 40 శాతం దిగుమతుల కొరకు మనం చైనాపై ఆధారపడి ఉన్నాము.
ఇప్పటికిప్పుడు దిగుమతుల విషయంలో మనం స్వావలంబన సాధించలేము,మనం దీర్ఘకాలంలో దానిని సాధించాలి, కాబట్టి పూర్తి స్థాయి యుద్ధానికి దిగకూడదు. అయితే చైనాకు ఎలా బుద్ది చెప్పాలి. ఈ విషయంలో ఇప్పటికీ ఒకటి, రొండు అడుగులు మన ప్రభుత్వం ముందుకు వేసిందని చెప్పవచ్చు. చైనా ప్రాజెక్టులను ప్రభుత్వం రద్దు చేసుకోవడం,59 యాపులను నిషేధించడం. పై విషయాలే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చైనా పై ఒత్తిడి తేవాలి.ఈ విషయంలో ఇప్పటికే ఒక అడుగు వేశామనే చెప్పవచ్చు. అమెరికా,ప్రాన్స్ ఈ ‌విషయంలో మనకు  మద్దతుగా రావడం. తన చుట్టూ ఉన్న దేశాలను చైనా ఎలా ఆక్రమించుకుందో ప్రపంచానికి తెలియజేయాలి,వాటి పోరాటాలకు మద్దతు ఇవ్వాలి. చైనా హాంకాంగ్‌, ‌తైవాన్‌ ,‌టిబిట్‌ ‌లపై అనుసరిస్తున్న దురాక్రమణ విధానాన్ని,దక్షిణ చైనా సముద్రం,హిందూ మహా సముద్రం పై అనుసరిస్తున్న విధానాలను ప్రపంచ దేశాలకు తెలియజేయాలి. దక్షిణ ఆసియా సమతుల్యతను దెబ్బతీసే చైనా చర్యలను అనగా మాల్దేవ్‌, ‌శ్రీలంక దేశాల్లో చైనా చేపట్టిన ప్రాజెక్టులను ప్రపంచం ముందు ఉంచాలి. కరోనా విషయంలో తాను చేసిన తప్పులను కప్పిపుచ్చే చర్యగానే గాల్వాన్‌ ‌లోయ సంఘటనగా ప్రపంచ దేశాలకు తెలియజెప్పి దౌత్యపరంగా చైనాపై ఒత్తిడి తేవాలి. ఈ విదంగా అటు పూర్తి స్థాయి యుద్ధం రాకుండానే చైనాకు బుద్దిచెప్పే చర్యలు తీసుకోవాలి.శాంతి మార్గం లోనే సమస్యకు పరిష్కారం కనుగొనాలి.దానికి లిమధ్యేమార్గమేలి మంచిది. నాకు తెలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో అటువంటి వైఖరి అవలభింస్తున్నట్లు కనిపిస్తుంది. కనిపించడమేకాదు, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి అదే ఉత్తమ వ్యూహం.
జుర్రు నారాయణ, 
టి టి యు జిల్లా.అధ్యక్షులు,
 మహబూబ్ నగర్ ‌, 9494019270.

Leave a Reply