Take a fresh look at your lifestyle.

ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలి

ఇండియన్‌ ‌రెడ్‌‌క్రాస్‌ ‌సొసైటి భద్రాచలం వారు నేడు ఏరియా హాస్పటల్‌ ‌భద్రాచలంకు 15 పల్స్ ఆక్సీమీటర్లు , 5 ఇన్‌‌ఫ్రారెడ్‌ ‌ధర్మామీటర్లు , 30 లీటర్ల శానీటైజర్లు కరోనా నియంత్రించడానికి ఏరియా హాస్పటల్‌ ‌సూపరిడింట్‌ ‌యుగం•దర్‌కు అందించారు. ఈ సందర్బంగా డా. ఎస్‌ఎల్‌ ‌కాంతారావు జిల్లా కన్వీనర్‌• ‌రాజారెడ్డి , వై సూర్యనారాయణ, మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా విచ్చిన్న సమయంలో అంకితభావంతో సేవలు అందిస్తున్న ఏరియాఆసుపత్రులలో వైద్యులు నర్సులు, హాస్పటల్‌ ‌సిబ్బంది అందరిని అభినందించారు. గడిచిన రెండు వారాల నుండి భద్రాచలం పట్టణంలో కరోనా కేసులు వేగవంతంగా వ్యాపిస్తుందని వెంటనే ప్రభుత్వం , జిల్లా కలెక్టర్‌ ‌యంవి రెడ్డి, పిఓ గౌతమ్‌ ‌పొట్రూ నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు.

వ్యాధి నిర్ధారించడానికి రోజుకు ర్యాపిడ్‌ ‌యాంటిజన్‌ ‌పరీక్షలకు 20 మందికి పెంచాలని అదనపు జిల్లా టిబి సెంటర్‌లోని పరికరాలను మెరుగుపరిచి టిసిటి పిసిఆర్‌ ‌పరీక్షలను స్థానికంగా నిర్వహించాలని , కొత్తగా వైద్యులు, నర్సులు, సిబ్బంది తాత్కాలికంగా హాస్పటల్‌లో నియమించాలని కోరారు. భద్రాచలం ఏరియా హాస్పటల్‌ ‌రాష్ట్రంలోని అన్నీ ఏరియా హాస్పటల్‌లో గత మూడు సంవత్సరాల నుండి బెస్ట్ ‌హాస్పటల్‌గా గుర్తింపు పొందిందని తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌, ‌ఛత్తీస్‌ఘఢ్‌, ‌రాష్ట్రాల్లోని పేద గిరిజనులకు ఈ ఆసుపత్రి సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ ప్రాంత మారుమూల గిరిజన ప్రాంత వారి వైద్య సహాయం కొరకు భద్రాచలం ఏరియా ఆసుపత్రి స్థాయికి జిల్లా కోవిడ్‌ ‌హాస్పటల్‌ ‌స్థాయిగా పెంచి కావాల్సిన వెంటిలేన్స్ , ఆక్సీజన్‌ ‌బెడ్స్, ‌మందులు మొదలగు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ ‌సూర్యానారయణ, రాజారెడ్డి, సిద్దులు, డాక్టర్‌ ‌సుబ్బరాజు, లయన్‌ ‌దుర్గాప్రసాద్‌, ‌లయన్‌ ‌హరిశ్చంద్రప్రసాద్‌, ‌లయన్‌ ‌సోమశేఖర్‌, ‌దేశప్ప, రాజశేఖర్‌, ‌డిబి రామరాజు, పాల్గొన్నారు.

Leave a Reply