Take a fresh look at your lifestyle.

ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ‌సర్వీస్‌ ‌సంస్కరణ

“ఐఎఎస్‌ (‌కేడర్‌) ‌రూల్స్, 1954‌లో ప్రతిపాదించిన సవరణలపై కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలు సందర్భోచితంగా మారాయి. ఐఎఎస్‌ (‌కేడర్‌) ‌రూల్స్, 1954 ‌ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నియమించాల్సిన అధికారులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది . అయితే ఏదైనా అసమ్మతి ఉన్నట్లయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అంతిమంగా ఉంటుంది.”

ఐఎఎస్‌ ‌కేడర్‌ ‌నిబంధనల్లో మనం ఏ కోణం ద్వారా సంస్కరణలను చూడాలి? స్థానికత లేదా వారి అఖిల భారత స్వభావానికి ప్రాముఖ్యత ఇవ్వాలా? తమకు కేటాయించిన ఐఎఎస్‌ అధికారుల కెరీర్‌ ‌లపై అధిక హక్కులను ఉపయోగించడానికి రాష్ట్రాలను అనుమతించాలా? వ్యక్తిగత అధికారులు తాము ఎక్కడ సేవ చేయాలనుకుంటున్నారో ప్రత్యేకంగా నిర్ధారించడానికి అనుమతించాలా? ఐఎఎస్‌ (‌కేడర్‌) ‌రూల్స్, 1954‌లో ప్రతిపాదించిన సవరణలపై కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలు సందర్భోచితంగా మారాయి. ఐఎఎస్‌ (‌కేడర్‌) ‌రూల్స్, 1954 ‌ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నియమించాల్సిన అధికారులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే ఏదైనా అసమ్మతి ఉన్నట్లయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అంతిమంగా ఉంటుంది.

విస్తృత స్థాయిలో, ఈ గందరగోళానికి ఉత్తమ సమాధానం డెబ్బై సంవత్సరాల క్రితం, రాజనీతిజ్ఞుడు-నిర్వాహకుడు, పౌర సేవల పోషక సాధువుగా పరిగణించ బడిన సర్దార్‌ ‌పటేల్‌, ‌కొత్తగా సృష్టించబడిన ఉక్కు చట్రం అంచనాల గురించి వ్యక్తం చేసిన మాటల్లో దొరుకుతుంది. ‘‘ఐసిఎస్‌, ఐపి కి వారసులు, ఈ సేవల్లో ప్రస్తుతం ఉన్న విస్తృత అంతరాలను పూరించడమే కాకుండా, దేశం ఐక్యతకు, పరిపాలనా వ్యవస్థ బలానికి దోహదపడుతుంది . ఇంకా సమర్థత, ఏకరూపత ల ఉన్నత ప్రమాణాన్ని అందిస్తుంది.’’ ఐఎఎస్‌ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన యుపిఎస్‌ ‌సి ద్వారా నియమిస్తుంది, కానీ వారి సేవలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉంచబడతాయి. సర్వీస్‌ ‌నిబధనల ప్రకారం రాష్ట్ర, కేంద్ర పరిధి కింద సేవ చేయాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. అయితే, కేంద్ర డిప్యుటేషన్‌ ‌కు కనీస వ్యవధి నిర్దేశించబడలేదు.ప్రస్తుతం, ఒక రాష్ట్రంలో మంజూరు అయిన అధికారుల సంఖ్య లో 40% కేంద్ర డిప్యుటేషన్‌ ‌రిజర్వ్ ‌లేదా సిడిఆర్‌ ‌కింద ఐఎఎస్‌ అధికారులు కేంద్ర డిప్యుటేషన్‌ ‌పై రావచ్చు. గతంలో, సమస్యాత్మక ఈశాన్య ప్రాంతంలో ఉన్న కొన్ని క్యాడర్‌ ‌ల అధికారులు ఢిల్లీలో పని చేయడానికి మొగ్గు చూపేవారు. సిడిఆర్‌ ఉల్లంఘన జరిగేది. ఏదేమైనా, కాలానుగుణంగా రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయి వాతావరణాలు, పరిస్థితులు గణనీయంగా మారాయి – అధికారులకు బహుళ బాధ్యతలు ఉన్నాయి. అందువల్ల వనరుల నిర్వహణ వ్యాప్తి, విధి నిర్వహణ గణనీయంగా సంపన్నమై రాష్ట్రంలో పోస్టింగ్‌ ఆకర్షణీయంగా మారింది. అంతేకాకుండా, డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్‌ ‌స్థాయిలో ఢిల్లీ పోస్టింగ్‌ ‌లు డెస్క్ ‌కే పరిమితమైన పనీ కునుకు తీసే ఉద్యోగాలుగా భావిస్తారు. ప్రజలతో ఎలాంటి సంబంధాలు లేక ప్రయోగాలు, ఆవిష్కరణలకు పరిమిత అవకాశం మాత్రమే ఉంటుంది. అందువల్ల, యువ అధికారులు జాయింట్‌ ‌సెక్రటరీ స్థాయికి చేరుకునే వరకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడాన్ని అనుభవించకుండారాష్ట్రంలోనే గడిపేసే ఇబ్బందికర వింత పరిస్థితి ఉంది.

సిడిఆర్‌ ‌వినియోగం 2011 లో 25% నుండి ఈ తేదీ నాటికి 18% కు పడిపోయింది, కేంద్ర పోస్టింగ్‌ ‌కోసం రాష్ట్రాలు తగినంత సంఖ్యలో అధికారులకు కలిగి ఉండటానికి భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ పూర్తిగా సమర్థనీయం. ఐఎఎస్‌ అధికారులు అన్ని స్థాయిలలో ప్రభుత్వానికి వెన్నెముక గా ఉన్నారు. ప్రతి మంత్రిత్వ శాఖకు కొంతమంది డిప్యూటీ సెక్రటరీలు , డైరెక్టర్లు అవసరం, వారు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కలెక్టర్లు నిర్వాహకులుగా ఆయా రంగాలలో అనుభవాన్ని కలిగి ఉన్నారు, క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల ఆధారిత విధానాలను రూపొం దించడంలో, అమలు చేయడం లో సహాయపడుతున్నారు. కాగా, అధికారులు తరువాత ఎక్కడ కేటాయించబడవచ్చో అనిశ్చితి కారణంగా ఇది రాష్ట్రానికి తమ వంతు కృషి చేయకుండా వారిని నిరోధిస్తుందని కొన్ని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా పనిచేయడం ఐఎఎస్‌ అధికారుల ఉత్తమ ప్రయోజనం అనే విషయాన్ని మరవరాదు.. రెండు స్థాయి ల్లో పని చేయడం ద్వారా వారు దేశవ్యాప్త, రాష్ట్ర-నిర్దిష్ట ప్రణాళిక రెండింటి మిశ్రమంతో తమ స్వంత అనుభవాన్ని సుసంపన్నం చేసుకోగలుగతారు. కేంద్ర విధాన ప్రణాళికలో తమ ప్రయోజనాలు రక్షించుకోవడానికి అటువంటి విజ్ఞానం అనుభవ భాగస్వామ్యం కూడా రాష్ట్రాలకు కీలకం.

రాజకీయ పాలనల వేగవంతమైన మార్పిడి, అధికార దుర్వినియోగం కారణంగా, భారత ప్రభుత్వంలో కంటే రాష్ట్రాల్లో అధిక స్థాయి అనిశ్చితి గురించి అధికారులు తెలుసుకోవడం తప్పనిసరి. ఫలితంగా, అధికారంలో ఉన్న పార్టీకి సన్నిహితంగా ఉన్నవారిని వ్యతిరేకించినందుకు కొంతమందిని తెలివిలేకుండా శిక్షించడం, కేంద్రానికి డిప్యుటేషన్‌ ‌కు వెళ్ళడానికి అనుమతి నిరాకరించడం, విచిత్రమైన అధికారుల బదిలీలను మనం చూస్తున్నాము.మరోవైపు, వారి స్థానిక విధేయత కోసం వారికి లభించిన ఎడతెగని ఆదరణలో మునిగిపోయే అధికారులు ఉన్నారు – వారిని రాష్ట్రానికి శాశ్వతంగా అనివార్యంగా మార్చారు. కొందరైతే ఒక్కసారి కూడా రాష్ట్రం నుంచి వేరే చోట పోస్టింగ్‌ ‌కోసం వెళ్లకుండానే తమ కెరీర్‌ ‌మొత్తాన్ని ముగించుకుంటారు.

ఈ కారణంగా ఐఎఎస్‌ అధికారులు తమ కెరీర్‌ ‌లో కనీసం మూడో వంతు కేంద్ర ప్రభుత్వంలో గడపాల్సిన నిబంధనను సృష్టించడం ముఖ్యం, దీనిలో కనీసం 7 సంవత్సరాలు డిప్యూటీ సెక్రటరీ/డైరెక్టర్‌ ‌స్థాయిలో ఉండాలి. ఐఎఎస్‌ ‌ను కేంద్ర ఉన్నత దళంలా, దేశం పట్ల అంతిమ నిబద్ధతతో, వారు నిర్వహించే రాష్ట్ర కేడర్‌ ‌పట్ల ఎటువంటి సంకుచిత విధేయత లేకుండా రూపొందించడం కూడా అవసరంఅధికారులు రాష్ట్రంలో తమ కంఫర్ట్ ‌జోన్‌ ‌నుండి సమయం గడిపినప్పుడు మాత్రమే – ఢిల్లీలో పనిచేయడానికి సుముఖంగా లేకపోతే మరొక రాష్ట్రం లో పోస్టింగ్‌ ‌కు ఆమోదించాలి. ఐఎఎస్‌ అధికారులు తమఅందచందాలతో ప్రాంతీయ ఆలోచనా ధోరణి విడనాడ గలగాలి. అప్పుడే దేశ ఐక్యతకు ప్రత్యక్ష ప్రయోజనాలు, సర్దార్‌ ‌పటేల్‌ ‌ప్రతిపాదించిన విధంగా పాలనా ప్రమాణాలలో ఏకరూపత తో ఐఎఎస్‌ అధికారులు అఖిల భారత దృక్పథాన్ని నిలుపుకోగలుగుతారు.

మరొక స్థాయిలో, నియామక సమయంలో అధికారులకు కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్రాల్లో నిర్దేశించిన కాలాలకు సేవ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేయాలి.సమ్మిళిత, ఆధునిక మనస్తత్వాన్ని పెంపొందించడానికి, కెరీర్‌ ‌ప్లానింగ్‌ ‌సమీకరణంలో భాగంగా ప్రభుత్వ నిధులతో ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో వారికి శిక్షణను తప్పనిసరి చేయాలి. అధి కారులు తమ సెక్టోరల్‌ ‌స్పెషలైజేషన్‌లు,ఎంపికలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఆన్‌ ‌లైన్‌ ‌వ్యవస్థను రూపొందించాలి.అధికారులు తమ కెరీర్‌లో పరిమిత కాలాల పాటు ప్రైవేట్‌ ‌రంగానికి వెళ్లాలనుకుంటే, ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగం సహకారాత్మకంగా పనిచేయగల పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి, కార్పొరేట్‌ ‌ప్రపంచంలోని ఉత్తమ పద్ధతులను గ్రహించడానికి అనుమతించాలి. ఐఎస్‌ ఎస్‌ అధికారులు ప్రపంచ రంగంలో, కేంద్ర ప్రభుత్వంలో,రాష్ట్రాలలో సమర్ధవ ంతంగా పని చేయడానికి నైపుణ్యం ,అనుభవంతో ఉన్నత స్థాయి దళం గా తీర్చిదిద్దబడినప్పుడు వారిని ఉత్తమంగా ఉపయోగించుకుంటారు.రాష్ట్రాలు వారిని సమర్థవంతంగా ఉపయోగి ంచుకుని, వారి ఉత్తమ సేవలను పొందడానికి అనుకూలమైన పని వాతావరణాన్ని అందించడానికి, కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు, సహనం, పితృస్వామ్య విధానాన్ని అనుసరించడం చాలా ముఖ్యం.

– రాఘవ్‌ ‌చంద్‌
(‌రచయిత మాజీ ఐఎఎస్‌, ‌భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి

Leave a Reply