Take a fresh look at your lifestyle.

రెండో టెస్టులో ఇండియా భారీ విజయం

బదులు తీర్చుకున్న టీమిండియా
317 పరుగుల భారీ తేడాతో ప్రత్యర్థి జట్టు ఓటమి
తొలి మ్యాచ్‌ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. ఇదే స్టేడియంలో తొలి టెస్ట్‌లో ఎదురైన దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. అదే మైదానం.. అవే జట్లు.. కానీ ఒక్క మ్యాచ్‌ ‌వ్యవధిలో ఫలితం మాత్రం తారుమారు. అయ్యింది. పర్యాటక ఇంగ్లాండ్‌ ‌జట్టు 227 పరుగుల తేడాతో తమను ఓడిస్తే ఆతిథ్య జట్టు అంతకు అంతా బదులు తీర్చుకుంది. 317 పరుగుల భారీ తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి దెబ్బకు దెబ్బ కొట్టింది. పరాజయంతో అవమానభారం మూటగట్టకున్న చోటే.. అపూర్వ విజయంతో సగర్వంగా తలెత్తుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్‌ ‌స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ల మాయాజాలంతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. తద్వారా 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ‌రోహిత్‌ ‌శర్మ(161) జట్టును ఆదుకుంటే.. మొత్తంగా 8 వికెట్లు పడగొట్టడమే గాకుండా అద్భుతమైన సెంచరీతో రవిచంద్రన్‌ అశ్విన్‌ ‌గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ‌విరాట్‌ ‌కోహ్లి(62)తో విలువైన 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అటు ఇంగ్లండ్‌ ‌రెండు ఇన్నింగ్స్‌లో కలిపి స్పిన్నర్‌ ‌మొయిన్‌ అలీ(43) టాప్‌ ‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలి టెస్టులో డబుల్‌ ‌సెంచరీతో ఆకట్టుకున్న ఇంగ్లీష్‌ ‌జట్టు కెప్టెన్‌ ‌జో రూట్‌(6, 33 ‌పరుగులు) ఈ మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌ ‌లో జరిగే ఈ పింక్‌బాల్‌ ‌టెస్టులో విజయం సాధించి ఎలాగైనా సిరీస్‌లో ముందంజలో నిలవాలని కోహ్లి సేన భావిస్తోంది. స్పిన్‌ ‌పిచ్‌పై ఇంగ్లండ్‌ను తిప్పేసిన టీమిండియా స్పిన్నర్లు.. 317 పరుగుల భారీ విజయాన్ని కట్టబెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ 5 ‌వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో లెప్టామ్‌ ‌స్పిన్నర్‌ అక్షర్‌ ‌పటేల్‌ 5 ‌వికెట్లు తీయడం విశేషం.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్‌.. ‌రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే చాప చుట్టేసింది. ఇంగ్లండ్‌ ‌బ్యాట్స్‌మెన్‌లో చివర్లో మెరుపులు మెరిపించిన మోయిన్‌ అలీ 43 పరుగులతో టాప్‌ ‌స్కోరర్‌గా నిలిచాడు. మ్యాచ్‌ ‌మొత్తంలో 8 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన అశ్విన్‌ ‌మ్యాన్‌ ఆఫ్‌ ‌ద మ్యాచ్‌గా నిలిచాడు. పరుగుల పరంగా టెస్ట్ ‌క్రికెట్‌ ‌చరిత్రలో టీమిండియాకు ఇది ఐదో భారీ విజయం కావడం విశేషం. ఈ నెల 24 నుంచి అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం మొతెరాలో మూడో టెస్ట్ ‌ప్రారంభం కానుంది. ఈ స్టేడియాన్ని పునర్నిర్మించిన తర్వాత తొలి టెస్ట్ ఇదే కావడం విశేషం. అందులోనూ ఇది డేనైట్‌ ‌టెస్ట్ అవడం మరింత ఆసక్తి రేపుతోంది.

తొలి ఇన్నింగ్స్ అశ్విన్‌ ‌మాయ
రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ ‌పటేల్‌ ‌స్పిన్‌
‌తొలి టెస్టులోనే సత్తా చాటిన అక్షర్‌ ‌పటేల్
‌ ‌లెప్ట్ ఆర్మ్ ‌స్పిన్నర్‌ అక్షర్‌ ‌పటేల్‌.. ‌టెస్ట్ ‌కెరీర్‌కు అద్భుత ఆరంభాన్నిచ్చాడు. అరంగేట్రం చేసిన టెస్టులోనే అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన రెండవ టెస్టులో భారత్‌ 317 ‌పరుగుల తేడాతో నెగ్గింది. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో అక్షర్‌ ‌పటేల్‌ ‌తన బౌలింగ్‌ ‌సత్తా చాటాడు. స్పిన్‌కు అనుకూలించిన చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్‌ ‌బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. 21 ఓవర్లు వేసిన అక్షర్‌.. 60 ‌పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు. ఈ టెస్ట్ ‌మ్యాచ్‌లో అక్షర్‌ ‌పటేల్‌ ‌మొత్తం ఏడు వికెట్లు తీసుకున్నాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న అక్షర్‌ ‌మొదటి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.

ఇదే స్టేడియంలో తొలి టెస్ట్‌లో ఎదురైన దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. స్పిన్‌ ‌పిచ్‌పై ఇంగ్లండ్‌ను తిప్పేసిన టీమిండియా స్పిన్నర్లు.. 317 పరుగుల భారీ విజయాన్ని కట్టబెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ 5 ‌వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో లెఎ•-టామ్‌ ‌స్పిన్నర్‌ అక్షర్‌ ‌పటేల్‌ 5 ‌వికెట్లు తీయడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్‌.. ‌రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే చాప చుట్టేసింది. ఇంగ్లండ్‌ ‌బ్యాట్స్‌మెన్‌లో చివర్లో మెరుపులు మెరిపించిన మోయిన్‌ అలీ 43 పరుగులతో టాప్‌ ‌స్కోరర్‌గా నిలిచాడు. మ్యాచ్‌ ‌మొత్తంలో 8 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన అశ్విన్‌ ‌మ్యాన్‌ ఆఫ్‌ ‌ద మ్యాచ్‌గా నిలిచాడు.

India won the second Test by a huge margin

భజ్జూ భయ్యా సారీ అన్న అశ్విన్‌
‌చెన్నైలోని చెపాక్‌ ‌వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో అటు బంతితోనూ, ఇటు బ్యాటుతోని రాణించి జట్టును విజయానికి కారణమైన రవిచంద్రన్‌ అశ్విన్‌.. ‌భారత మాజీ స్పిన్నర్‌ ‌హర్హజన్‌కు క్షమాపణ చెప్పాడు. భజ్జీ క్రియేట్‌ ‌చేసిన ఓ రికార్డును బద్దలు కొట్టినందుకు క్షమాపణలు చేస్తూ వేడుకున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో 5 వికెట్లు తీసిన అశ్విన్‌.. ‌స్వదేశంలో అత్యథిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భజ్జీని వెనక్కునెట్టి రెండో స్థానానికి చేరాడు. మ్యాచ్‌ అనంతరం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్‌ ‌చేసిన అశ్విన్‌.. ’‌సారీ భజ్జు పా’ అంటూ హర్భజన్‌కు క్షమాపణ చెప్పాడు. దీనిపై స్పందించిన భజ్జీ.. ’నువ్వో ఛాంపియన్‌వి. నువ్వు ఇంతకన్నా గొప్ప రికార్డులు మరిన్ని సృష్టించాలని కోరుకుంటున్నా. గాడ్‌ •-‌లబెస్‌’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ రిప్లై నెటిజన్ల మనసు దోచుకుంటోంది. హర్భజన్‌ను చాలా మంది మెచ్చుకుంటున్నారు.

Leave a Reply